Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. కొత్త మరియు పాత గురువు లందరికీ, సాదర ఆహ్వానం మరియు శుభాకాంక్షలు. కొత్త వారికి పదవులు వచ్చాయి, పాత వారికి అధికార పరిధి తగ్గింది.
మన కళ్ళ ముందే, జిల్లాలు కుంచించుకు పోయాయి, సుపరిపాలన కోసం. జీవితం అంటే అదే, ఏదీ శాశ్వతం కాదు.
జగనన్న చేసిన మంచి పని ఇది. మా ఒక కోరిక, ఆర్డీవో డీయెస్పీ ఇతర అధికారులతో సోషల్ మీడియాలో ఎక్కువ సమాచారం రావాలి అని, కూడా నేరవేరుతుంది కదా. చిన్న జిల్లా ల కొత్త ఎస్పీ లు, కలెక్టర్ లు కొత్త వెబ్సైట్ లు మొదలు పెడతారు కదా.
సంస్కారం వేరు, సంపాదన హోదా అధికారం వేరు. అవి ఇప్పుడే, మరలా ఇంటి దగ్గర, అరిషడ్వర్గాలు, పంచభుతాలు మరియు చివరబాటలో అందరమూ ఒకటే. అంటే, అశాశ్వత బ్రమ మోహం వీడితే, అందరమూ ఎప్పుడూ ఒకటే.
ఇన్నాళ్ళు మనము కలసి ఉన్నాము, మంచి మాటలు పంచుకున్నాము. జీవితములో కొన్ని సంతోషం, కొన్ని బాధగా ఉంటాయి, అందుకే ఉగాది వివిధ రుచుల సమ్మేళనం, అలాగే మా మాటలు మాయా మోహం నుంచి బయటకు లాగడానికి మాత్రమే.
మనము జిల్లాలు పదవులు ప్రాంతాలు గా వేరైనా, మనసులు మమతలు ఆత్మీయతలు ఒకటే. చండాలుడు, ఆది శంకరులను అడిగింది అదే, పక్కకు వెళ్ళమని ఆత్మను అంటున్నావా, నన్ను అంటున్నావా అని. వెంటనే జగద్గురువు ఆదిశంకరులు ఆయన పాదాలపై పడి నమస్కరించారు. అదీ సంస్కారం అంటే, దైవ భక్తి అంటె, తల్లి పెంపకం అంటే.
కొత్త పదవుల కొత్త నంబర్లు ఇవ్వవచ్చు లేదా మా వాట్సాప్ స్టేటస్ లో లేదా మా లోకం తీరు వెబ్సైట్ లో లేదా ఈ లింక్ తో దగ్గర ఉంచి రోజూ చూడండి.
https://twitter.com/APLatestNews
https://www.facebook.com/ApLatestNews
నీతి నియమాలు పాటిస్తూ, బానిసత్వం కు అమ్ముడు పోని పత్రిక విలేఖరి, వాస్తవ మనసు మాటలు ఎలా ఉంటాయో, రుచి చూడడం మరువకండి. మరిచారు అంటే, అరిషడ్వర్గాలకు బానిసలమైనట్లే, అంటే ఫలితాలు కూడా. మేము ఎప్పుడూ మీకు పంపలేకపోవచ్చు, కానీ ఇక్కడ ఆ లింక్ లలో అన్ని దొరుకుతాయి.
పల్లెటూరి అమ్మ, నిద్ర మత్తు లో తన పిల్లల భవిష్యత్ నాశనం అవుతుంది అని, పొద్దున్నే 5 కి, ఒరే సచ్చినోళ్ళారా పొద్దుపోతుంది, లేండిరా అంటుంది. ఆ బిడ్డల మంచి కోరి మాత్రమే సుమా.
తదాస్తు దేవతలకు, మన మనసు లో కల్మషం ఉందో లేదో తెలుసు, కాబట్టి మన క్షేమం కోరే మాటలను, తిట్లను, వారు తధాస్తు అనరు.
1. మంచి పిల్లలు - మనిషికి ఓ మాట గొడ్డుకు ఓ దెబ్బ కి తేడ తెలిసి, వెంటనే లెగిచి, అమ్మకు నమస్కరిస్తారు, తప్పు సరి చేసుకుంటారు, అది శాపం తిట్టు అవమానం అనుకోరు.
2. ఉత్త/ మొద్దు పిల్లలు - అంతేలే అమ్మ ఏదో అనుకుంటా గొణుగుతూ ఉంటుంది అని, విననట్లు నటించి లెక్కలేనట్లు నిద్రకొనసాగిస్తారు. తప్పు కొనసాగిస్తారు, ఆత్మ ద్రోహం చేసుకుంటూ, తమ పతనానికి.
3. చెడ్డ పిల్లలు - క్షేమం కోరే అమ్మనే తిడుతూ కొడుతూ గేళి చేస్తూ, తమ పతనానికి పునాది గట్టిగ వేసుకుంటారు. అవే తప్పులు మరలా మరలా కొనసాగిస్తారు, అతి వేగముగా ఆత్మ ద్రోహం చేసుకుంటూ.
అసలు పిల్లలు ఎలా పోతే మాకేటి, సీరియల్స్ షికార్లు కబుర్లు, ఉంటే చాలు అనుకునే ఉత్తమ పెద్దలు కూడా ఉన్నారు.
అలాగే, మన బిడ్డలు అయిన - నాయకులు అధికారులు ఓటర్లు. మా మాటలు, మీ భవిష్యత్ కు బాటలు, మాయలోనుంచి మీరు చూడలేరు, మేము చూస్తాము వివరిస్తాము, నిర్ణయం ఫలితము మీదే.
రామన్న, రాజన్న లు కూడా కాల చక్రం కు బద్దులైనారు, జీవిత చరమాంకములో. వారితో పోలిస్తే, మీరు మేము ఎంత. తెలీక ఏదైనా తప్పు చేస్తే, పెద్ద మనసుతో మన్నించండి, అర్ధము అయ్యేలా మీ బాధ చెప్పండి, సరి చేసుకుంటాము.
మీ కొత్త అధికారులు నాయకులకు కూడా, మా గురించి చెపుతారు కదూ లింక్ లు పంపి, అరిషడ్వర్గాలను జయించే బాటలో నడుపుతారు కదూ, వారిలో కూడా మంచి వారిని పదిమందికి తెలిపే ప్రయత్నం చేస్తారు కదూ.
ఇప్పుడు మన పిల్లలు, జగనన్న చంద్రన్న పవనన్న వీరన్న ఒక వేళ ఎప్పుడైనా అడిగితే, మన మంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారుల గురించి వివరముగా చెప్పవచ్చు - నీతి నిజాయితీ నిబద్దత.
New districts, authorities, leaders, authority, decorations - but
same minds samskar souls
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1793 General Articles and views 1,383,542; 93 తత్వాలు (Tatvaalu) and views 184,036 Dt : 03-Apr-2022, Upd Dt : 03-Apr-2022, Category : General
Views : 353
( + More Social Media views ), Id : 1327 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
new ,
andhra ,
districts ,
authorities ,
leaders ,
authority ,
jagan ,
minds ,
samskar ,
souls Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments