కులదైవం-పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు-గుమ్మడి,జగ్గయ్య, అంజలీదేవి,కృష్ణ కుమారి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,089; 104 తత్వాలు (Tatvaalu) and views 226,042.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సొంత వాళ్ళ కోసం కాయా కష్టం చేసి, ఇటుక ఇటుక పేర్చి, కోట్లు కూడ బెడితే, చివర సొంతవారు అందరూ వదిలేస్తే, చీదరించుకుంటే, మన బతుకు ఎలా ఉంటుందో, ఆఖరుకు మందులు కు కూడా ధనం లేని పరిస్తితి.

కానీ యుక్త వయస్సులో ఎవరికీ ఇవి అర్ధం కావు, అబ్బో ఏమిటో ఈ సుత్తి అనుకుంటారు, ముదుసలి వయస్సులో వారి బాధ కూడా ఇతరులకు సుత్తి తలనొప్పే కదా.

చూడండి ఈ పాటలో జీవిత సత్యం, ప్రతి ఇంటిలో ఏదో ఒక వేదన ఉంటుంది, ఈ పాటలాగే. నీతి నిజాయితీ గల పక్షి జీవితం పాట రూపంలో చెప్పినా, అది మనిషి జీవితమే.

తీరెను రోజులు నీకీ చోటుకు, పొమ్మా ఈ చోటు వదలి అంటే, మన బతుకు ఏమిటి? ఇంట్ళో ఎవరు ఎవరి మాట వినకపోతే? ఎవరికి వారే, ఏదో నాటికి, ఎరుగము, ఎటకో, ఈ బదిలీ. అవునా?

మూడు దినాల, ముచ్చటయే, ఈ లోకం లో మన మజిలీ అని గుర్తు ఎరిగి ఉండాలి మన అందరమూ, నిజాయితీగా ధర్మపథాన నడవాలి ధైర్యమే తోడు గా. మరి ఎంత మంది నీతి నిజాయితీగా, ఒక్క మాట బాట పై ఉన్నామో కదా?

పుల్ల పుడక, ముక్కున కరచి, గూడును కట్టితివోయి. వానకు తడిసిన, నీ బిగి రెక్కలు, ఎండకు ఆరినవోయి. ఫలించ లేదని చేసిన కష్టం, మదిలో వేదన వలదోయి. రాదోయి సిరి, నీ వెను వెంట, త్యాగమే నీ చేదోడు. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, ఎంతమందిమి త్యాగం చేసాము? మనకోసం ఎంతో మందిని త్యాగం చేయించాము కదూ?

ఓర్వలేని ఈ జగతికి నీ పై లేవే కనికారాలే, మనకు ముందు కనికరం ఉండాలి కదా? కరిగి కరిగి కన్నీరై, కడతేరుటే నీ తల వ్రాలి, చివరకు. అందుకే ముందే మేలుకొని, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించాలి.

ఎన్నడో తిరిగి, ఇటు నీ రాకా, ఎవడే తెలిసిన వారు?

పయనించే...ఓ... చి.లు.కా ...2
పయనించే ఓ చిలుకా... ఎగిరిపో..., పాడైపోయెను గూడు... 2
పయనించే ఓ చిలుకా... ఆ...

తీరెను రోజులు నీకీ కోమ్మకు..., పొమ్మా ఈ చోటు వదలి 2
ఎవరికి వారే, ఏదో నాటికి..., ఎరుగము, ఎటకో, ఈ బదిలీ
మూడు దినాల, ముచ్చటయే.ఏ.ఏ., 2 ఈ లోకం లో. మన మజిలీ
నిజాయితీ.గా., ధర్మపథా.న...2 చనుమా... ధైర్యమే తోడు ||పయనించే || 1

పుల్ల పుడక, ముక్కున కరచి..., గూడును కట్టితివో.యి.. 2
వానకు తడిసిన, నీ బిగి రెక్కలు..., ఎండకు ఆ.రినవో.యి.
ఫలించ లేదని చేసిన కష్టం...2, మదిలో వేదన వలదోయి
రాదోయి సిరి, నీ వెను వెంట 2, త్యాగమే నీ చేదోడు ||పయనించే || 2

మరవాలి, నీ కులుకుల నడలే..., మదిలో నయగారాలే 2
తీరని వేదన, తీయని ముసుగే, శిరస్సున శింగారాలే...
ఓర్వలేని ఈ జగతికి నీ పై... ఈ.ఈ.2 లేవే కనికారాలే
కరిగి కరిగి కన్నీరై...2 కడతేరుటే నీ తల వ్రాలి ||పయనించే || 3

గోడుమని, విలపించేరే ...,నీ గుణము తెలిసిన వారు.. 2
జోడుగ నీతో, ఆడీ పాడీ... కూరుము లాడిన వారు
ఏరులైయే కన్నీరులతో..., మనసారా దీవించే.రే..
ఎన్నడో తిరిగి, ఇటు నీ రాకా, ఎవడే తెలిసిన వారు ||పయనించే || 4

Payaninche O Chiluka, Ghantasala, Kuladaivam, Gummadi, Jaggaiah, Anjali Devi, Krishna Kumari  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,089; 104 తత్వాలు (Tatvaalu) and views 226,042
Dt : 28-Dec-2022, Upd Dt : 28-Dec-2022, Category : Songs
Views : 530 ( + More Social Media views ), Id : 1668 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : payaninche , chiluka , ghantasala , kuladaivam , gummadi , jaggaiah , anjali , devi , krishna , kumari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content