పార్టీని కాపాడే ధైర్యం, గొంతు లేని, అవకాశ తెదేపా నాయకులు - కానీ పోరాడి గెలిచి జెండా తో జేసీ సోదరులు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,888; 104 తత్వాలు (Tatvaalu) and views 225,714.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

జేసీ సోదరులు, రాష్ట్రములో తెలియని వారు లేరు. పెద్ద గొంతు, మొహమాటము లేకుండా మాట్లాడే తీరు ఎవరినైనా, లోన కుట్రలు ఉండవు, అంతా పబ్లిక్ గానే. కోపము వస్తే అధికారుల మీదకు వెళతారు, అవసరమైతే, అధిష్టానము నైనా ఎదిరిస్తారు. తమ కార్యకర్తల అండ మాత్రమే తమకు ముఖ్యం, పార్టీ తర్వాత, మంచి చెడు తర్వాత. ప్రజల కోసం తమను నమ్ముకున్న అనుచరుల కోసము, ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు అయినా పడతారు. వీడియో చూడండి. ఏ మాత్రము పౌరుషము తగ్గలేదు, తెదేపా జెండా నిలబెట్టిన, ఒకే ఒక మొనగాడు, దివాకర్/ ప్రభాకర్.

ఎంతసేపు తమ సొంత వ్యాపారాలు, గనులు, ఆర్భాటాలు, కుటుంబాలు, అవసరాలు తప్ప, పరువు మర్యాద ఆత్మాభిమానం వ్యక్తిత్వం క్రుతజ్ఞతలు నిబద్దత, ప్రజలతో కలిసే గుణం ఉన్న నాయకులను ఎన్నుకోవడము లో, చంద్రన్న/ లోకెష్ ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఇన్నాళ్ళ అనుభవముతో?

కార్యకర్తలను, పార్టీని కాపాడుకోవాలన్న, ధ్యాసలేని, ధైర్యం గొంతు లేని, పిరికి అవకాశవాద నాయకులతో, చంద్రబాబు మంత్రులు గా ఇన్నాళ్ళు ఎలా నిలిపారు, గడిపారు, నమ్మారు?

బలమైన కార్యకర్తలు, సానుభూతిపరులు ఉండి కూడా, ఘోరమైన అపజయాలకు కారణం, సత్తా లేని టిడిపి నాయకులేనన్న, ఒకనాటి జెసి ప్రభాకర్‌రెడ్డి, వ్యాఖ్యలు అక్షర సత్యం. ఆయన బాటలో కొంత మందైనా, పోరాడి ఉంటే, ఈ రోజు ఇటువంటి ఘోరమైన అవమానం తప్పేది.

కరోనా కు కూడా, తెదేపా నాయకులు జనము మధ్యలో లేరు, 2020 వారి ఫేస్బుకు పేజీలు చూడండి సాక్ష్యం కోసం. గెలవని జనసేన నాయకులు వీధుల్లో ఉంటే, ఇన్నాళ్ళు అధికారం వెలగబెట్టిన, తెదేపా నాయకులు మొఖము చాటు వేసారు, పార్టీల గోడ దూకారు నిస్సిగ్గుగా. చంద్రన్న పరువు పార్టీ పరువు తీసారు. అంటే పార్టీలో ప్రతి ఒకరు, అవకాశవాదులేనా?

ప్రకాశం జిల్లాలో, కరణం మరియు మంత్రి సిద్దా ఇంకొంత మంది గోడ దూకారు. మిగతా వారు ఉన్నా, గట్టి గా గొంతు ఎత్తే స్థితి లో లేరు, మొక్కుబడి గా కొన్ని విమర్శలు చేయడం తప్ప.

అచ్చెన్న, యనమల, దేవినేని లాంటి కొందరు తప్ప, ఎవరూ నోరు ఎత్తి విమర్శలు చేస్తూ, కనీసం కొత్త జనసేన స్థాయిలో కూడా, జనము లో తిరిగే ధైర్యము చేయడము లేదు.

నాయకులు పోతే, కొత్త వారిని తయారు చేసే సత్తా ఉంది అన్న చంద్రన్న మాట దేవుడు ఎరుగు, అధికారం పోతే, కనీసం గతము లో మంత్రులు గా వెలగబెట్టిన నాయకులను, పార్టీలో తోడుగా నిలుపుకునే పరిస్థితి కూడా లేదని, నిరూపించారు.

మొత్తం 75 మున్సిపాల్టీల్లో టిడిపి గెలిచింది, ఒకే ఒక్కటి, అనంతపురం లోని తాడిపత్రి. ఇక్కడ టిడిపి గెలిచిందనే దాని కంటే, అనంతపురం తాడిపత్రి జేసీ సోదరులు గెలిచారంటే కరెక్ట్.

ఎన్ని వేధింపులు ఎదురైనా, ఎన్నిసార్లు అరెస్టు అయినా, కరోనా సమయంలో జైలులో పెట్టినా, పార్టీని గెలిపించాలనే మొండిపట్టుదలతో, జేసీ బ్రదర్స్‌ పోరాడారు. చంద్రన్న వారికి రుణపడి ఉండాలి.

పోరాటానికి, ఫలితం సాధించి చూపెట్టారు. ఇవాళ టిడిపిలో మొనగాడు హీరో ఎవరంటే ఖచ్చితంగా, జెసి ప్రభాకర్‌రెడ్డే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు ఎన్నికలలో ఓడిపోయినా, మున్సిపల్‌ ఎన్నికలను సవాల్‌గా చేసుకుని గెలిచి చూపించి, నిఖార్సయిన నిబద్దత ఆత్మాభిమానం ఉన్న నాయకుడిని అని, మిగతా పిరికి అవకాశవాద దద్దమ్మ, టిడిపి నాయకుల కంటే భిన్నమని నిరూపించారు.

గొప్పలు చెప్పుకుని హీరోల వలే తిరిగిన పిరికి నాయకులు, ప్రతిపక్షం లోకి రాగానే, నిస్సిగ్గు గా పార్టీ మారడమో లేక ఇంట్లో దాంకుని, నాటకము ఆడుతుంటే, జేసీ బ్రదర్స్ మాత్రం, ప్రత్యర్థులతో పోరాడి తెదేపా హీరోలు అయ్యారు రాష్ట్రం మొత్తానికి.

అధికారంలో ఉండి కోట్లు సంపాదించుకుని, అధికారం పోయిన తరువాత తమను వేధిస్తున్నారని చెప్పుకుంటూ, బయట రాష్ట్రాలలో లేదా ఇంట్లో గుట్టుగా, కాలక్షేపము చేస్తున్న అవకాశవాద నాయకులు, వీరిని చూసి ఆత్మాభిమానం తెచ్చుకోవాలి.

తాను లేని సమయంలో, తన ఇంటిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి చొరబడి హంగామా సృష్టించినా, నామినేషన్లు వేసే సమయంలో ప్రత్యర్థులు చేసిన గొడవలను తట్టుకుంటూ, ప్రచారంలో ఆంక్షలను తట్టుకుంటూ, జేసీ సోదరులు విజయఢంకా మోగించారు.

ఈ రకంగా మిగతా టిడిపి నాయకులు కు ధైర్యం, నిబద్దత, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం క్లాసులు ఇప్పుడైనా జేసీతో ఇప్పిస్తారా? మిగతా పార్టీలు కూడా, గోడ దూకిన, నిబద్దత క్రుతజ్ఞతలు లేని పిరికి నాయకులను దూరంగా పెడతాయా? ధైర్యముగా ప్రజా సమస్యలను మాట్లాడని వారు, ప్రజల అండ లేని వారు, ఎప్పటి కైనా, వారు మరలా గోడ దూకుతారు కదా?  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,888; 104 తత్వాలు (Tatvaalu) and views 225,714
Dt : 15-Mar-2021, Upd Dt : 15-Mar-2021, Category : Politics
Views : 769 ( + More Social Media views ), Id : 1035 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : courage , save , party , voice , opportunistic , tdp leaders , jc brothers , diwakar , win , flag
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content