Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Niluvave Vaalu Kanuladana (Parody) - Illarikam - ANR, Jamuna
మొన్న మన వాట్సాప్ స్టేటస్ లో, ఓ పెళ్ళి కొడుకు ప్రకటన ఫోటో చూసారా? ఉద్యోగము చేస్తూ, బాగా సంపాదిస్తూ, ఇల్లు ఆస్తి వీసా ఉన్న వధువు ఉంటే, నేను పెళ్ళి కి సిద్దము అని, ఇంట్లో ఉండి వంట వార్పు, అంట్లు చిమ్మడం, పిల్లల పెంపకం చూస్తూ, భాగస్వామి సేవలో తన బతుకు తలవచుకుని మర్యాద మన్ననలతో గడుపుతానని, లక్షమంది ఉన్న గ్రూప్ లో, తన తల్లి దండ్రులు పెంచిన సంస్కార గుణముతో, రాబోయే ఇల్లరిక భాగ్యాన్ని, ధైర్యముగా ప్రకటించాడు.
ఇక ఆ కాబోయే అత్త మామలకు, దిగులే లేదు, అబ్బాయి ఆశలు తీరిన దాకా, కడుపు నిండిన దాకా. ఒక్కసారి తన ఆశలు తీరి, మాయలు వీడితే, అప్పుడు అసలు సినిమా, విశ్వరూపం అందరికీ మొదలు అవుతుంది. ఈ ప్రకటన చూసి, పొగిడిన వారు, తెగిడిన వారు కూడా ఉన్నారు. అంటే కనీసం నటన కపటం లేకుండా, తన మనసును స్పష్టముగా తెలిపినందుకు మనము కూడా అభినందించాలి.
ఎందుకంటే అంతకన్నా పెద్ద ద్రోహులు మన చుట్టూ ఉన్నారు, 25 ఏళ్ళ దాకా, అమ్మా నాన్నా మీరే మాకు ప్రత్యక్ష దైవాలు, బలాదూర్ తిరగడానికి, రోజూ పెట్రోలు బైకు ధనం ఇస్తే, పగలు చలువ పందిళ్ళలో, రాత్రిళ్ళు మత్తుల పబ్బుల్లో తిరిగి, బతికుంటే పొద్దున్నే ఇంటికి వస్తాము అని చెపితే, నమ్మి, తమ లాగే వీరు దైవ ద్రోహులని తెలిసికూడా, వారి పతనానికి చక్కటి బాటలు వేస్తారు, ధన అహంకార పదవీ వ్యామోహములో.
ఆ పెద్దలకు 60 ఏళ్ళు వచ్చి రోగాలతో లేదా నిస్సత్తువతో మంచం ఎక్కగానే, అనాధాశ్రమములో లేదా ఎవరికో ఒకరికి ధనం విసిరేసి, ఈ పాపులను మీరే దురాశతో చూసుకోండి అని చెపుతారు.
ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనకు మనసు మీద పట్టు లేక. అంటే, మానసిక బలహీనతతో. పెద్దలు ఇలా ఉంటే, ఇంక పిల్లల పరిస్తితి? మరి ఆ మనసును, మానసిక నియత్రణ గలిగిన మహానుభావులు ఎలా అదిరించి బెదిరించి, దానిని సరైన దోవలో పెట్టారో, ఈ పేరడీ పాటలో మీరు చూడవచ్చు, మనసారా పాడుతూ, దైవ ప్రార్ధన చేయవచ్చు సుమీ.
నిలువవే వాలు వంకర పనులదానా, వయ్యారి తెంపరి కంస/హింస నడక దానా, నీ నడతలో ఆలోచనలలో కోరికలలో మోహాలతో మాయలున్నవి చాలా, నువ్వు, ప్రపంచ బ్రమలతో, మమంల్ని నడుపుతువుంటే, మేము పిచ్చి వారిలా పరుగులు తీస్తూ ఉంటే, చివరికి నిలువదె మా బతుకు, ఓ స్తిర బుద్ది లేని మా మనసా, జీవితం పతనమె అని మాకు తెలుసు అని దానికి నయానా భయానా చెప్పాలి మిత్రమా ఇలా.
ఓ మనసా, ఎవరని యెంచుకోనినావో, తాగుబోతు తిరుగుబోతు కపట నటనలు గల, క్రుతజ్ఞత విశ్వసనీయత దైవబలం లేని, బలహీనులని మమ్మల్ని చూసి భ్రాంతి పడినావో, నీకు చిక్కితే మమ్ము సిగ్గు వీడి నడిపెదవో, మాయలో చిక్కించి, కాలాగ్నిలో, మము త్రోసి పోయేవో. ఓమ్మో మనసా, నీతో చాలా జాగ్రత్త గా ఉండాలి సుమీ.
ఓ మనసా, ఒకసారి మము చూడగలవా, చెంత చేర ధైర్యం నీకు ఉందా, దైవమే మాచెంత. వగలాడివే నీ దరికే రాము, నీకు లొంగము, మా బతుకు, మా భాగస్వామి మరియు బిడ్డల బతుకు నాశనం చేయము.
ఓ మనసా, దైవమంటే మోజులేనిదానా, సాధనుంటే బుద్ది మాకు రాదా, ఎందుకే మమ్మల్ని పరుగులు తీయిస్తావు, శాపమా మా పైనా, నువ్వు ఎన్ని మాయలు చేసినా, విశ్వామిత్రునిలా, నీ మాయా జాలంకు, లొంగి పోము.
నిలువవే వాలు పనులదానా, వయ్యారి కంస/హింస నడకదానా
నీ నడతలో మాయలున్నవి చాలా
నువ్వు, ప్రపంచ బ్రమలతో, నడుపుతువుంటే
నిలువదె మా బతుకు..ఓ మనసా..పతనమె అనితెలుసు ||నిలువవే||
1. ఎవరని యెంచుకోనినావో, బలహీనులని భ్రాంతి పడినావో
ఎవరని యెంచుకోనినావో, భ్రాంతి పడినావో, సిగ్గువీడి నడిపెదవో
కాలా.గ్నిలో.., మము త్రోసి పోయేవో
నువ్వు, ప్రపంచ బ్రమలతో, నడుపుతువుంటే
నిలువదె మా బతుకు..ఓ మనసా..పతనమె అనితెలుసు
2. ఒకసారి మము చూడగలవా, చెంతచే.ర ధైర్యం నీకుఉందా
ఒకసారి మము చూడగలవా, ధైర్యం నీకుఉందా, దైవమే మాచెంత..
వగలాడివే.., నీ దరికే. రాము
నువ్వు, ప్రపంచ బ్రమలతో, నడుపుతువుంటే
నిలువదె మా బతుకు..ఓ మనసా..పతనమె అనితెలుసు
3. దైవమంటే మోజులేనిదానా, సాధనుంటే, బుద్ది మాకు రాదా
దైవమంటే మోజులేనిదానా, బుద్ది మాకు రాదా, శాపమా మా పైనా..
నీ మాయా జాలంకు లొంగి పోము
నిలువవే వాలు పనులదానా, వయ్యారి కంస నడకదానా
నీ నడతలో మాయలున్నవి చాలా
నువ్వు, ప్రపంచ బ్రమలతో, నడుపుతువుంటే
నిలువదె మా బతుకు..
ఓ మనసా..ఓ బ్రమలా..ఓ ఆశలా..పతనమె అనితెలుసు
Starring: ANR, Jamuna; Music :T. Chalapathi Rao; Lyrics-Kosaraju; Singers :Ghantasala; Producer:Anumolu Venkata Subba Rao, B. A. Subba Rao; Director: T. Prakash Rao; Year: 1959
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,451; 104 తత్వాలు (Tatvaalu) and views 253,855 Dt : 31-Aug-2023, Upd Dt : 31-Aug-2023, Category : Songs
Views : 400
( + More Social Media views ), Id : 1899 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Niluvave ,
Vaalu ,
Kanuladana ,
Parody ,
Illarikam ,
ANR ,
Jamuna Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments