నేనొక ప్రేమ పిపాసిని పేరడి, పెద్దల బాధ, ఇంద్ర ధనుస్సు, కృష్ణ, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,125,746; 104 తత్వాలు (Tatvaalu) and views 239,312.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఇంద్ర ధనుస్సు సినిమా చూసారా? మంచి పాట ఇది, ప్రేమికులది. అదే పాటను అదే బాధను, ఒంటరి తల్లి దండ్రులు తమ పిల్లలు దూరంగా విడిచినందుకు ఎలా కుమిలిపోతున్నారో, ఈ మార్పు పాటలో చూద్దాము. రేపు, మనమైనా అలాగే నిస్తేజముగా ఇంట్లో పడి ఉండాలి, ధనము వలన ఇంకా ఎక్కువ ప్రాణహానే గానీ, ఉపయోగము లేదు మిత్రమా.

Parody
పల్లవి:
మేమొక ప్రేమ పిపాసిమి మీరొక వ్యామోహ వాసివి
మా మోహం తీరనిది, మీ హృదయం కరగనిది - 2 సార్లు
మేమొక ప్రేమ పిపాసిమి ....

చరణం : (1)
తలుపు మూసిన తలవాకిటనే, పగలు రేయి నిలుచున్నాం
పిలిచి పిలిచి బదులేరాక, అలసి తిరిగి వెళుతున్నాం - 2 సార్లు
మా మోహం తీరనిది, మీ హృదయం కరగనిది
మేమొక ప్రేమ పిపాసిమి...

చరణం : (2)
పూట పూట మీ పూజ కోసమని పువ్వులు తెచ్చాము
ప్రేమ భిక్షనూ పెట్టగలరని దోసిలి ఒగ్గాము
మీ అడుగులకు మడుగులోత్తగా, ఎడదను పరిచాము
మీరు రారనే విషయం తెలిసీ నలిగిపోయాము
మేమొక ప్రేమ పిపాసిమి...

చరణం : (3)
పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నాం, మీ చెవిన పడితే చాలు
మీ జ్ఞాపకాల నీడలలో, మమ్మల్నెపుడో చూస్తారు
మము మోసంచేసారని తెలిసేలోగా నివురైపోతాము

Original -

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది 2
నేనొక ప్రేమ పిపాసిని....

చరణం : (1)
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా 2
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని...

చరణం : (2)
పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని...

చరణం : (3)
పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

పాట ::- నేనొక ప్రేమ పిపాసిని, చిత్ర విశేషాలు ::- ఇంద్ర ధనుస్సు, విడుదల : 1978,
సంగీత సారధ్యం ::- కె.వి. మహదేవన్, గీతరచయిత ::- ఆచార్య ఆత్రేయ, గాయకులు ::- ఎస్ పి బాలు, నటీ నటులు : కృష్ణ, శారద

NENOKA PREMA PIPAASINI Song Lyrics Written By Acharya Athreya Music Compose By K V Mahadevan Song Sung by S P Balu From INDRA DHANUSSU (1978) MOVIE Star Cast Krishna,Sharadha.

nenoka prema pipasini Parody indra dhanussu Krishna Sharada  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,125,746; 104 తత్వాలు (Tatvaalu) and views 239,312
Dt : 22-Sep-2022, Upd Dt : 22-Sep-2022, Category : Songs
Views : 426 ( + More Social Media views ), Id : 1527 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : nenoka , prema , pipasini , parody , indradhanussu , krishna , sharada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content