పర్చూరు వైసిపి ఇంచార్జీ గా, చీరాల నుంచి ఆమంచిని వెళ్ళగొట్టలేక పోతే, తెదేపా యడం ఓకేనా లేక ఇంకో? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,975; 104 తత్వాలు (Tatvaalu) and views 226,125.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* పతనం కుట్రలు, ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో
* చేవ గల మనిషి కీళ్ళు విరిచి, డమ్మీ
* తెదేపా కు 10 ఏళ్లు గా, ఒక స్ధిరమైన
* మంత్రి బాలినేని తన అర్థం లేని
* చీరాల జిల్లా, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు మౌనం
* తెదేపా శాఖ ను బాగు చేయడం?
* వైకాపా అధిష్ఠానం అయోమయంలో?
* పర్చూరు లో కూడా, కరేపాకు లా బాలాజీ?
* ఎమ్మెల్యే ఏలూరి ముందు, దగ్గుబాటి
* ఆమంచి మరియు కరణం అసలు పక్కకు
2 min read time.

పర్చూరు వైసిపి ఇంచార్జీ గా, చీరాల నుంచి ఆత్మాభిమానం గల ఆమంచిని వెళ్ళగొట్టలేక పోతే, తెదేపా నుంచి యడం ఓకేనా లేక ఇంకో డమ్మీ నా?

వాట్సాప్ స్టేటస్ మరువద్దు. చీరాల రాజకీయం మాకెందుకు అనొద్దు, కుళ్ళు పతనం మోసం కుట్రలు, ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో నూ, అదే విధంగా ఉంటాయి కదా. మీ ఊరు కధా ఇంతే, నేడో రేపో.

ప్రజలకు అందుబాటు లో ఉండే చేవ గల మనిషి లేదా నాయకుడి కీళ్ళు విరిచి, డమ్మీ మనుషులను నాయకులను నెత్తిన పెట్టుకోవలన్న తపన, ప్రతి ఇంట్లో అలాగే పార్టీలో కూడా ఉంటుంది సుమా.

సంవత్సరం క్రితం, చాలా కధనాలు రాశాం, ఆనాటి పరిస్థితి ని బట్టి, లింకు లో మిగతా చదవగలరు. link.

చీరాల తెదేపా కు 10 ఏళ్లు గా, ఒక స్ధిరమైన బలమైన కృతజ్ఞత విశ్వసనీయత నాయకుడు ని, తయారు చేసుకోలేని దీనాతి దీన దుస్థితి లో ఉన్న,

తెదేపా అనుభవజ్ఞులై న నేత చంద్రన్న మరియు యువనేత లోకేష్ లు, కొద్ది రోజులు అద్దెకు ఆమంచి తో నడిపించారు, ఆ తర్వాత అద్దంకి లో విఫలమైన కరణం గారితో, ఒంగోలు నుంచే నడిపించారు.

తర్వాత, జగనన్న బాణీ, రాజీనామా తోనే బయట వారికి ఆహ్వానం, అన్న మాట తీసి గట్టున పెట్టి, మంత్రి బాలినేని తన అర్థం లేని అవసరం లేని చాణక్యంతో పక్క దోవలో,

151 ఎమ్మెల్యేలు ఉండి కూడా దురాశతో, జగనన్న కు అపఖ్యాతి అపకీర్తి తెస్తూ,

తెదేపా పార్టీ కి మరియు నాయకులు కు, తన అండతో అభయహస్తం ఇచ్చి,

కరణం తనయుడు కు కండువా చుట్టి, కరణం తో ఒంగోలు నుంచే, చీరాల కు చుట్టపు అతిధిగా, దూర ప్రాంత పాలన కొనసాగిస్తున్న కూడా,

కరణం తమ వర్గం అవడంతో, గమ్ముగా కేవలం పోతుల తో రాజీనాయ పట్టు బట్టి చేయించి, కేంద్రం నే గజగజ లాడించే ప్రయత్నం లో సీబీఐ నే నిషేధించిన మన చంద్రన్న, ఇప్పుడు కళ్ళు మూసుకుని, నిస్సహాయత తో, సిద్ద మునిలా మౌనవ్రతం చేస్తూ, సొంత పార్టీ నాశనమైనా పర్లేదు అని,

వారి అక్రమ సంబంధం ను, మనసారా ఆశీర్వదించి, రెండు ఏళ్లుగా ఒక్క విమర్శ, చీరాల తెదేపా ఫేస్బుక్ లో లేకుండా జాగ్రత్తలు పడ్డారు.

చీరాల జిల్లా, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు లాంటి, ఎటువంటి అభివృద్ధి ధర్నా లు లేకుండా, అందరూ మౌనం గా ఉన్నారు 2 ఏళ్లుగా, సొంత ఊరు అభివ్రుద్ది చైతన్యం లేని ఓటర్లు తో పాటుగా.

మరి కరణం తిరిగి వచ్చిన దాకా, చీరాల తెదేపా నడపడానికి, డమ్మీ నాయకుడు, ఎవరు దొరుకుతారు ఆపద్ధర్మంగా, అని భూతద్దంలో వెతుక్కుంటూ ఉంటే, యడం బాలాజీ గారు, దొరికారు, మీ ఆశలను నేను నెరవేరుస్తానని, పార్టీ శాఖను భూస్థాపితం చేస్తానని మాట ఇచ్చారు.

రెండు ఏళ్లుగా, చీరాల తెదేపా శాఖ ను ఇంచె ఎదగనీయక, కరణం అడుగు లకు మడుగులు వత్తుతూ, విదేశాల్లో తన వ్యాపారాలు చేసుకుంటున్నారు.

ఆఖరికి, మున్సిపల్ ఎన్నికల్లో, వార్డు అభ్యర్థులు కూడా దొరక్కుండా ఉంటే, ఒక్క వార్డు గెలుపు తో కన్నులొట్టపోయినా, ఆ గొప్ప దీన పరిస్థితి కి,

తెదేపా జాతీయ రాష్ట్ర జిల్లా పార్లమెంటు నాయకత్వాలు ఉమ్మడి గా, శభాష్ అని భుజాలు చరచి, చప్పట్లు కొట్టి, అభినందించారు.

మిగతా 3 ఏళ్ళు కూడా, ఇలాగే పతనం కొనసాగించు, అని చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డారు, పదవి నుంచి తొలగించకుండా, ఇంకో డమ్మీ ని పట్టుకోవడం కష్టం అని ముందు చూపుతో.

ఇప్పుడు, అలాంటి ఉత్తమ చేవ గల యడం బాలాజీ గారితో వైసీపీ ఇంచార్జ్ గా, చర్చలు జరుపుతున్న వైసిపి అధిష్ఠానం, పర్చూరు వైసీపీ ని కూడా చీరాల తెదేపా లాగా, వార్డు మెంబర్లు దొరకకుండా తయారు చేయాలని, కోరుతున్నారు అని పుకార్లు వస్తున్నాయి.

* ఆమంచి కి నష్టం చేద్దాం అని, రాష్ట్రంలో తెదేపా నే కాలరాసిన చంద్రన్న ను, చూసాం. ఇప్పుడు బాలినేని, తెదేపా బాటలోనే.

* చీరాల తెదేపా కు, కొత్త మంచి నాయకుడుని తెచ్చేపని చంద్రన్న కు పెట్టి, ఆ పార్టీ చీరాల శాఖ ను బాగు చేయడం, వైసీపీ బాలినేని కి అవసరమా?

* రేపు కరణం రాజీనామా చేస్తే మరలా గెలుపు కు, ఎదురు పోటీ కి, ఆమంచి వద్దా? తెదేపా మరియు వైసీపీ లకు?

* శక్తి సామర్ధ్యాలు ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండే ఉత్తమ గట్టి నాయకులు ను తెస్తామా లేక వార్డు అభ్యర్థులు ను పెట్టలేని వారిని తెస్తామా?

* వైకాపా అధిష్ఠానం ఇంత అయోమయంలో ఉందా? సజ్జల మరియు వేమిరెడ్డి నాయకత్వం, ఇంకా కళ్ళు తెరవదా? వైవీ సుబ్బారెడ్డి గారు, జగనన్న తో మాట్లాడరా? అందరూ సమిష్టి గా జగనన్న కు వెన్నుపోటా?

* చీరాల వైకాపా, తెదేపా లో ఆల్రెడీ కరేపాకు లా వాడేసినా వాడేస్తున్నా, మరలా పర్చూరు లో కూడా, కరేపాకు లా ఉండడం, బాలాజీ గారికి మాత్రం ఉపయోగమా? వారికి మంచి చెప్పే వారు లేరా? డమ్మీ నుంచి, నాయకుడు అయ్యేదెప్పుడు?

* ఒక ఎమ్మెల్సీ, ఒక కార్పొరేషన్ ఆదాయ పదవి లేకుండా, ఎందుకు ఇలా అసమర్థ నాయకుడిగా పేరు తెచ్చుకోవడం, బాలాజీ గారు? మీ నాన్న గారికి ఉన్న మంచి సమర్ధ పేరు నిలబెట్టే ప్రయత్నం చేయండి, దయచేసి.

* పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి ముందు, ఎంత గట్టి నాయకుడు ఉండాలి? దగ్గుబాటి ఓడింది చూడలేదా? ఆమంచి, కరణం లేదా చలాకీగా తిరిగే ఎదిగే యువకుడు ఉండాలి. మరి అలాంటి వారిని పట్టుకోవడం, బాలినేని వల్ల కాదా?

అందుకే అంటారు, అహంకారం లేదా అధికారం ఎక్కువ అయితే, మన గొయ్యి మనమే తీసుకుంటాం అని.

తెదేపా మరియు వైసీపీ లు, రెండూ అదే పనిలో ఉన్నాయి. పార్టీ లో ఉన్న వారు, ఎటూ చెప్పలేరు, మనలాంటి వారు చెపితే వినరూ.

ఇప్పుడు అందుకు తగిన వారు ఇద్దరే, పోతుల మరియు వెంకటేష్. కానీ వారు, చీరాలలో పట్టు కోల్పోతారు.

ఆమంచి మరియు కరణం అసలు పక్కకు పోకూడదు, పోతే, తమ పతనం కు తామే కారణం.

ఇలా పట్టణంలో మరియు జిల్లా లో పుకార్లు, గుసగుసలు, సుమా  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,975; 104 తత్వాలు (Tatvaalu) and views 226,125
Dt : 13-Jun-2021, Upd Dt : 13-Jun-2021, Category : Politics
Views : 831 ( + More Social Media views ), Id : 1201 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : parchur , ycp , in charge , amanchi , chirala , tdp , yadam , dummy , karanam , yeluri , balineni , sajjala , vemireddy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content