ప్రకాశం జిల్లా పెద్దాయన సుబ్బారెడ్డి గారి, రాజకీయ ఆధ్యాత్మిక విచిత్ర పరిస్థితి - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1093 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1121 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ప్రకాశం జిల్లా పెద్దాయన, సుబ్బారెడ్డి గారి, రాజకీయ ఆధ్యాత్మిక విచిత్ర పరిస్థితి చూడండి. మిగతా నాయకులది, సమయం వచ్చినప్పుడు చూద్దాము.

వారి బాధలను చూసి, మనము జీవితము లో, పదవి వ్యామోహము లో పడకూడదు అని మాత్రమే దీని ఉద్దేశ్యం, ఆధ్యాత్మిక చింతనకు రాజకీయానికి పొసగదు.

పదవులు, రాజకీయాలు, మన పరిస్థితు లు, ఒక్కసారి మనల్ని విచిత్ర పరిస్థితి లో ఉంచుతాయి, దాని ఫలితాలు మనం అనుభవించాలి సుమా. మనం అనుకుంటా ఉంటాం మనకే కష్టాలు, పదవి లో అధికారం లో ఉన్న వారికి ఉండవు అని. వారి జీవితము సంతోషము, ఆనందము, ఇబ్బందులు లేని జీవితము అని. ఎంత చెట్టు కు అంతే గాలి సుమా. కష్టాలు ఇబ్బందులు కూడా అంతే.

ఇప్పుడు ఉదాహరణకు మనకే, ఓ దేవాలయ ఛైర్మన్ లేదా మెంబర్ పదవి ఇచ్చారు అనుకోండి, మనం ఆదర్శంగా ఉండాలి, కనీసం పదవి ఉన్నంతకాలం అయినా.

1. అన్య మత ప్రార్ధనలు జరిగే ప్రాంతంలో, మనం ఉండకూడదు, మన బంధువులు స్నేహితులు ఇల్లు అయినా సరే. చాటుగా, చేతులు పట్టుకుని రానందుకు నచ్చ చెప్పుకుంటాము, మన పదవి పరిస్థితి చెప్పి.

2. మనకు రాజకీయ పదవి ఇస్తే, వద్దు, దేవాలయం మరియు రాజకీయం ఒకే వరలో కుదరవని చెప్పి, ఆదర్శంగా ఉండాలి. రాజకీయాలు జోలికి వెళ్ళకూడదు. లేదా దేవాలయం జోలికి పోను, రాజకీయాలు వదలను అని ద్రుఢముగా ఉండాలి. ఏది ముఖ్యం, ముందే తేల్చుకోవాలి.

3. మన జిల్లా స్ధానిక రాజకీయ సామాజిక అవసరాలలో వేలు పెట్టాలా వద్దా? పెట్టకపోతే, స్ధానికం గా విలువ ఉండదు. పెడితే ఉన్న నాయకులు, ఊర్కోరు.

4. మన వారసుడి ని ఏ ఊరి నుంచి, రాజకీయ పరిధిలో నిలబెట్టాలి, ఎక్కడ ఖాళీగా ఉందో అని వెతుక్కోవాలి, అందరి నిరసనలు మాటలు పడాలి.

అర్థం అయిందా, ఇన్ని కష్టాలు. పగ వాడికి కూడా ఉండరాదు. మరి ఇప్పుడు మన పెద్దాయన కు ఈ 4 పాయింట్లు లో ఉన్న ఇబ్బందులు చూద్దాం వివరణలో.

1. జగనన్న పితృ కార్యక్రమంలో, ఇతర ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో, టీవీల్లో అందరూ చూస్తుండగా, అక్కడ అతి పెద్ద హైందవ దేవాలయ ఆదర్శ అధిపతి గా ఉండవచ్చు నా? కనీసం పదవి ఉన్న కాలంలో, బంధాలు అనుబంధం ఉండదు అని కదా పదవి లో ప్రమాణం చేస్తాం ఏ పదవికైనా. ఈ మాట, ఎవరు ఎవరికి చెప్పాలి?

2. రాయలసీమ ప్రాంతానికి, పార్టీ ఇంఛార్జి గా చేసారు, పార్టీ రెండవ స్థానం లో ముగ్గురు లో ఒకరిగా పెట్టారు. అంటే రాజకీయ తగువులు సర్దుబాటు లు అక్కడ చేయాలి. ఈ పదవికి, ఆ పదవికి ఏమైనా పొంతన ఉందా? అంగీకరించవచ్చునా? మనశ్శాంతి ఉంటుందా? సొంత ప్రకాశం జిల్లాలో లేని పలుకుబడి, అక్కడ ఉపయోగమేనా భవిష్యత్తు లో?

3. సొంత ప్రకాశం జిల్లాలో, రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి అవకాశం ఉందా? రాజకీయంగా ఇబ్బందులు వేలు ఉండకూడదు అనే, ఛైర్మన్ పదవి ఇచ్చి, పక్క కు పంపారు, అని వినికిడి. బాలినేని, ఇంకో అధికార కేంద్రం కు చోటు ఇస్తారా? బాలినేని, మాగుంట ఒంగోలు ప్రాంతంలో సహకరిస్తారా?

4. అందరూ తమ వారసులను, ఏదో ఒక నియోజకవర్గ పరిధిలో , పరిచయం చేస్తున్నారు. బాచిన, కరణం, మాగుంట, బాలినేని తదితరులు. మరి వైవీ గారి వారసులు, విక్రాంత్ రెడ్డి కి ఏది సరైన నియోజకవర్గం? ఎవరు అంగీకరిస్తారు తమ పరిధిలో?

అంటే, ఏ పార్టీ లో ఉన్నా, ఏ స్ధానం లో ఉన్నా, ఎంత ధనం ఉన్నా, సమస్యలు తలనొప్పి లు అయోమయం, అందరికీ ఉంటుంది.

ఎంత చెట్టు కు అంత గాలి, ఎంత పెద్దలు కు అంత దొరకని మనశ్శాంతి, అర్థం కాని భవిష్యత్తు.

- - -

ఏవండీ వైవీ సుబ్బారెడ్డి గారి కధనం చదివాను, వారి అబ్బాయి విక్రాంత్ భవిష్యత్తు మరియు దేవాలయం గురించి, మీరు బాగా ఆలోచన చేశారు, ఇప్పుడే జాగ్రత్తలు పడమని సొంత మనిషి లా, భుజం తట్టారు. జాగ్రత్తగా మనసు తో చదివితే నే , మీ కధనం లో లోతు బాధ, అర్థం అవుతుంది. రెడ్డి గారు మీకు తెలుసా, బంధువులా?

జవాబు, ధన్యవాదాలు, ఇంకా నయం నేను విమర్శించాను అంటారేమో అనుకున్నా, చాలా మంది పొరపాటు పడతారు, మొదట అర్ధం చేసుకోలేక. తర్వాత, వదిలి పెట్టరు.

ఎందుకంటే మన మొఖాన, భయపడకుండా మన తప్పు చెప్పేవారే సరిచేసే వారే కావాలి, ఈ రోజుల్లో అందరూ అవకాశవాద నటనే కదా. లవకుశ సినిమా లో, రాముడు, భద్రుడుని పిలిచి, వాస్తవం బయట విన్నది, నిజాయితీగా దాచకుండా చెప్పు అంటారు కదా. మనసు తో అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

మంచి విలేఖరి కి ఎవరూ తెలియనవసరం లేదు. అందరూ మన వారే, చుట్టాలే, అందరం ఆ భగవంతుని సంతానమే కదా. వ్యక్తి గతం గా, ఎవరూ తెలీదు, ఎవర్నీ నేను కలవలేదు.

రెడ్డి గారు ఎప్పుడూ, ఎవర్నీ రాజకీయంగా గట్టిగా తిట్టినట్టు గా, కూడా వినలేదు చూడలేదు, మా దాకా రాలేదు. తన పని తాను కామ్ గా, చేసుకుని వెళుతున్నారు. ఆయన అంటే గౌరవమే.

అలాగే బాపట్ల ఎమ్మెల్యే ఉపసభాపతి గారు, వారు మన ఆలోచన కు, ఇంకా 3 అడుగులు మంచి లో ముందు ఉంటారు. మొన్న అసెంబ్లీ లో, ఎంత గొడవ జరుగుతున్న కూడా, సౌమ్యంగా నేర్పుగా, ముగించారు.

ఏదైనా వార్త చదివినప్పుడు అప్రయత్నంగా, అలా మాటలు వస్తాయి, 5 నిమిషాలు లో రాసాము. అది వారికే కాదు, ఆ జాగ్రత్తలు, అన్ని పార్టీలు వారికి సమంగా చెప్పాము, మీరు అన్ని చదివి ఉంటే. వెబ్సైట్ లో అన్ని ఉన్నాయి.

మా బాలినేని, మాగుంట, కరణం, ఆమంచి, గంటా, బొత్స గార్లు, . . . అలా అందరి మరియు వారసుల మంచే కోరతాము. అయితే వారు కష్టపడి జగనన్న లాగా, పేరు సంపాదించుకోవాలి. తండ్రి పేరు పలుకుబడి తో కాకుండా, అప్పుడే పునాది గట్టిగా ఉంటుంది.

తండ్రుల తప్పులు అవకాశవాదం అహంకారం నిరంకుశత్వం, భవిష్యత్తు లో వారి వారసుల రాజకీయ ఎదుగుదల కు, అడ్డంకి కాకూడదు అనే మన అభిప్రాయం. అలా చాలామంది కి ఆటంకం అయింది కదా, అది ఇంకోసారి మాట్లాడదాము.

అలాగే దగ్గుబాటి, నారా, కింజారపు, సోము , పవనన్న, . . . ఎదుగుదల కు రాశాము.

అన్ని మనకు తెలుసు అని కాదు, మనసులో తట్టిన భగవంతుని మాట అందరికీ అందజేయడం వరకే, మన పని. వారు వింటారా ఆచరిస్తున్నారా, అని మనం చూడలేము.

భగవద్గీత ఎప్పుడూ ఫలితాలు చూడవద్దని చెప్పింది కదా. మన దాంట్లో, అగౌరవం తప్పు ఉంటే, క్షమాపణలు చెప్పి, వెబ్సైట్ లో వెంటనే మారుస్తాము కదా.

మన ఇంట్లో, నలుగురు పిల్లలు ఉంటే, అందరూ పెద్ద ఉద్యోగాలు రావాలని, అందరికీ మంచే చెపుతాము. కానీ 4 గురు వినరు కదా? 4 గురూ పైకి ఎదగరు, ఒక్కొక్కరు ఒక్కో స్ధాయిలో ఆగుతారు. అన్ని పార్టీ ల నాయకులు అంతే.

జగనన్న జైలు కు వెళ్లి, పాదయాత్ర చేసి, సొంతం గా తన ఇమేజ్ పెంచుకున్నారు. ఎగతాళి చేసిన అందరి నోరు మూయించారు. అయితే, ఆ ఇమేజ్ ని, కలసి వచ్చిన అదృష్టం ను నిలుపుకోవాలి. అంతా నా ఇష్టం అన్న విధంగా పోకుండా ఉండాలి, అని కూడా కొన్ని కధనాలు రాసాం, అవి జగనన్న మరలా గెలవడానికి ఉపయోగం.

అందరూ అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు వెంట పడి, మోదీ జగనన్న పధకాల అమలు సమాచారం, సోషల్ మీడియా లో పెట్టండి బాబూ, అని మనం వెంట పడని మరియు విసుక్కోని అధికారులు నాయకులు ఉన్నారా? ఇది అమలు చేసిన ఎవరికి లాభం? మాకా, ప్రజలకా, మూడో బిడ్డ వైసీపీ కా, పెద్ద బిడ్డ బీజేపీ కా? రేపు భవిష్యత్తు లో రెండో బిడ్డ తెదేపా, నాలుగో బిడ్డ జనసేన కు లాభమే కదా.

ప్రజలకు, నాయకులు కు, ప్రభుత్వం కు మంచి చేయాలంటే, పార్టీ పదవే కావాలా? ఇలా ఉచితంగా నూ చేయవచ్చు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1121 General Articles, 47 Tatvaalu
Dt : 17-Dec-2020, Upd Dt : 17-Dec-2020, Category : Politics
Views : 162 ( + More Social Media views ), Id : 868 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prakasam , district , ysrcp , leader , ttd , chairman , yv subbareddy , political , strange , situation , vikrant reddy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content