పాటతో పరమార్ధం - ఒకటే హృదయం(పేరడీ) - చదువుకున్న అమ్మాయిలు - ANR, శోభన్ బాబు, సావిత్రి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2077 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2112 General Articles and views 1,870,806; 104 తత్వాలు (Tatvaalu) and views 225,327.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Okate Hridayam(Parody) - Chaduvukunna Ammayilu - ANR, Sobhan Babu, Savitri, Krishna Kumari

*పాటతో పరమార్ధం - ఒకటే హృదయం(పేరడీ) - చదువుకున్న అమ్మాయిలు - ANR, శోభన్ బాబు, సావిత్రి, కృష్ణ కుమారి*

పశ్చిమ దేశాల, తిండి బర్గరు మధ్యలో పడి, నలిగే టొమేటో బాధ గురించి, ఆనాడే పాటలో పద్యముగా, ఎంత బాగా చెప్పారో చూడండి. రెండు రొట్టెముక్కల మధ్యన పెట్టారని, ఏల ఇట్లా చింతింతువే, టొమేటో అని చెపుతూ, మన బతుకు కూడా శాంతి అశాంతుల మధ్య, ప్రాపంచిక నాటకములో, అదే విధముగా నలిగిపోతున్నది, మా గతి కూడా కనవే తల్లి అన్న అర్ధము కూడా చెప్పారు.

శాంతి అశాంతి ఏదో ఒకటే ఉంటుంది, మన ఎన్నిక ను బట్టి. 2 వైపులా కపట నాటకము కుదరదు మిత్రమా, ఎల్లకాలము. ఒకటే హృదయం శోధనతో, ఇరువురి దోస్తీ దోషము అని ప్రతి ఒకరు తెలుసుకోవాలి.

ఒకరు ప్రాపంచికం అంటే అశాంతి, ఒకరేమొ ఆధ్యాత్మికం అంటే శాంతి, మధ్య నలిగినాము మానవుడు గా అని అనుకుంటూ నే, 80 శాతం ప్రాపంచికం వైపే మొగ్గు చూపుతారు, మానసిక నియంత్రణ లేక, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలై. ప్రాపంచిక మోహముతో పతనమేనయా, విశ్వదాభిరామ వినుర వేమా అంటూ ఎన్నో పద్యాలు పాటలు గాధలు విన్నాము.

అబ్బే మేము ఇటు శాంతి అటు అశాంతి తో జతగా చెలిమీ కోసము, కపటం నటనం ఆడెదము అంటే అది ద్రోహము మాత్రమే. బ్రమలే బలమై మారితే, శివశివ మనపని ఆఖరే, అందుకే చిత్తశుద్ది లేని శివ పూజ లేలరా అంది.

పురాణాలలో, ఎప్పుడూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, శాంతి గా ఉండే, రామునిదొకటే బాణము, ఒకటే మాట, ధర్మం కాపాడటము మాత్రమే ఆతని ప్రాణము. మరి శాంతికి అదియే నీమము అంటే నియమము, దానికి మానసిక సాధన ఒకటే న్యాయము చేయగలుగుతుంది, ముక్తిని చేరుస్తుంది మిత్రమా.

మనకు ఎందరో మహానుభావులు నిరూపించారు, ఈ మధ్యకాలములో, మనం పుట్టిన తర్వాతనే సుమా. ఇంట్లో పెద్దలను అడగండి, వీరి జీవితాలలో చివరి పేజీలు అర్ధం అయేలా చెప్పమని - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య.

Parody

గుట్టుగా లేతరెమ్మల, కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ..
ఏల ఇట్టుల చింతింతువే, టొమేటో..
శాంతి అశాంతి మధ్య, మాగతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం శోధనతో, ఇరువురి దోస్తీ దోషము 2 ||ఒకటే హృదయం||

ఒకరు ప్రాపంచికం, ఒకరేమొ ఆధ్యాత్మికం
మధ్య నలిగినాము మానవుండు
ప్రాపంచిక మోహముతో పతనమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .

ఆ . . ఓ . .
జతగా చెలిమీ కో.సము, కపటం నటనం ద్రో.హము ఆ . . .
బ్రమలే బలమై మా.రితే, శివశివ మనపని ఆ.ఖరే ||ఒకటే హృదయం||

రామునిదొకటే బా.ణము, ధర్మం ఆతని ప్రా.ణము ఆ . . .
శాంతికి అదియే నీ.మము, సాధన ఒకటే న్యా.యము ||ఒకటే హృదయం||

Original

గుట్టుగా లేతరెమ్మల, కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ..
ఏల ఇట్టుల చింతింతువే, టొమేటో..
అతివలిద్దరి, మధ్య నా గతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం కోసము, ఇరువురి పోటీ దోషము 2 ||ఒకటే హృదయం||

ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .

ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ ఆ . . .
చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే ||ఒకటే హృదయం||

రామునిదొకటే బాణము, జానకి ఆతని ప్రాణము ఆ . . .
ప్రేమకు అదియే నీమము, ప్రేయసి ఒకరే న్యాయము ||ఒకటే హృదయం||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2112 General Articles and views 1,870,806; 104 తత్వాలు (Tatvaalu) and views 225,327
Dt : 03-Oct-2023, Upd Dt : 03-Oct-2023, Category : Songs
Views : 209 ( + More Social Media views ), Id : 1934 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Okate , Hridayam , Parody , Chaduvukunna , Ammayilu , ANR , Sobhan , Babu , Savitri , Krishna , Kumari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content