Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Nagulachavitiki Nagendraswaami - Devathalara Deevinchandi - Ranganath, Prabha, Chandra Mohan
నాగుల చవితికి నాగేంద్ర స్వామి, పుట్టనిండా పాలు పోసేము తండ్రి, అంటూ మనము నాగ దేవతను చిన్నప్పుడు అలాగే ఇప్పుడు వేడుకోవటము మనకు తెలిసిందే.
దేవత పూజతో మనకు మానసిక బలము, నియంత్రణ పెరగాలి. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదలాలి, చిత్తశుద్ది వాక్సుద్ది పెరిగి, సహనం ఓర్పు త్యాగాలతో, లోకానికి సమాజానికి మంచి చేస్తూ, దాని ద్వారా మనము మంచిని, అలాగే దైవ పంచభూతాల శక్తిని అండగా పొందాలి.
ఆ ఆధ్యాత్మిక శక్తి మనకు సొంతగా లేనప్పుడు, మానవ శక్తి తగ్గి బలహీనత ఉన్నప్పుడు బీకాంప్లెక్స్ మందులు వేసుకున్నట్లు గా, ఆ ఆత్మ జ్ఞానం ఉన్నవారి నీడలో జీవిస్తూ మాయకు దూరంగా ఉంటూ, వారి మాట జవదాటకుండా ఉండాలి, ప్రతి పని చేసే ముందు అన్ని వారికి చెపుతూ.
ఈశుని మెడలో మాలవు నీవే నాగేంద్ర స్వామి, భక్తుల మదిలో పెన్నిధి నీవే నాగేంద్ర స్వామి, మదిలోని పాపంబు తొలగించు దేవా, హ్రుదిలోన దీపంబు వెలిగించు దేవా, అంటూ ఆ ఆదిశేషునికి మానసిక నైవేద్యం ను సమర్పించాలి.
వెండిది కన్ను, పైడిది కన్ను/ పన్ను/ పడగ వేసేము స్వామి అంటారు కొందరు, బంగారాలు వెండికి, దేవుని అలాగే భక్తిని కొనలేము. పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు గీతలో మరువద్దు, అంటే చిత్తశుద్ది వాక్సుద్ది ఆత్మ నివేదన మాత్రమే దైవం స్వీకరిస్తుంది.
పిండి పాలు నిండు మనసుతో పోసేము స్వామి, చూడండి నిండు మనసు అంటే ఆ కాసేపు కాదు, ఆ జీవత మంతా ఉండాలి. కరుణించి ముత్తైదు కానుకలు గొనుమా, విరిబోణి కన్నియల కోరికలు వినుమా అంటూ, చిత్తశుద్దితో జీవితమంతా పవిత్రముగా ఉంటూ, మోక్షాన్ని కోరాలి.
ప్రాపంచిక భోగాలను కోరామా, వాటి మాయలో, పాతాళానికి పోతాము.
నా.గుల చవితికి నాగేంద్ర స్వామి, పుట్టనిండా పాలు పోసేము తండ్రి..2
ఏడేడు లో.కా.లు, చల్లగా చూ.డు. 2
శాంతి సౌఖ్యాలతో.., మమ్ము కా.పా.డు మమ్ము కా.పా.డు ||నాగుల చవితికి||
ఈశుని మెడలో.., మాలవు నీవే.., నా.గేంద్ర స్వామి ..
భక్తుల మదిలో.., పెన్నిధి నీవే.., నా.గేంద్ర స్వామి ..
మదిలో.ని, పా.పంబు, తొలగించు దేవా.. 2
హ్రుదిలో.న దీ.పంబు, వెలిగించు దేవా..
ఓ ఫణిమండిత, ఓ ఫణి దీపిక, జనగణ బందిత,
నాగరాజా.. నాగరాజా .. నాగరాజా .. ||నాగుల చవితికి||
వెండిది కన్ను.., పైడిది కన్ను.., వే.సే.ము స్వామి
పిండి పాలు.. , నిండు మనసుతో.., పో.సే.ము స్వామి
కరుణించి, ముత్తైదు, కానుకలు గొనుమా 2
విరిబోణి కన్నియల, కోరికలు వినుమా
ఓ మణిమండిత, ఓ ఫణి దీపిక, జనగణ బందిత,
నాగరాజా.. నాగరాజా .. నాగరాజా .. ||నాగుల చవితికి||
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2192 General Articles and views 2,432,683; 104 తత్వాలు (Tatvaalu) and views 262,302
Dt : 10-Sep-2023, Upd Dt : 10-Sep-2023, Category : Songs
Views : 386
( + More Social Media views ), Id : 1914
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Nagulachavitiki ,
Nagendraswaami ,
Devathalara ,
Deevinchandi ,
Ranganath ,
Prabha ,
Chandra ,
Mohan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments