నాలుగు స్తంభాలాట - చినుకుల రాలి నదులుగా సాగి Parody - నరేష్, పూర్ణిమ, ప్రదీప్, తులసి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,040; 104 తత్వాలు (Tatvaalu) and views 224,451.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నీటి చుక్కలమైన మనము, దేవుడనే గంగలో కలసి పోవాలి. దానికి ఎంతో క్రుషి ఉండాలి, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల సాధన ఉండాలి. చెడు సహజముగా వస్తుంది, కానీ మంచి మాత్రం నిత్య సాధన నీతి నియమాలతోనే వస్తుంది, నిలుస్తుంది. అందుకే రోజూ మనసు నుంచి రాయాలి, గుండె నుంచి పాడాలి.

నిరంతర జపం స్మరణ ఉండాలి. దేవుని పాదాలు తాకే పువ్వులం కావాలి, అంటే మన మనసులు మారాలి. మీ ప్రేమ, మా పూజ, మీ నామం, మా ధ్యానం అంటూ తపించాలి. పాపము చెయ్యాలి అంటే, చిగురుటాకు లాగా వణికి పోవాలి మరి. శిశిరమైనా, శిధిలమైనా, విడిచిపోబోకుమా, ధ్యానమై, నిలుపుమా అనాలి.

నిన్నలు నేడై, రేపటి నీడై, మా పూజ పండాలిలే, చివరకు ఆ దైవాన్ని చేరాలిలే, అన్నట్లు మన మాటలు చేతలు పనులు ఉండాలి. మీ ప్రేమ, మా సాధన, మీ నామం, మా త్యాగం, అని చేతలలో చూపగలమా?

నాలుగు స్తంభాలాట లో ఈ పాట ప్రేమికులపై తీసారు. మరి దీనిని కూడా, మనకు అనుకూలగ్ముగా, దేవుడి కి దగ్గరగా అర్ధం మార్చుకుందాము. ప్రాపంచిక మోహము నుంచి, ఆధ్యాత్మిక మోహములోన పదాలు గుర్తుకు రావాలి. మొన్న కూడా చూసారు కదా, దేవుడు ఎంతటి రసికుడు అన్న పాట, పూర్తిగా ఆధ్యాత్మిక ధోరణిలో వెళ్ళింది.

చినుకులా రా.లి, నదులుగా. సా.గి
వరదలై. పోయి, కడలిగా. పొంగు
మీ ప్రేమ, మా పూజ, మీ నామం., మా ధ్యానం.
గంగ మీరు, చుక్క మేము
అనుగ్రహం పొందలేమా..
స్మరణ మీరే, సుమా..

చినుకులా రా.లి, నదులుగా. సా.గి
వరదలై. పోయి, కడలిగా. పొంగు
మీ ప్రేమ, మా పూజ, మీ నామం., మా ధ్యానం.

ఆకులు రా.లే, వేసవి గా.లి, మా పూజ పునస్కారాలే..
కుంకుమ పూసే, వేకువ మీరై, తేవా.లి మనశ్శాంతులే..
ప్రేమను కోరే., జన్మలలోనే., మే వేచి ఉంటాములే..
పాదాలు తాకే, పువ్వులు మేమే, మే వెల్లువవుతాములే..
ఆ దీవెనే చాలులే

హిమములా రా.లి, సుమములై పూ.సి
రుతువులై నవ్వి., సంస్కారమై పొంగు
మీ ప్రేమ, మా పూజ, మీ నామం., మా ధ్యానం.
శిశిరమైనా, శిధిలమైనా, విడిచిపోలేముమా..
ధ్యానమై, నిలుపుమా..

తొలకరి కోసం, తొడిమలు మేమై, అల్లాడుతున్నాములే..
పులకరమూగే, పువ్వుల లాగా, వేసారుతున్నాములే ..
నింగికి నేల, అంటిసలాడే, ఆ పొద్దు రావాలిలే..
నిన్నలు నేడై, రేపటి నీడై, మా పూజ పండాలిలే...
ఆ దైవాన్ని చేరాలిలే..

మౌనమై మెరిసి., గానమై పిలిచి.
కలలతో అలిసి, గగనమై ఎగసి
మీ ప్రేమ, మా సాధన, మీ నామం.., మా త్యాగం.
భువనమైనా, గగనమైనా
దైవ మయమే సుమా... ,సేవ మేమే సుమా..

చినుకులా రాలి, నదులుగా. సాగి
వరదలై. పోయి, కడలిగా. పొంగు
మీ ప్రేమ, మా సాధన, మీ నామం.., మా త్యాగం.

NaluguStambalata - Chinukula Raali naduluga saagi - Naresh, Poornima, Pradeep, Tulasi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,040; 104 తత్వాలు (Tatvaalu) and views 224,451
Dt : 08-Jan-2023, Upd Dt : 08-Jan-2023, Category : Songs
Views : 652 ( + More Social Media views ), Id : 1691 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : nalugustambalata , chinukula , raali , naduluga , saagi , naresh , poornima , pradeep , tulasi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content