ఆధ్యాత్మిక తెలుగు గురువులను గౌరవించడం, ఫోటో తో, పిల్లలకు పదిమందికి తెలియజెప్పడం మర్యాద - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1392 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1424 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

సాత్విక గురువు లకు వందనం, శుభరాత్రి, సుఖ నిద్ర, శుభ స్వప్నం

గురువారం పూట, గురువు లు దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, వినాయక సుబ్రమణ్య, లక్ష్మీ నరసింహ స్వాములు, అలాగే రాఘవేంద్ర బ్రహ్మం వేమన గురువు లు అందరూ ఒకే ఫోటో లో, మీ ఇంట్లో అంటే సాత్వికుల పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అక్క గారి దగ్గర.

సద్గురువు పిల్లల కు పెద్దలు కు జ్ఞానం, ఆధ్యాత్మిక సంపద, మానసిక బలం ఇస్తారు.

మన ఇంటి వైపు వెళ్లినప్పుడు లేదా కనపడ్డప్పుడు ఇది చూపించి, అక్క గారిని వెంటనే అడగండి, మీకూ ఒక ఫోటో ఇస్తారు, ఒకవేళ అందరికీ ఇచ్చి అయిపోకుండా మిగిలి ఉంటే.

మొన్న 4 లింకు లు పంపాను, దేవుని ఫోటోలు ప్రింట్ తీసి బాండ్ పేపర్ మీద, ఓ 10 మంది కి మీకిష్టమైన ఎవరికైనా ఇవ్వవచ్చు, ఆన్లైన్ లో కలర్ ప్రింట్ తక్కువ, 10 రూ కన్నా ఎక్కువ కాకపోవచ్చు, మంచి షాపులో బాండ్ పేపర్ కలర్ ప్రింటు బాగుంటుంది. ఎంతో ఖర్చు వ్రుధాగా చేస్తున్నాము, మన హైందవం కోసం కాస్త ఖర్చు చేయలేమా?

ఇస్తూ ఇలా చెప్పవచ్చు - ఇది ఇంట్లో ఉంటే మంచిది, మీకిష్టం అయితే నే తీసుకోండి లేదంటే ఇంకొకరికి ఇద్దాం. గోడకి లేదా దేవుని దగ్గర పెట్టుకోండి. ఇలాగే ప్రింటు చేసి మీరూ, ఇలాగే ఓ పదిమంది కి ఇస్తే పుణ్యం అని చెప్పవచ్చును.

కరోనా జాగ్రత్తలు తో 6 అడుగు లు దూరం, ముక్కు గుడ్డతో నిలుచుని ఇవ్వవచ్చు తీసుకోవచ్చు.


కొందరు తమ కున్న సంస్కార ఆలోచన లతో, మా దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయి అని అనడం సరికాకపోవచ్చు. ఇవి ఇలా అన్ని మూర్తులు, ఒకే దగ్గర ఫోటో, ఎవరి వద్దా లేవు, బహుశా ఉండవు.

త్రిమూర్తి మరియు వైష్ణవ సాంప్రదాయ గురువు దత్తుడు, శైవ సాంప్రదాయ గురువు దక్షిణామూర్తి ఇరువురు ఒకే చోట , శివుడు విష్ణువు ఒకటే అనే విధంగా ఉన్నారు. అలాగే విఘ్నాలు కు అధిపతి వినాయకుడు, శత్రు నాశ కారకుడు సుబ్రహ్మణ్యం స్వామి.

మన తెలుగు గురువులు ముగ్గురు ను గౌరవించడం, మన ఇంట్లో ఫోటో ఉంచుకుని, మన పిల్లల కు తెలియజెప్పడం సాత్వికుల లక్షణం. పాత తరం గుర్తు చేయడం, మన తాత అమ్మమ్మ నానమ్మ లాగా, అప్పుడే ఇప్పటి అమ్మ కు విలువ.

అంతే కాదు, ముదుసలి వయస్సు లో 75 ఏళ్ళు ఉన్న తల్లి ని చూసే అబ్బాయి, మనకు ఇచ్చారు, ఆ తల్లి దీవెనలు తో అని చెపితే, పిల్లల కు కూడా, మనసులో నాటితే, తెలుగు భాష, తెలుగు గురువు, కన్నతల్లి విలువ, కృతజ్ఞత మర్యాద దైవభక్తి ఆచరణలో అలవాటు పడితే, రేపు మిమ్మల్ని అలాగె మనల్ని కూడా, బాగా చూడవచ్చు నేమో. ప్రయత్నం చేయడం మన ధర్మం, ఫలితం కృష్ణుని పరం.

దేవుడు లేదా పెద్దలు మన దగ్గరకు రాకూడదు, మనమే వారి దగ్గరకు వెళ్ళాలి, గౌరవముగా ఫోటో/చిత్రము అడిగి తీసుకోవాలి. ఇంకో మంచివారికి సాత్వికులకు కూడా తెలియ పరచి, వెళ్లి అడగమనాలి, పుణ్యం పెంచుకోవాలి. హైందవ ప్రచారం కు మూల స్ధంభం కావాలి. మనం సొంతముగా చేయలేకపోయినా, ఇతరుల ప్రయత్నం ను ముందుకు తీసుకుని పోవాలి.

అక్క దగ్గర ఫోటోలు అయిపోయినా కూడా, వచ్చిన వారి పేరు ఫోన్ నంబరు రాసుకుని, మరలా ఓ నెలలో కొత్తగా చిత్రములు వచ్చిన తర్వాత చెబుతారు, తర్వాత మరలా వచ్చి తీసుకోవచ్చు.

సద్గురువు, పిల్లల కు పెద్దలు కు జ్ఞాన సంపద, మానసిక బలం ఇస్తారు. భౌతిక అవసరాలు కోరికలు తీర్చరు, ఆ మాయామోహం లో పడవేయరు, తప్పుడు మాటలు నమ్మవద్దు.

ఫోటో లో, ఆ గురువు లను చూడగానే, మన మనసు లో వారి చరిత్ర, కధలు, పద్యాలు, శ్లోకాలు గుర్తు రావాలి, మననం చేయాలి, మనశ్శాంతి పొందాలి సుమా.

కృష్ణుడు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడూ నన్నే తలుస్తూ, సత్కర్మలను, ఆచరణలో పెడుతూ, మానవ సేవయే మాధవ సేవగా చేసిన, నేను అండగా ఉంటాను అని. మరువద్దు. అని రాము తన మిత్రులకు చెప్పాడు హైందవ గురువుల ఫోటోలు ఉచితముగా పంచడం కోసం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1424 General Articles, 48 Tatvaalu
Dt : 02-Mar-2021, Upd Dt : 02-Mar-2021, Category : Devotional
Views : 478 ( + More Social Media views ), Id : 995 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : polite , respect , telugu , spiritual , gurus , photo , teach , children , public , vemana , raghavendra , brahmam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content