గత మంచి అధికారులను తలచినట్లుగా, మిమ్ము తలచుకునే క్రుతజ్ఞతల అవకాశం, అధికారులకు విన్నపము - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,338; 104 తత్వాలు (Tatvaalu) and views 226,426.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*గత మంచి అధికారులను తలచినట్లుగా, మిమ్ము తలచుకునే/ గుర్తుంచుకునే క్రుతజ్ఞతలు తెలిపే అవకాశం ఇస్తారని, అన్ని శాఖల అధికారులకు విన్నపము*

It is a request to the officials of all departments to give us a chance to think/ remember and thank like the previous good officers/ officials.

* * *
మిత్రులారా - మీ జిల్లా లో, మీ మండలం, మీ పట్టణం లో, మీకు తెలిసిన మంచి అధికారి ఉంటే, గొప్పగా సవివరముగా రాసి సాక్ష్యముతో పంపగలరు, అది పని చిన్నదైనా పెద్దదైనా, ఇంకా మానవత్వం, ఉద్యోగ బాధ్యత బతికి ఉంది, అని 10 పదిమందికి తెలియ చేద్దాము.

ఈ మంచి మాటలు, మీ అందరి కోసమే మిత్రమా, పంచభూతాలు ఎవరినీ వదలవు, ఎక్కడ ఉన్నా.

మీరు గత 5 ఏళ్ళు గా, మీ గురించి మీరు, కపటం నాటకం 2 నాల్కల ధోరణి అప్పుల కుసంస్కార జీవితం లేని, నిస్వార్ధ మంచితనం తో చెప్పిన విషయాలను బట్టే, మీ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ సామర్ధ్యం బట్టి మాత్రమే, మేము ముందుకు పోగలము, 10 మందికి చెప్పగలము. లేదంటే, మీరు పంపింది నిజమో అబద్దమో, కేవలం పక్షపాత ఆరోపణో తెలీదు కదా, తీసుకోలేము, మన్నించాలి.
* * *

బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, కొత్త పేట (చీరాల) -

ధన్యవాదాలు పంచాయతీ ఈవో గారు, వెంటనే పంచాయతీ సిబ్బంది కొట్టేసిన చెట్టు ముక్కలు, ఒక ఇంటివి ఇంకో ఇంటి ఎదురు అడ్డముగా వేసిన వాటిని, తీయించినందుకు, సరిదిద్ది నందుకు.

గత అధికారులు లాగా, మీ మంచి మనసు తో, పన్నులు కట్టే పంచాయతీ వాసులకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు, నమస్కారములు. అందరికీ మీ మంచి తెలియజేస్తున్నాము.
* * *

మంచి మనసున్న అధికారులు ఉంటే, ప్రభుత్వం కు ఎప్పుడూ చెడ్డ పేరు రాదు. గత ఈవో గారు ఏప్రిల్ 2020 లో, కరోనా సమయములో, వెంటనే జేసీబీ పంపి 10 సెంట్ల భూమిలో ఉన్న అశుభ్రాన్ని తొలగించి, ఆ దోవన నడిచే అందరి ఆరోగ్యాన్ని శుభ్రం చేయించారు. జిల్లా పంచాయితీ అధికారి కూడా సహాయం చేసారు.

ప్రతి శాఖ అధికారి, అలాంటి పెద్ద పనులు కు ముందుకు రావాలి, తమ తల్లి దండ్రుల పెంపక రుణం, ప్రజల పన్నుల జీత రుణం, దైవ సౌకర్యాల రుణం, పిల్లల సంస్కార గుణ రుణం తీర్చుకోవడానికి.

మనము తప్పుడు నాయకుల, అడుగులకు మడుగులు ఒత్తము అంటే, ఎంత మందిని, ఎన్ని రోజులు బదిలీ చేస్తారు? మన ఉద్యోగ యూనియన్లు అంత చేతకానివా? జీతాలకేనా ధర్నాలు? ఆత్మాభిమానం, కర్తవ్య పాలన కోసం, ధర్నా చేయలేమా? అందుకే కదా, ప్రజల మద్దతు లేకుండా పోతుంది? బదిలీ అంటే, పీడ విరిగింది అనే కాడికి వచ్చారు అందరూ.

ఐయేయస్ ఐపీయెస్ అధికారులను మార్చాలి అంటే, కేంద్రం అనుమతి కావాలి కదా? ఓ 50-100 మందిని, అలా ఇలా, మారుస్తారా? వారు అంతా ఒకే మాట మీద ఉండి, కేంద్రానికి లేఖ రాస్తే, కొత్త బాధ్యతలు స్వీకరించము, ఇది కావాలని కక్షతో బదిలీలు అంటే?

అలాగే ప్రజలమైన మాకు కూడా, ఆవులను ఎన్నుకునే బుద్ది ఇంగితజ్ఞానం సంస్కారం రావాలి. చింత విత్తనం వేసి, మామిడి కాయలు పూత రాలేదు అంటే? మేక బదులు పులిని పామును నక్కను మేపి పెంచి పోషించి, మమ్మల్నే కాటేస్తున్నాయి అని ఏడ్చి మొత్తుకుంటే? స్వయం గోతికి, దేవుడు వచ్చి రక్షిస్తారా? ఇది ప్రజలు గమనించాలి.

20 ఏళ్ళు అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా పెంచిన మనల్ని నిర్ధాక్షిణ్యముగా వదలి, 2 వారాలు/ నెలలు/ ఏళ్ళు తెలిసిన వారితో పోతాము అంటే, మనము కాళ్ళు పట్టుకుని బతిమాలాడాలా? వారి ఖర్చుకు సౌకర్యాలకు, సంపద ఇవ్వాలా? పోనీ ఓకే అంటే, రేపు వారిని, మనల్ని కలిపి అమ్మేస్తే, వెన్నుపోటు పొడిస్తే? అది పుణ్య కార్యమా, పాపమా? ఫలితం? మామ అత్త కు/ తండ్రి తల్లి కి/ బాబాయి పిన్ని కి వెన్నుపోటు పొడిచిన పిల్లలు లేరా?
* * *

పంచాయతీ కొత్త ఈవో గారు కూడా మంచి మనసు తో, జరుగుతున్న తప్పులు ను సరిచేస్తూ, పై ఫోటో పంపారు ఆగష్టు 2023.

పంచాయితీ/ మున్సిపాలిటీ/ పట్టణ/ నగర ఎదుగుదలకు అభివ్రుద్దికి, ప్రజలు ఇచ్చిన అధికారముతో, దేవుడు ఇచ్చిన పచ్చని చెట్లను కొట్టేసిన మనము, దేవుని ఎదుట దోషులుగా నిలబడకూడదు అనుకుంటే, అదే అధికారం నిబద్దత ఉపయోగించి,

ఇలా డాబాలు ఆస్తులు అంతస్తులు, ఉద్యోగ వ్యాపార పిల్లలు ఉండి కూడా, తమకు సంస్కార పెంపకం లేక, తమ సొంత ముదుసలి అమ్మ నాన్న అత్త మామ ల సజీవ గురువు సేవ లేక, తమ పిల్లలను సంస్కారం గా పెంచి రేపు ముదుసలి తనములో వారి దగ్గర దేవతలుగా సేవించబడతాము అని చెప్పకోలేని దౌర్భాగ్య, సంఘ మరియు దైవ ద్రోహులు, ప్రభుత్వ/ ప్రజా ఆదాయ అభివ్రుద్ది వినాశకులు, పాప దావాద్రితో, తమ సొంత వంశ పతనం కోసం,

ప్రభుత్వ ఖాళీ పోరంబోకు స్థలాలను ఆక్రమించి (ఆఖరకు ఇంటికి రోడ్ కి మధ్యనున్న, 4 అడుగులు కు కూడా కక్కుర్తి పడుతూ, లోభితనం పదిమందికి చూపుతూ), షాపులు కట్టి, అద్దెకు ఇస్తూ, అక్రమ నల్ల వ్యాపారాలు చేస్తు నల్ల ధనం పోగేస్తు, అదే అధికారులు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకముగా వాడుతూ,

రోడ్డున నడిచే వారికి ఇబ్బంది కలిగిస్తూ, చుట్టూ పక్కల ఇళ్ళ వద్ద వాహనాలు నిలుపుతూ నిలిపిస్తూ, సాంప్రదాయ మహిళలు బాలికలు తలదించుకుని నడిచే పరిస్తితి కల్పిస్తూ,

ప్రభుత్వ ఆదాయంకు గండి కొడుతున్న, కబ్జా రాయుళ్ళ భరతం కూడా పడుతూ, పంచాయతీ కి ఆదాయం పెంచుతూ, జగనన్న మరియు రాబోయే కొత్త ప్రభుత్వం కు, మంచి వారి అండ ఆశీస్సులు పంచుతూ, ఆచరణ అభివ్రుద్దిలో ముందుకు దూసుకు వెళుతూ ఉంటే, రేపు భవిష్యత్తు లో ఇంకో పెద్ద పదవిలో ఉన్నా, గత మంచి ఎప్పుడూ కాపాడుతుంది.

ఇప్పుడు లాగనే, అంటే గత అధికారులను తలచినట్లుగా, మేము మిమ్ము తలచుకునే అవకాశం ఇస్తారని, అన్ని శాఖల అధికారులకు విన్నవిస్తున్నాము, మీ మీద దేవుని క్రుప ఉండటానికి, మీ మంచి కర్తవ్య పాలన ఆశిస్తున్నాము.

ఆవును ఎన్నుకునే ఉత్తమ ప్రజలు, నాయకులు కూడా మీకు అండగా ఉంటారని భావిస్తున్నాము.

కబ్జా దారులు కు అండగా, వైసీపీ/తెదేపా/బీజేపీ/జనసేన లేదా ఏ ఎమ్మెల్యే ఎంపీ స్ధానిక నాయకులు అడ్డుగా వస్తే, దయచేసి వివరముగా సాక్ష్యముతో చెప్పగలరు.

ప్రజలపై ప్రేమ గల, వైసీపీ/తెదేపా/బీజేపీ/జనసేన అధిష్టానం నేతలు కు కూడా, వారి గురించి వివరంగా పంపగలము, సోషల్ మీడియాలో టాగ్ చేయగలము.

రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి, ఇప్పుడు నాయకులు అందరూ మంచి బాలురు లాగా జీవిస్తారు, అలాగే ఓటర్లు కూడా పప్పు బెల్లాల కోసం బుద్దిగా నటిస్తారు.

ఇటూ పోలీసు వైపు సహాయం కావాలన్నా, డీయెస్పీ, ఎస్పీ, రేంజ్ ఐజీ, డీఐజీ కి విన్నపాలు పంపిస్తాము. మనసున్న మారాజులు వారిలోనూ ఉంటారు కదా.

జగనన్న లేదా ఏ పార్టీ అధిష్టాన నాయకుని కీర్తికి మచ్చ కలిగిస్తూ, కీడు చేస్తూ , అక్రమార్కులు కు అండగా ఉండే తన వారిని కూడా, ఆ పెద్దలు వదలరు. ఎందుకంటే రేపు 23 నంబర్ ఎవరికి రాసి ఉందో ఎవరికీ తెలీదు.

పిచ్చి జనం, బుద్ది తెచ్చుకుని, ఈసారి ఆవు కావాలన్న బుద్ది తో ఉంటే? నాయకులను, వినాయకులను, అధికారులను మెప్పించగలమని, నమ్మకం మనకు ఉంది. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,338; 104 తత్వాలు (Tatvaalu) and views 226,426
Dt : 09-Aug-2023, Upd Dt : 09-Aug-2023, Category : General
Views : 249 ( + More Social Media views ), Id : 1872 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : request , officials , departments , chance , think , thank , good , previous , chirala , bapatla , vetapalem
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content