పోలీసులు - ఇంటి పెద్ద శ్రద్ధగా పనిచేస్తే, ఇంట్లో అందరూ కూడా, బాగా పని చేస్తారు కదూ - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2033 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2068 General Articles and views 1,791,948; 104 తత్వాలు (Tatvaalu) and views 217,705.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పేపరు ఫోటో చూడండి, ఈనాడు మన ఊరు విభాగం లో ఉంది, జిల్లా ఎడిషన్ లోపలి పేజీ ల్లో ఎక్కడో చూసాను. మన చీరాలకు తండ్రి లాంటి వారు, డిఎస్పీ గారు కూడా రోడ్డుపై నిలబడి, కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఇంటి పెద్ద శ్రద్ధగా పనిచేస్తే, ఇంట్లో అందరూ కూడా, ఆటోమేటిక్ గా ఇంకా బాగా పని చేస్తారు కదా. నిజంగా ఇది చాలా గొప్ప పని.

ఎండల్లో అంత సేపు ఉండాలి అంటే, చాలా కష్టం ఎవరికైనా. 2016 లో నోట్ల రద్దు అప్పుడు, వన్ టౌన్ సీఐ లేదా ఎస్సై గారు అనుకుంట, బాంకు దగ్గర మేనేజర్ గారి తో, ఉన్నప్పుడు మాట్లాడాను. నవ్వుతూ బాగా మాట్లాడారు. అమ్మో, ఆ టైం లో, ఏటీయం జనం కష్టాలు బందోబస్తు గురించి చెప్పారు, నేనూ కళ్ల తో చూసాను. బాంకు మేనేజర్ గారు, మీ పరిస్థితి ఏమిటి అక్కడ అని అడిగారు నన్ను? మా చేతిలో చిల్లిగవ్వ ఉండదు కదండి, ఈ కష్టాలు లేవు, అంతా వైటే అంతా గీకే కార్డు లే కదా అంటే, నవ్వారు అందరూ.

మన పోలీసులు కు ధన్యవాదాలు. మంచి నీతి నిజాయితీ కోసం, ప్రాణాలు ఇచ్చే పోలీసులు కూడా ఉంటారు, మరువద్దు. వారు ఎక్కడ కనపడ్డా నవ్వుతూ, మనం కూడా పలకరించాలి.

మా అమెరికా పోలీసులు ఇక్కడ అయితే, పెద్దావిడ మా అమ్మ గారితో కూడా నవ్వుతూ ఫోజులు ఇచ్చి, ఫోటోలు దిగుతారు. కొందరికి చూపించాను, వచ్చినప్పుడు. సామాన్య జనాన్ని నెత్తిన పెట్టుకొని చూస్తారు, కలసి పోతారు. సంవత్సరం కు ఒకటి రెండు ప్రోగ్రాం లు పెట్టి ప్రతి పేటలో, జనం తో కలుస్తారు టీ బిస్కెట్లు ఇచ్చి మరీ, భయం పోవాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా. నెలకి ఏదో ఒక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది పోలీసులతో జనం కు.

ఏ సమాచారం అయినా కూడా వారికి అందుతుంది, చాలా తేలికగా. చాలా కేసు లు తేలికగా పరిష్కారం అవుతాయి కదా, జనం అంతా నమ్మకం గా క్లూలు సాక్ష్యం ఫోటోలు ఇస్తే వెంటనే. ఇది అందరికీ లాభం కదా. ప్రతి చోట మంచి చెడూ కూడా ఉంటుంది, మన ఇంట్లో లాగనే. అందరూ చెడ్డ వారు ఉండరు కదా.

చీరాల పేపర్ ఆన్లైన్లో మేము చూడాలి అంటే, వరుస ఆప్షన్లు సెలక్ట్ చేసుకుంటూ పోవాలి, మన ఊరు పేరు పేజీ రావడానికి. ఓపిక లేక ఆగిపోతే ఇక చూడము, అంటే మన ఊరు పట్టణ పోలీసు వ్యవస్థ పడే తపన, కష్టం, గొప్పతనం మరియు మన రక్షణ గురించి చర్యలు, మనందరమూ చూడలేము. చీరాల మండలం లో ప్రతి ఒక్కరికీ తెలియాలి, అప్పుడే పోలీసులు కష్టం, జనం మనసు కు తాకుతుంది.

స్పీడుగా ఉండే అమెరికా లో నే, మన ఊరు వార్తలు చూడటం మాకు కష్టం గా ఉంటే, లోకల్ వాళ్ళు ఇవి అసలు చూడరు, ఇంత లోతుగా వెళ్లి కదా. ఇంటికి న్యూస్ పేపర్ వేయించడం, ఇప్పుడు జనం తగ్గించారు అని అంటున్నారు, ఇంకా తగ్గుతుంది ఇంటర్నెట్ వాడకం పెరిగితే.

గుర్తు ఉందా, మొన్న జిల్లా ఎస్పీ గారికి మరియు డీఎస్పీ గారికి, చీరాల మండలం ఫేస్బుక్ పేజీ ఉంటే, ఎంతో ఉపయోగం అని, మన లోకల్ హీరోల కష్టం కూడా అందరికీ తెలియాలని విన్నవించాము. చీరాల ఫేస్బుక్ పేజీ అయితే, ఈ పేపర్ ఫోటోలు అప్లోడ్ చేసినా చాలు.

మనందరం చాలా తేలికగా చూడవచ్చు ఎక్కడ ఉన్నా కూడా, గూగుల్ వెతుకులాటలో కూడా వస్తాయి. ఎక్కువ మందికి చేరతాయి. తొందరలోనే ఎస్పీ గారు లేదా డిఎస్పీ గారు, మన కోరిక తీరుస్తారని ఆశిద్దాం. నా వలన ఏమైనా టెక్నాలజీ సహాయం కావాలన్నా చేస్తాను. కానీ ఫేస్బుక్ పేజీ చాలా తేలిక, వారికి మన అవసరం ఉండదు.

మన పోలీసులు పడుతున్న కష్టానికి, కనీసం మనం తలవంచి ధన్యవాదాలు తెలుపాలి. మీకు కూడా, మన జిల్లా పోలీసు వ్యవస్థ లో, పెద్దలు ఎవరు తెలిసినా, దయచేసి మన చీరాల మండల ఫేస్బుక్ పేజీ కోసం, రిక్వెస్ట్ చేయండి. నాకు అయితే గూగుల్ లో ఇప్పుడు నడుపుతున్న, చీరాల పోలీసు ఫేస్బుక్ పేజీ కనపడలేదు. మీకు కనపడితే చెప్పండి.

మన పోలీసు వ్యవస్థ గురించి తెలుసుకోండి. జిల్లా మొత్తానికి పెద్ద, ఎస్పీ గారు, ఇప్పుడు సిద్దార్థ్ కౌశల్ గారు. తూర్పు సాగర ఒడ్డున ఉన్న, చిన బొంబాయి గా పిలిచే, వస్త్ర మహా సామ్రాజ్యం, మన చీరాల కు పెద్ద వారు, డిఎస్పీ గారు. ఇప్పుడు వై జయరామ సుబ్బారెడ్డి గారు ఆ పదవి లో ఉన్నారు.

ఆ తర్వాత ముగ్గురు పెద్దలు, వన్ టౌన్ సీఐ నాగ మల్లేశ్వరరావు గారు. టూ టౌన్ సీఐ ఫిరోజ్ గారు, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు ఉన్నారు. వీరి నాయకత్వం లో మిగతా ఎస్సై లు, హెడ్, కానిస్టేబుళ్లు అందరూ ఉంటారు.

మన ఊరు మరియు మనందరి క్షేమం రక్షణ బాగోగులే వీరి పని. అలాగే, మనమూ వారి మంచి కోరాలి, సమాచారం అందించాలి సహకరించాలి. చిన్న చిన్న విషయాలకు, వారి దగ్గరకు పోకుండా, పెద్దలు తో పరిష్కరించుకుంటే, సర్దుబాటు చేసుకుంటే, వారికి మనకీ అందరికీ మంచిది. అప్పుడు వారి దృష్టి, నేరాలు ఘోరాలు పై ఉంటుంది.

మీరంతా బాగుండాలి, మీరంతా బాగుంటేనే మేమూ బాగుంటాము. మన పంచాయతీ లేదా టూ టౌన్ పోలీసుల తరపున, మన బజారు లో, చలివేంద్రం లేదా పుస్తకాలు లేదా దుప్పట్లు, ఏదైనా చిన్న కార్యక్రమాలు చేస్తుంటే చెప్పండి, మా వంతు ఉడుత సాయం మేమూ చేస్తాము.

మనం అనవసరంగా ఇంటి బయటకు రావద్దు ఇప్పుడు, ఈ లాక్ డౌన్ సమయంలో. మనిషి కీ మనిషి కీ మధ్య, కొంత దూరం 3 అడుగు లు ఉంచండి.

కనీసం 3 అడుగు ల పైన దూరంగా ఉండాలి, ఒకరి కొకరు. కొన్ని పేపర్ ఫోటోలు లో, హెల్త్ కేర్ వర్కర్లు, అధికారులు పర్యటిస్తూ, వైరస్ జాగ్రత్తలు వివరిస్తూ గుంపులు గా దగ్గర దగ్గర గా వస్తున్నారు.

సొంత కుటుంబం తప్ప, చుట్టమైనా, స్నేహితులు అయినా కూడా, తాకవద్దు. మాస్క్, గ్లౌజులు, ఒళ్ళంతా కప్పండి బట్టలు తో.

ఇప్పుడు అమెరికా లో నే ఎక్కువగా ఉంది , చైనా కన్నా అంట. చైనా లెక్కలు నమ్మలేము. వాళ్ళు 2 లక్షలు అయితే, లక్ష అని చెపుతారు.

కూరలు దొరకని పక్షంలో, పప్పు చారు, పచ్చడి, పెసర పప్పు తో రోజులు నెట్టాలి, ఏప్రిల్ 14 దాకా, కంగారు వద్దు. ఆరోగ్యం ముఖ్యం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2068 General Articles and views 1,791,948; 104 తత్వాలు (Tatvaalu) and views 217,705
Dt : 26-Mar-2020, Upd Dt : 26-Mar-2020, Category : Request
Views : 1068 ( + More Social Media views ), Id : 447 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Police help to the public , Chirala DSP , CI
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content