ఇల్లాలు - ఓ బాటసారి, ఇది జీవిత రహదారి, ఎంతదూరమో - శోభన్‌బాబు, జయసుధ, శ్రీదేవి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1633 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1668 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పాత మంచి పాటలు మాటలు తలచుకునే పంచుకునే ఆలోచన శక్తి ఇచ్చిన ఆ దేవునికి వందనములు. పాత పాటలు లాగనే, మన ముదుసలి అమ్మ నాన్న ను తాత అమ్మమ్మ నాయనమ్మలను కూడా, తలవాలి మరి, దగ్గర ఉంచి రుణం తీర్చుకోవాలి.

మన జీవితము ఓ బస్సు/ రైలు ప్రయాణము లాంటింది. ఎప్పుడు ఏమి అవుతుందో తెలీదు, ఎవరు ఎప్పుడు అవసరానికి కలుస్తారో, అవసరం తీరాక విడుస్తారో తెలీదు, ఆ దోవ అలాగే ఆ వాహనము కూడా మనది కాదు. కాబట్టే వాస్తవం లో ఉండి, మానసిక నియంత్రణ ఉండాలి, ప్రాపంచిక మోహం తగ్గాలి.

ఎవ్వరి పయనం ఎందాకో, అడగదు ఎవ్వరినీ, ఎందుకంటే బదులే దొరకదనీ, తెలీక కొందరు చెప్పరు, తెలిసినా ఇంకొందరు కపటముతో చెప్పరు. ఆ రెంటికి తేడా తెలుసుకోవాలి అంటే, మనము మోహం వీడి ప్రపంచాన్ని, తోటి వారిని చూడాలి.

కాయే చెట్టుకు బరువైతే, చెట్టును భూమి మోస్తుందా? పిల్లలను పెంచలేమని కొందరు, ముదుసలి తల్లి దండ్రులే మా దగ్గర వద్దు అని ఇంకొందరు. మరి వీరికి, ఫలితం? అందుకే ఎన్నో ఉపద్రవాలు కదూ? మనశ్శాంతి లేని జీవితం?

బలవంతాన తెచ్చుకునీ, తల్లివి కాగలవా, తనయుడు కాగలడా, భర్త మరియు భార్య కాగలరా? అందుకే గుణం ముఖ్యము అనేది. జీవితము పై అవగాహన ఉంటే, సీత రాములు గా, అడవులలో నైనా హాయిగా బతికేస్తారు.

అడ్డదారిలో వచ్చావమ్మా, అనుకోకుండా కలిశావమ్మా, మంచిని పంచి ఇచ్చావు, నిప్పును నువ్వే మింగావు, ఇలాంటి మంచివారు ఎందరో, మనకు తారస పడతారు. కానీ వారు దగ్గర ఉన్నప్పుడు, వారి విలువ వీరికి తెలీదు. పోగొట్టుకున్నాక, మరలా ఆ బంధాలు తిరిగి రావు.

ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...2
ఎంతదూరమో ఏది అంతమో, ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకరికి సొంతం కాదు ఇది
ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...

ఎవరు ఎవరికి తోడవుతారో.., ఎప్పుడెందుకు విడిపోతారో...
మమతను కాదని వెళతారో.., మనసే చాలని ఉంటారో...
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరినీ.., బదులే దొరకదనీ.. 2 ||ఓ బాటసారి||

కడుపు తీపికి రుజువేముంది.., అంతకు మించిన నిజమేముంది...
కాయే చెట్టుకు బరువైతే, చెట్టును భూమి మోస్తుందా
ఇప్పుడు తప్పును తెలుసుకునీ...
జరిగేదేమిటనీ క్షమించదెవ్వరిని...2
ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...

తెంచుకుంటివి అనుబంధాన్ని.., పెంచుకున్నదొక హృదయం దాన్ని...
అమ్మలిద్దరూ ఉంటారని, అనుకోలేని పసివాణ్ణి
బలవంతాన తెచ్చుకునీ
తల్లివి కాగలవా తనయుడు కాగలడా..2
ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...

అడ్డదారిలో వచ్చావమ్మా.., అనుకోకుండా కలిశావమ్మా...
నెత్తురు పంచి ఇచ్చావు.., నిప్పును నువ్వే మింగావు...
ఆడదాని ఐశ్వర్యమేమిటో . . .
ఇప్పుడు తెలిసింది.. కథ ముగిసేపోయింది...2
ఓ బాటసారి ఇది జీవిత రహదారి...

చిత్రం : ఇల్లాలు (09.04.1981), తారాగణం : శోభన్‌బాబు, జయసుధ, శ్రీదేవి, రచన : ఆచార్య ఆత్రేయ, సంగీతం : చక్రవర్తి, గానం : జేసుదాస్, శైలజ
O batasari, Illalu, Shoban Babu, Jayasudha, Sridevi

O batasari idi jivita rahadari, Illalu, Shoban Babu, Jayasudha, Sridevi

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1668 General Articles, 64 Tatvaalu
Dt : 03-Oct-2022, Upd Dt : 03-Oct-2022, Category : Songs
Views : 61 ( + More Social Media views ), Id : 1555 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : batasari , jivita , rahadari , illalu , shoban , jayasudha , sridevi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content