Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. వడ్డీ రావణ బాబాయి, మేఘనాధుడు కలసి, అసత్య హరిశ్చంద్ర అనే కొత్త నాటకాలు, అబద్ధాలు, పువ్వులు మొదలు పెడతారు ఏమో, జాగ్రత్తలు సుమా. బాబాయి నోట్లో నుండి వచ్చే, ప్రతిదీ కూడా పచ్చి అబద్దమే అని మరువద్దు. ఇలాంటి వడ్డీ వ్యాపారి కి అది మొదటి నియమం, లేదంటే దివాళా తీయించలేరు జనాన్ని. వడ్డీ ల మీద కోట్లు సంపాదించారు అంటే, కోటి అబద్ధాలు, వందలాది కన్నీళ్ళు.
1. మా అబ్బాయికి వాళ్ళ అబ్బాయి కి స్నేహితం కాబట్టి ఊరికే సీటు ఇచ్చారు
బాబాయి, ఆల్రెడీ చెవిలో పూలు అంటే అబద్ధాలు, నిండి పోయాయి. ఖాళీ లేదు కదా ఇంకా అనవచ్చు.
బాబాయి ఎవరికైనా వడ్డీ లేకుండా ధనం ఇస్తారా? ఆయన సొంత అన్న బిడ్డలకు కైనా ఉచితం గా ఇవ్వరు కదా? సీటు కోసం పదిమంది పోటీపడితే, ఎక్కువ పలుకుబడి పెట్టుబడి, ఉన్నవారికే అది వస్తుంది. రాజకీయంలో ధనం తప్పదు. పోనీ మేఘనాధుడు గాంధీ లాగా ఉత్తమ పనులు తో ప్రజల మనసు దోచారా? ఎప్పుడూ వినలేదు కదా.
2. ఓటు కు సీటు కు 10 కోట్లు అప్పు తెచ్చినాము
ఇవి కూడా అబద్ధాలు. జనం అడగకుండా ఉంటారు అని, ఇంకో పువ్వు. దాన్ని తిప్పి ఆలోచన చేయండి, పది కోట్లు జనం వడ్డీ అసలు ఎగకొట్టినాను వెర్రి జనమా అని అర్ధం, ఇది నిజం కావొచ్చు. అసత్య హరిశ్చంద్ర కదా.
3. జనం కు డబ్బు పంచను. నా దగ్గర లేవు. మా అంత సచ్చీలతతో నిజాయితీగా మాకు ఓటు వేస్తారు.
ఇంకో పువ్వు. మీ సచ్చీలత అందరికీ తెలిసే మీరు కలుగులో దాంకుంటుంది. ధన ప్రవాహం లేని ఎలచ్చన్ ఊరు చూసామా? పైకి పెళ్లి కొడుకు అంటారు, కట్నం తీసుకోలేదు అని. వాస్తవంగా పెళ్లి కూతురు కు, కోటి రూపాయల భూమి ఇచ్చారు, అది చెప్పరు కదా. అలాగే, చీకటి ఒప్పందాలు పంపకాలు ఉంటాయి, అన్ని మనకు చెప్పి పేపర్లో వేయరు కదా. పేపర్లు సినిమాలో కధలు చాలా చూసాం కదా.
కనీసం సంవత్సరం నుంచి, పట్టణ ప్రజలకు కేబుల్ ఉచితం గా ఇచ్చారా, ఇస్తారా? అబ్బా, ఆశ, దోశ, అప్పడం, డబ్బు డబ్బే, వ్యవహారం వ్యవహారమే.
4. మా మేఘనాధుడు జనం కు విపరీతమైన సేవ చేస్తారు
ఇంకో పువ్వు. ఆయనే సరిగ్గా ఉంటే మంగలాయన ఎందుకు, అన్న సామెత తెలుసు కదా. మొదలు, నాన్న అప్పులు తీర్చి, తల్లి దండ్రులు కేబుల్ దగ్గర కూర్చోకుండా, వాళ్ళ కష్టం తగ్గించి, వాళ్ళకు సేవ చేసిన చాలు కదా? వాళ్ళ కే దిక్కు లేదు. మనచే వడ్డీలు ఎగగొట్టబడిన చుట్టాల జనం కు దిక్కు లేదు, సామాన్య జనం కు సేవా?
5. రావణ మేఘనాధులు కుదురుగా లేకుండా అరచుకుంటారు
ఇంకో పువ్వు. మొగుడు పెళ్ళాలు , తండ్రి బిడ్డలు తిట్టుకోవడం మామూలే ఎక్కడ అయినా. అయితే మాత్రము, ఊళ్ళో వాళ్ళ ధనం ఎగకొడతారా? అంత మాత్రాన, ఆస్తి పరాయి వాళ్ళ కు రాయరు కదా? కొడుకు, తూ నీ ఆస్తి వద్దు అంటారా? నిన్న పేపర్లో ఫోటో చూసారు కదా నామినేషన్ కు. డ్రామా లో భాగం. నా మాట వినరు అని ఆవిడ, నా మాట వినరు అని ఆయన, అంతా సినిమా డ్రామా. ధనం ముఖ్యం, బంధం అశాశ్వతమైన ది అని, రావణ కుటుంబ సిద్దాంతం.
6. నా దగ్గర ధనం లేదు, స్ధలం అంటగడతా నా లాభం కోసము
ఓ వైపు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు చెతిలో ధనముతో కాబట్టి, ఇది ఇంకో పువ్వు కదా. నీ స్ధలం ఎలా కొన్నావు అని ప్రభుత్వం కు, రేపు అవసరానికి ధనం కావాలి వెంటనే అంటే, మనం జనం కాళ్ళు పట్టుకుని, సగం రేటు కు అమ్ముకోవడానికి, బాబాయి స్ధలం రేటు లాభం కోసం, మనం తీసుకోవాలా తగిలించుకోవాలా?
అందుకే రావణ షేడ్ ఒకవైపు, అసత్య హరిశ్చంద్ర షేడ్ ఇంకోవైపు. నోట్లో నుంచి లాలాజలం బదులుగా అబద్ధాలు ఊరతాయి, మద్రాసు డాక్టర్లు కు చూపించాలి మేఘనాధుడు. ఇలా ఎన్నో వస్తాయి చిలిపి పువ్వులు, జాగ్రత్తలు సుమా.
7. మా ధనం వేరు, మా బిడ్డ ల ధనం వేరు. వారిది వారికి వెంటనే ఇవ్వాలి, మాది మాత్రం సంవత్సరాలు ఎదురు చూడాలి.
అది నోరా లేక మున్సిపల్ తూమా? అందరి బిడ్డ ల ధనం, మీ బిడ్డ లు ధనం లాంటిది కాదా? బయట అందరికీ 2018 నుంచి మభ్య పెట్టినట్టుగా, మీ పిల్లలకు నచ్చ చెప్పలేరా? మీ సొంత పిల్లలు, మీ మాట వినరా, మిమ్మల్ని నమ్మరా? నమ్మకపోతే, సిగ్గు గా లేదా మీకు? మన కన్నబిడ్డలే నమ్మరు అని.
మేం మీ మాట విని, రెండేళ్లుగా గమ్ముగా ఉంటే, మీ పెంపకం బిడ్డ లు, మీ మాట విని ఆగలేరా? ఊళ్ళోళ్ళ సొమ్ము, మేము ఏళ్ళు తరబడి ఇవ్వలేదు ఇంకనూ, మీరు నా బిడ్డ లే గదా, నేనిస్తాలే వాళ్ళ బదులు తర్వాత.
కార్పొరేషన్ ఎన్నికల్లో, చేతి లిక్విడ్ ధనం పెట్టిన వాడిని, వాళ్ళు డబ్బు కూడా నా దగ్గర ఉంది, చెల్లింపు చేసుకుందాం లే అనరా?
ఒకవేళ మీ లాజిక్ కరెక్ట్ అయితే, మరి మీరు బయట అప్పులు ఇచ్చిన దానికి, మేం మీకు అప్పులు ఇచ్చిన దానికి అసలు సంబంధం ఏమిటి? మీ వ్యాపార నష్టం కు మాకు సంబంధం ఏమిటి? ప్రామిసరీ నోటు మీద, జనం ఎగకొడితే, మేము వడ్డీ లేదా అసలు ఎగకొడతాను అని రాసారా?
పచ్చి అబద్ధాలు, రామరామా, పైన నానమ్మ తాతయ్య తల బాదుకుంటారు. వీడికి ఎందుకు ఇలా, ధన వ్యామోహ పిచ్చి పట్టింది అని. ఇన్ని రోగాలు తో ఎన్నిరోజులు ఉంటారు, ఎంత మూటకట్టి వెంట తీసుకుని వెళతారు పోతూ అని.
దయచేసి ఇప్పుడు అయినా, మా ముదసలి తల్లి ది, పల్లెటూరి తమ్మి ది, ఊళ్ళో చెల్లి ది, మా బాబాయి ది లెక్కలు గట్టి ఇవ్వండి.
ఇప్పుడు నెల నుంచి సాగుతోంది ఈ భారతం, 2018 జులై నుంచి గమ్ముగా ఉన్నాము, అన్ని మూసుకుని ఉన్నాము, మార్పు లేదు.
కానీ మీ కుటుంబం కు దయ, జాలి, కరుణ, కృతజ్ఞత, విశ్వాసం, బంధం, బంధుత్వం, ఆత్మాభిమానం, సిగ్గు, నీతి, నిజాయితీ, తర తమ, ఏవీ ఏ కోశాన లేవు, కళ్ళు తెరవండి. దేవుని శిక్ష కు పాత్రులు కాకండి. కృష్ణా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,337,867; 104 తత్వాలు (Tatvaalu) and views 253,479 Dt : 15-Mar-2020, Upd Dt : 15-Mar-2020, Category : General
Views : 1142
( + More Social Media views ), Id : 410 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
babai ,
uncle ,
people money ,
politics Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments