ప్రకాశం జిల్లా కరోనా కోవిడ్ ఆస్పత్రులు, నోడల్ అధికారుల వివరాల జాబితా, రాష్ట్ర కరోనా పరిస్తితి - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,923,299; 104 తత్వాలు (Tatvaalu) and views 229,693.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గుర్తు ఉందా, మనము ఈ వారములో, జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి మరియు ఇతర అధికారులకు కలెక్టర్ గారికి, కరోనా కోవిడ్ ఆసుపత్రుల, సంజీవిని వాహనాల సమాచారము గురించి సోషల్ మీడియాలో వెబ్సైట్ లో పెట్టమని, విన్నపము పెట్టాము 5 ప్రశ్నలతో (లింక్). మీ జిల్లా అధికారులు ను, మీరు ఇలాగే అడగవచ్చు. 2 వ ప్రశ్న జవాబు వచ్చింది. వారిని సంప్రదించండి.

సహ్రుదయులైన చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా గారు, ఆయన నిజంగా దేవుడు ఉత్తమ బాధ్యత గల అధికారి, ఆ 5 ప్రశ్నల జవాబు ఎప్పుడో, వారి ప్రాంత జనుల కోసం అడగకుండానే, తమ కలెక్టర్ ఫేస్బుక్ లో పెట్టారు, మీకు ఆ విన్నపము లోనే, వారి లింక్ కూడా ఇచ్చాము. ఆయనకు ఇద్దరు కలెక్టర్ ల, జీతం ఇచ్చిన కూడా తప్పు లేదు. కష్టపడి పని చేస్తున్నారు, చిత్తశుద్ధితో త్రికరణ శుద్దిగా.

ప్రజలే ప్రభువులు, మేము మనము ప్రజల సేవకులము అని మోడీ మరియు జగన్ గార్లు చెప్పినా కూడా, జిల్లా లో పరిస్తితి, మనకు తెలిసిందే. మన జిల్లా అధికారులు పట్టించుకోరు, జవాబు చెప్పరు.

మే నుంచి వేడుకుంటున్నాము కూడా, అయినా సోషల్ మీడియాలో తెలియజేయరు, తమ తమ జిల్లా శాఖల సిబ్బంది త్యాగాలు మరియు కరోనా పనులు గురించి చెప్పరు (లింక్).

ఇంకా పట్టణ, గ్రామీణ అధికారుల సంగతి చెప్పక్కరలేదు, పై వారు చెప్పనిదే, వాళ్ళు సోషల్ మీడియాలో సమాచారము పెట్టరు. ఒకవేళ లింక్ లు ఉంటే, ప్రజలతో బహిరంగముగా ప్రకటించాలి. మనము అడిగినప్పుడు, ఒకరైనా ఇవ్వాలి కదా. అందుకే మన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మన అధికారులు వైద్యం మీద నమ్మకము లేక, హైదరాబాద్ వెళ్ళి, వైద్యము పొందుతున్నారు, వార్తలలో చూసాము. మరి సామాన్యుల పరిస్థితి?

జగన్ గారు, బెడ్ లు దొరకడము లేదు, లిస్ట్ పెట్టండి, మీరు బాధ్యులు అనేదాకా కూడా అధికారులు తమ సొంతముగా ఆలోచన చేయరు, సమాచారము అందించరు. అంటే, జగన్ గారే, అన్ని విషయాలు చెప్పాలి అడగాలి, మరి ఇంత మంది అధికారులకు ఆ ఆలోచనలు రావా? అడగకుండా? అంటే, ఆలోచన చెయ్యండి, ప్రజలపై ఎంత శ్రద్ధ ఉంటుందో జిల్లా అధికారులకు.

ఇంత వరకు, జిల్లా రెవెన్యూ అధికారి గారి నుంచి కూడా జవాబు లేదు, ఆర్డీవో గారి మరియు, ఎమ్మార్వో గారి అలాగే ఇతర రెవెన్యు అధికారుల పనులు, సోషల్ మీడియాలో తెలియజేయమని కోరినా (లింక్).

నేరుగా మనకు జవాబు సంబంధిత ఆరోగ్య అధికారుల నుంచి రాకపోయినా, ఈ రోజు, మన ప్రియతమ బాధ్యత గలిగిన, జిల్లా ఎస్పీ కౌశల్ గారు తమ ఫేస్బుక్ లో, తమ పోలీసు విధులతో పాటుగా, సివిల్ ఆరోగ్య శాఖ సమాచారము (మన 2 వ ప్రశ్నకు సంభందించిన) కూడా ఫోటో పెట్టినారు. ధన్యవాదములు. ఇందులో కోవిడ్ సెంటర్ పేరు నంబర్ సమాచారము, ఫోటోలో సరి చూసుకుని, అత్యవసరము అయితే వారిని సంప్రదించ గలరు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే.

ఈ ఫోన్లు కూడా, అలంకారప్రాయమో మిగతా అధికారుల లాగా, మీరు ప్రయత్నము చేయనిదే తెలియదు. ఎందుకంటే, ఉదాహరణకు మార్కాపురము నుంచి, వంద మంది ఫోన్ చేసి సమాచారము అడిగే బదులు, వీరు ప్రకాశం జిల్లా వెబ్సైట్ లేదా సోషల్ మీడియాలో సమాచారము పెడితే, అధికారులకు కూడా శ్రమ తగ్గుతుంది, జనానికి సమయము మిగుతులుతుంది.

మిగతా ప్రశ్నలకు జవాబు ఎప్పుడు వస్తుందో, ఆ తిరుమలేశుడే చెప్పాలి. జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా, చోద్యము చూస్తున్నారు, అడిగి పని చేయించకుండా, అది ప్రజలకు జగన్ కు మంచి అని తెలిసి కూడా.

రాష్ట్ర కరోనా పరిస్తితి , ఆగస్ట్ 4 న ఎలా ఉంది అన్ని జిల్లా లలో, అని ఫోటొలో చూడగలరు. అలాగే భారత ప్రభుత్వ వెబ్సైట్ లో, ఆంధ్ర తెలంగాణా కరోనా పరిస్తితి, ఆసుపత్రుల లిస్ట్ కూడా చూడవచ్చును.

Please check central govt website for andhra carona status and Telangana carona status and hospital list.

Andhra State Health official contacts list.
Prakasam District Covid Hospitas and its Nodal Officers List
SNoCovid Hospital NameName & Designation of Nodal OfficerCell No
1 Govt General Hospital, Ongole P. Niranjan Reddy, Commissioner, Ongole Muncipal Corporation 9849905839
2 District Hospital, Markapur M. Babitha, Divisional Forest Office(WL), Markapur 9440810059
3 Area Hospital, Chirala A. Chandra Sekhar Reddy, Joint Director, Fisheries, Ongole 9440814738
4 Area Hospital, Kandukur VV Subba Rao, District Education Officer, Ongole 9849909108
5 Ramesh Sanghamitra Hospital, Ongole B. Ravindra Babu, Project Director, APMIP, Ongole 7995087049
6 KIMS, Ongole K. Seena Reddy, Project Director, DWMA, Ongole 8790009111
7 Nalluri Nursing Home, Ongole J. Elisha, Project Director, DRDA, Ongole 7997952601
8 Venkataramana Nursing Home, Ongole Sk. Mahaboob basha, DFO (SF), Ongole 9440810130
** Please check the photo attached for any mistakes or wrong phone number.
 
6 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,923,299; 104 తత్వాలు (Tatvaalu) and views 229,693
Dt : 04-Aug-2020, Upd Dt : 04-Aug-2020, Category : Request
Views : 1424 ( + More Social Media views ), Id : 626 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Prakasam District , Kovid Hospitals , Nodal Officers List , andhra , Telangana , carona status , hospital list , Health , official contacts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content