ఇది కధ కాదు జీవితం. రేపు ముదుసలితనములో మన బతుకు ఇంతే, కాళ్ళు చేతులు కదలకపోతే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,694; 104 తత్వాలు (Tatvaalu) and views 239,954.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Not a story, but life, at older age we have to live in same way, legs hands do not move?


*ఇది కధ కాదు జీవితం. రేపు ముదుసలితనములో మన బతుకు ఇంతే. బయట వారు చూడరు, కాళ్ళు చేతులు కదలకపోతే. ధనం/ ఆస్తి/ ఇంకోటి ఏదైనా, మనల్ని చూడడానికి తీసుకునే సొంత బిడ్డలు అయినా, గౌరవం గా దేవతలు గా చూడరు. వారి బుద్ది/ గుణం 15 ఏళ్ళ కే తెలిసిపోతుంది, మనము మాయకు బయట ఉంటే.*

*This is not a story but life. Tomorrow at older age we all have to face/ live in the same way. Outside folks do not see, if the legs and hands do not move. Even if our own children took money/ property/ something to see, they won't see properly and won't respect as God. Their nature/ guna can be known at the age of 15, if we are out of delusion.*

హరి ఇలా చెపుతున్నాడు గిరితో, మీకు తెలిసిన ఎవరికైనా, కష్టం లో ఉంటే, భవిష్యత్ లో భాగస్వామి పిల్లలు మనల్ని చూస్తారా చూడరా, రోగం తో పడితే, సంపాదనపోతే, ముదుసలి తనం వస్తే అనేది, ఇప్పుడే మనకు తెలుసుకునే అవకాశం ఉంది. చివరి నిమిషములో పరుగులు ఆశ్చర్యాలు అవమానాలు, మెట్లమీద నుంచి తోయడం, ఇంట్లో కాల్చడం, దిండుతో గాలి ఆపడం, రోడ్/ ఆశ్రమం మీద విసరడం, ఇంటి ముందు షెడ్ లో అన్నం లేకుండా మాడ్చడం, పనిమనుషులు గొంతు కోయడం తిట్టడం తన్నడం అవసరం లేదు. ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు.

మన చుట్టూ, మామకు వెన్నుపోటు, బాబాయికి గుండెపోటు, తల్లిదండ్రులకు కడుపుపోటు, వేమన బ్రహ్మం రాఘవేంద్ర స్వాములకు గురువు పోటు, దేవుడికి పూజ పోటు, అన్ని నక్క పులి పాము బుద్దులే, రజో తమో గుణ జంతువులే. ధనం పారేయ్, విదిలించుకో, వదిలించుకో. అమ్మా పాలు, మేము అమ్మ గుండె పట్టుకుని తాగుతాం, కానీ జంతు బుద్దులతో పెరిగిన మేము, నిర్దయగా ముదుసలి అదే రజో తమో గుణ అమ్మకు పాలు మాత్రం పనిమనుషులు పడతారు.

విశ్వసనీయత క్రుతజ్ఞత కలిగిన ఆవులు లేవు, ఉన్నా వాటిని గౌరవించము, ప్రొత్సాహం చెయ్యము. మన ద్వారా లక్ష రూపాయలు, సత్వ గుణం వారికి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రతి ఏడాది, మనం పది మందికి చెప్పి ఇప్పించము.

మనకు తెలిసిన వారు, కేవలం భగవద్గీత లో చెప్పిన సత్వ, రజో, తమో గుణాలను బట్టి, గంట ఇరువైపులా మాట్లాడి ఉచితముగా భవిష్యత్ చెప్పగలరు. కధనం రాయగలరు, సొంత వారే ఇది మా కధనం అని కూడా చెప్పలేరు, ఎందుకంటే ఊరు పేరు ఉండదు. 5 ఏళ్ళ తర్వాత సాక్ష్యం గా కూడా ఉంటుంది. అందరూ ఈ 3 కోవలకే చెందుతారు. ఇది గో ఒక ఉదాహరణ చూడు అని ఇలా చెప్పసాగాడు. వారు, ఒకరితో ఇలా మాట్లాడారు విను.

* * *

అబ్బాయి ఎలా ఉన్నారు, అందరూ? ఉద్యోగం ఎలా ఉంది? పిల్లోడి చదువు? మొన్న గంట సేపు స్పష్టం గా బాగా మాట్లాడావు, ఓపికా సహనం తో, తప్పు లు అన్ని ఒప్పకున్నావు పెద్ద మనసుతో, మీరు ఎవరు మీకు ఎందుకు అని తూలనాడకుండా.

ఉదయం 6 నుంచి 8 లోపు ఎదురు చూసా, మరలా మరలా ఫోన్ చేసా, ఈ మంచి మాటలకు, ఓ తల్లికి మన తోబుట్టువుకు మంచి చెయ్యాలని, మంచి బాట వెయ్యాలని. భగవద్గీత లో నల్లనయ్య చెప్పింది ఇదే, మనస్పూర్తిగా నిస్వార్ధముగా ఆచరణలో ప్రయత్నం చెయ్యి, ఫలితం నాకు వదిలెయ్యి. ఆ తర్వాత, అమ్మ పుణ్య ఫలితం, అదీ 8 ఏళ్ళ కు ముందే స్పష్టముగా చెప్పాము.

మనం బుకాయించినా, గమ్ముగా ఉండినా, తాత్సారం చేసినా, ఎదిరించినా, తప్పించుకుని తిరిగినా, వెన్నుపోటు గుండెపోటు నక్క పాము పులి కపటం నాటకం 2 నాల్కల ధోరణి తో, కాలం మరియు పంచభూతాలు మనతో నేడో రేపో, అవే చేష్టలు అవే అబద్ధాలు మాటలు ను నిజం చేసి, అవే కష్టాలు అనుభవింప చేసి కన్నీరు తో జవాబు చెప్పిస్తుంది.

సజీవ గురువు సేవ చేసిన వారి మాటలు పొల్లు పోవు. రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి. వారంతా అవి నిజాలు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కు శిక్షణ తప్పదు అని నిరూపించారు.

అందుకే రోజూ, మనం ఒంటరిగా మౌనముగా, అరగంట-గంట ధ్యానం చేస్తే, మన తప్పు ఒప్పు, మన మనసు/ ఆత్మ మనకు చెబుతుంది. లేదా మనము సజీవ గురువు సేవ చేసే వారి మాట వింటే, అదే ఒప్పు మార్గములో నడుస్తాము, శిక్షణ తగ్గుతుంది. ఇది తమ్ముడు కు, మిగతావారికి పంపు.

నాన్న ఉన్నప్పుడు, నువ్వు మరియు తమ్ముడు, వారం రోజులు దగ్గర ఉండి, మనం చెప్పిన లేదా మీ సొంత ఆయుర్వేదం వాడి, నాన్న వినడం లేదు ఆపేశారు అని చెప్పితే, మనం అప్పుడే నాన్నతో గట్టిగా మాట్లాడే వాళ్ళం, బహుశా మన దగ్గరకు పిలిపించేవాడిని. మీరు దగ్గర ఉంచి సేవ చేయలేకపోవడం, ఆయన మిమ్మల్ని నమ్మి అంగీకరించకపోవడం, ఆయన పతనం లో మన వంతు బాధ్యత కూడా ఉంది అని అంగీకరించావు. సంతోషం. అభినందనీయం.

ఎందుకంటే తప్పుకు 10 రూపాయల శిక్ష అయితే, ఒప్పుకుంటే 7 రూపాయల శిక్షనే, అదే బుకాయిస్తే, తప్పించుకు తిరిగితే, ఇతరులను తూలనాడితే, 15 రూపాయల తప్పు అవుతుంది. రూపాయల లెక్కలో చెపితే, జనానికి అర్ధం అవుతుంది కదా.

ఇది మన కుటుంబ విషయం, మీరు ముగ్గురు మాత్రమే మన ఊళ్ళో ఉన్నప్పుడు, నాన్న చివరగా వేణు గోపాల స్వామి కృష్ణ ధియేటర్ వద్ద కనపడి చెప్పిన, కన్నీటి మాటలు చెబుతా. వద్దు అనుకుంటే మీ ఇష్టం, ఫలితాలు ఆగవు.

మామూలుగా నాన్న చాలా లోతైన మనిషి, తొందరగా బయటపడరు. అలా దాచినందు వలన, పైనలోకం లో మరు జన్మలో పాపమే కానీ, పుణ్యం రాదు. మనసు తేలికగా ఉండాలి, నిజాలు బయటకు రావాలి, మనలో మార్పు రావాలి.

కానీ మన మాటల తీరు, నీకు మొన్న అర్థం అయి ఉంటుంది. ఆయన లేదా ఎవరైనా సరే, మనం వేసే 100 మెలిక ప్రశ్నల పరంపరకు, తెలీకుండానే తమ గుండె లోతుల్లో నుంచి, కోపం ఆవేదన తన్నుకుని బయటకు వచ్చి, తమ తప్పు ఒప్పుకోవాలి లేదా ఉన్న వాస్తవం చెప్పాలి లేదా ఎల్లప్పుడు మనకు దూరంగా ఉండాలి తమ ఖర్మ కాలినదాకా.

నాన్న సంస్కారవంతుడు, వాస్తవం చెప్పారు. అలాగే నువ్వు ఉండాలి, గుణవంతుడిగా స్పష్టమైన సత్వ గుణముతో.

ఇక్కడ జరిగిన ఒక వాస్తవ కధ చెప్పాము కదా, మనం మధ్యవర్తిగా ఉన్నది, చివరికి భార్య భర్త కు నేర్పిన గుణపాఠం, ఇన్నాళ్ళు సర్కిల్ అప్పు ఇళ్ళు అని ఊరేగిన పెద్ద మనిషి బతుకు బస్టాండ్ అయ్యింది చివరకు భాగస్వామి ఊయడం తో, గుర్తు ఉంది అనుకుంటాను. తాను నేర్పిన తప్పుడు విద్యనే, తన మీదే ప్రయోగించారు ఇంట్లో వారు. అందుకే అందరికీ చెపుతా, వాట్సాప్ రీడ్ రిసీప్ట్ కూడా ఆపవద్దు, చాటు కపటం నాటకం వద్దు, అవి మిమ్మల్నే పతనం చేస్తాయి అని. అదే జరిగింది వారి ఇంట్లో.

ఆనాడు అమ్మ ఆశ్రమం కు వెళుతుంటే, ఆపడానికి, పెద్దలు అందరితో మీ మంచి ఆలోచనలు చెప్పి, అమ్మ కు నచ్చ చెప్పించాలని ఆలోచన రాలేదు అన్నావు. దేవుని దయవలన అమ్మ తిరిగి వచ్చింది.

అమ్మ కు ఆలికి మాట కుదరలేదు కొన్ని విషయాలు అన్నావు. మరి మీ పరిణితి ఏమిటి అందులో? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? ఎవరు సర్ధుకోవాలి, ఎలా సర్దుకోవాలి? ఎంతవరకు? ఉదాహరణ చెప్పలేదు.

ఉదాహరణ కు అమ్మ కందిపప్పు అంది, ఆలి పెసరపప్పు అంది. మరి మీ జవాబు ఏమిటి మధ్యవర్తిగా, మాలాంటి వారు, పంచభూతాలు, దైవం మెచ్చిన విధంగా? గమ్ముగా ఉంటే తప్పించుకుని, అది కందిపప్పు నుంచి అశాంతి, కత్తిపీట, కిరసనాయిలు, ఫాన్, మతిమరుపు, కోమా దాకా వెళుతుంది కదా? బాధ్యత గల వ్యక్తి, నీతి నియమాలు లేని రాజకీయ నాయకుడిలా, కాలనీయి/ తగలపడనీయి అని ఊరుకుంటాడా?

అమ్మ ను, మీరిద్దరూ చెరిసగం వేసుకుని, కనీసం ఇక్కడ కు పంపండి, అమ్మ కు ఆయుర్వేదం ఇద్దాం, మానసిక బలం ఇద్దాం, మీరు చేయలేని సేవ మేము చేసి చూపిస్తాము అని చెప్పినా. మరి తమ్ముడు ఏమన్నారు, తనే ఆయుర్వేదం సొంత గా చేసి ఇస్తాను, దగ్గర ఉంచి చూస్తాను అన్నాడా? పోనీ నువ్వు? మేము మీలాగా సజీవ గురువు సేవ చేస్తాము 10+ ఏళ్ళు అని చేయగలరా? పోనీ 5+ ఏళ్ళు?

తమ్ముడు తో నేను కూడా మాట్లాడుతా అంటే, లేదు నేను చెపుతాను. తర్వాత మాట్లాడుదురు అన్నావు. సరే అమ్మ భవిష్యత్తు గురించి, నీ ఆలోచనలు ఏమిటి అంటే, సమయం ఇవ్వండి అన్నావు. ఇంకా మీ ఇద్దరు దగ్గర నుంచి, జవాబు రాలేదు. ఇది మీకు తెలిసిన పాత విషయమే, అమ్మ బాధ్యత, కొత్తగా ఇప్పుడు ఆలోచన ఏమిటి? దానికి ఇన్ని రోజులు ఎందుకు. పోనీ నెల నెలా కొంత పంపుతున్నారా, రేపు ఆసుపత్రి ఖర్చులకు ఉంటాయి అని?

మీకు ఇష్టమైన జవాబు చెప్పవచ్చు, భయం దాపరికం చాటు కపటం నాటకం 2 నాల్కల ధోరణి ఉండకూడదు, మనము మన ముదుసలి తనం లో అదే పడతాం. మేము మిమ్మల్ని దండించము కదా. మీరు సత్వ గుణ అని తెలిస్తే, మీకూ మీ పిల్లలకు మేము సహాయపడతాము. లేదు రాక్షస రజో తమో గుణం అని తేలితే, విధిలేక గమ్ముగా ఉండి, అమ్మ ను చూసే వేరేవారిని ఇప్పుడు నుంచే వెతుక్కుంటాము. ఉదాహరణకు

1) 6 నెలలు అటు ఇటు, నా దగ్గర చిన్నోడి దగ్గర, ఫించన్లు ధనం ఆస్తి సగం సగం తో అనో. 2) లేదు పూర్తి గా నా బాధ్యత నా గురువు నా దైవం, చీ చీ ధనం ఆస్తి ఫించన్లు వద్దు అనో. 3) లేదు మా వలన కాదు, అంతా బాబాయి లేదా అత్తమ్మ కు లేదా బయట ఇచ్చి వారినే చూడమంటాం అనో 4) లేదా అసలు మాకు అనవసరం ఆ తప్పుడు బుద్దులు మేము భరించలేం, మా పిల్లలు చెడిపోతారు, మేము సంస్కారపెంపకం లేక చెడిపోయినట్లు, ఆమె ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోనీ, ఎక్కడ అయినా చావనీ ఉండనీ అనో. ఏదో మీకు ఇష్టం వచ్చిన, మీ సంస్కార జవాబు.

నేను అమ్మ తో చెప్పినా, మేము అక్కడికి వచ్చే లోపు, ఒక ఏడాది సజీవ గురువు సేవ చేయి, ఎవరూ చూడకపోతే, మాతోనే ఉందువు, అప్పుడు మాత్రమే సర్దుకోగలవు మాతో, లేకపోతే కాకర అల్లం వెల్లుల్లి వేప 5 కు లెగవడం ఒకే మాట ఒకే బాట స్తిరత్వం వంటి ఆరోగ్య నియమాలకు పారిపోతావు వారం లో అని.

మా అమ్మ కూడా సజీవ గురువు సేవ చేసింది, నాన్న ను చెల్లెలు ను మద్రాసు 5+ ఏళ్ళు పైగా ఒక్కొక్కరిని, ఒంటరిగా తిప్పి, భాష రాకపోయినా, తోడు గా ఉండి సేవ చేసి, ఎన్నో కష్ట నష్టాలు పడుతూ రైలు/ బస్సు ప్రయాణాలు చేస్తూ.

ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీసులో లాగా, జిల్లా ప్రభుత్వ ఉద్యోగం రాజీనామా చేసి, అమ్మ కు 10+ ఏళ్ళు సజీవ గురువు సేవ మీకు అలాగే ప్రపంచానికీ తెలుసు, ప్రపంచ ఉత్తమ వైద్యం తో, రోజూ కర్రలా ఉండి మైలు నడకతో, 100 గ్రాముల బరువు తగ్గకుండా, నిండు మందు బిళ్ళ నుంచి అర బిళ్ళకు వచ్చింది మీకు తెలుసు. 240+ వారాల 108 ప్రదక్షిణలు చాప నిద్ర శాఖాహారం మీకు తెలుసు. ఇక్కడ ముదుసలి తల్లి తండ్రుల ను చూసేవారు ఉన్నారు, పిల్లలు తో అని కూడా చెప్పినా/ చూపినా.

మా దగ్గర కు రావడం కు ప్రయాణం సగం ఖర్చు, అలాగే ఇక్కడ ఉండే ఖర్చు భరిస్తా అన్నా. నాన్న చనిపోయిన దగ్గర నుంచి, మా ఇంట్లో పైనో కిందో ఉండమని చెప్పినా, ఆమె ఇంటి అద్దె బ్యాంకు లో వేసుకోమన్న. మాతో నచ్చకపోతే, ఎప్పుడైనా వెనక్కి వెళ్ళవచ్చు, నీ ఇల్లు నీ అద్దె నీకే ఉంటుంది కదా అని చెప్పినా. నీ ఆస్తి రూపాయ మాకు వద్దు, ఎవరికైనా ఇచ్చుకో అని చెప్పినా. కధనం కూడా నీకు పంపినా. అది మీ అమ్మే కాదు, ఎవరికైనా అదే పద్దతి. నోటితో 100 అబద్దాలు చెప్పవచ్చు, కానీ రాత పూర్వకముగా, అందరి ఎదురు అన్ని అబద్దాలు అన్ని ఏళ్ళు చెప్పలేము.

బయట వారిమి తడుముకోకుండా ఇన్ని చెపితే, మీ అమ్మకు కూడా సేవలు చేయడానికి రెడీ గా ఉంటే, మరి కడుపు ను పుట్టిన మీకు, ఏళ్ళు నెలలు ఎందుకు పడుతుంది, ఒక భవిష్యత్ నిర్ణయం చెయ్యడానికి, సొంత 9 నెలలు మోసిన తల్లికి?

మీ ఎదిగిన సంస్కార లోపమా లేదా వారి పెంపక లోపమా? మరి రేపు మన సొంత పిల్లల పెంపకం, భాగస్వామి తో సంసారం/ వ్యాపారం అలాగే ఉంటుంది కదా? వారూ మనల్ని ఇలాగే జవాబు లేకుండా నిర్దయగా వదిలేస్తారు కదా? మా పిల్లలు ముదుసలి తనములో వదిలినా పర్లేదు అని ఇప్పుడు అనడం కాదు. అది వచ్చినప్పుడు అనాలి, కానీ అనలేము. కాళ్ళు వేళ్ళు సహకరించవు. ఇప్పుడు నేను పట్టుకోకుండా అమ్మ నడవ గలదా? బయట ధనం ఇస్తే, వారు మైలు నడిపి, అర బిళ్ళకు తెస్తారా, మానసిక బలముతో?

చూస్తున్నాము కదా, చంద్రన్న జగనన్న లే అధికారం (మనం వయసులో) ఉన్నప్పుడు ఒక మాట, రా తేల్చుకుందాం బస్తీ మే సవాల్ అని తొడలు గొట్టి, అధికారం పోగాల్నే (వయసు పోగానే ముదుసలి తనం/ రోగం రాగానే), వామ్మో వాయ్యో ఎక్కడ ఉంది రక్షణ గవర్నర్ గారు కాపాడండి ఈ అన్యాయం చూడండి అన్నారు/ అంటున్నారు, పారిపోతున్నారు ఊరు వదలి. మన ముదుసలి తనము అదే/ అంతే, మానసిక బలహీనులము అవుతాము, సత్వ గుణం వారే మనకు అండ.

పోనీ అమ్మ తప్పు ఉంటే అదీ చెప్పండి, మార్చే ప్రయత్నం చేద్దాం, మీ అందరి గుణాలు మనకు తెలియనివి ఉన్నాయా? సామెత ఉంది కదా, అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక అని, మన/ పెద్దవాళ్ళ/ రాబందుల/ నాయకుల లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అని. మనతో ఎవరు 1 గంట మనసు విప్పి మాట్లాడినా, 6 నెలల చరిత్ర చూసినా, వారి జాతకం గుణ గణాలు మొత్తము మనకు తెలుసు, చేతి మరియు నుదుటి రేఖలు చూడకుండా నే, వారిని పట్టుకోకుండానే, వారిని చూడకుండానే.

మీ అమ్మ కోసం, మీరూ స్పందిస్తారు కదూ వెంటనే? సొంత అమ్మ విషయం లోనే ఇంత నిర్లక్ష్యంగా బద్దకం గా ఉంటే, ఇంక బయట మాలాంటి వారి పనులు/ సేవలు/ సహాయం, నిస్వార్ధముగా మీరు తొందరగా చేయగలరా? దైవ సేవ, సమాజ సేవ, తర్వాత తరాల సేవ చేయగలరా? చిత్తశుద్ది లేని శివ పూజ లేలరా అన్నది ఇందుకే. దైవం అండ ఉంటుందా ఎల్లకాలం?

ఇది కధ కాదు జీవితం. రేపు ముదుసలితనములో మన బతుకు ఇంతే. బయట వారు చూడరు, కాళ్ళు చేతులు కదలకపోతే. ధనం/ ఆస్తి/ ఇంకోటి ఏదైనా, మనల్ని చూడడానికి తీసుకునే సొంత బిడ్డలు అయినా, గౌరవం గా దేవతలు గా చూడరు. వారి బుద్ది/ గుణం 15 ఏళ్ళ కే తెలిసిపోతుంది, మనము మాయకు బయట ఉంటే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,694; 104 తత్వాలు (Tatvaalu) and views 239,954
Dt : 09-Jun-2024, Upd Dt : 09-Jun-2024, Category : General
Views : 144 ( + More Social Media views ), Id : 2109 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : story , life , older , age , parents , legs , hands , move
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content