32 జిల్లా ల పుకార్లు మరియు చీరాల 2024 వైసీపీ టిక్కెట్ పోతుల కే నా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,891; 104 తత్వాలు (Tatvaalu) and views 226,117.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

డిప్యూటీ స్పీకర్ గారు, షుమారు 26 జిల్లా లు అంటుంటే, సోషల్ మీడియా లో 32 జిల్లా లు అని, పుకార్లు తిరుగుతూ ఉన్నాయి. పొద్దున్న ఇచ్చిన ఆమంచి కరణం ఆర్టికల్ లింకు లో, పూర్తి వివరాలు చూడవచ్చు, ఒంగోలు మార్కాపురం మరియు బాపట్ల మార్పులు గురించి. పెద్దలు చెప్పిన దాకా, దేనిని నమ్మలేము, ఇవి నిజమైనా కూడా. Link.

ఇంకో ఇంటరెస్టింగ్ వార్త చూశాము సోషల్ మీడియా లో. మరి మీరే చెప్పాలి నిజమో కాదో. పోతుల సురేష్ గారు, చీరాల 2024 వైసీపీ టిక్కెట్, సునీత అక్క కే అన్నారు అంట, మీరు ఇంకోచోట అయినా తెచ్చుకోవచ్చు మాకు ఇదే అని, వెంకటేష్ మరియు మిగతా నాయకులు తో కూడిన మీటింగ్ లో ఈవారం. మరి ఎవరన్నా ఖండించారో తెలీదు లేదా నవ్వుతూ జోక్ గా అన్నారో మరి.

ఒకవేళ ఈ వార్త అబద్ధం అయితే, కరణం మరియు ఆమంచి గార్లు, కొత్త జిల్లా కార్యాలయాలు తీసుకుని రావడం లో పోటీ పడితేనే, అవి తెస్తేనే, జనం అండ ఉంటుంది. ఊరక పాదయాత్ర నటనలు, జనం కు తెలుసు. పని తో మెప్పించాలి, మంది బలంతో కాదు.

ఒకవేళ నిజమైతే, వైసీపీ అధిష్టానం కు 3 వ వ్యక్తి దోవ దొరికినట్టు, ఉన్న ఇద్దరు నాయకులు తో విసిగిపోయి ఉంటే, కాస్త ధైర్యం ఉన్న మనిషి అక్కనే.

అలా ఊరక సీటు మాకే అనగానే సరిపోదు, దానికి తగ్గట్టుగా అక్కడనే ఊళ్ళో పూర్తిగా ఉండి, మనం చెప్పిన 10 అభివృద్ధి పధకాలు లో ఒకటైనా తెచ్చి, కనీసం కొత్త జిల్లా లో, జిల్లా ఆసుపత్రి, కలెక్టరేట్, జిల్లా పోలీసు లేదా ఇతర శాఖలు తెచ్చే ప్రయత్నం చేస్తూ, నాయకులు ను అధికారులను కలుస్తూ‌ అర్జీలు ఇస్తూ, ధర్నా నిరాహారదీక్ష లు చేస్తూ, ప్రజలకు ఈ 4 ఏళ్ళు, మేము ఉన్నాము, ఈ ఇద్దరు వలన సంవత్సరం గా ఎటూ ఉపయోగం లేదని, ప్రజలకు వివరించ గలిగితే, కొంత ప్రయోజనం తో పాటుగా, జగనన్న అండతో, గెలిచే అవకాశం ఉంది. ఉన్న ఇద్దరు నాయకులైనా లేక కొత్త వారైనా అంతే.

ఎటూ చీరాల తెదేపా, బీజేపీ, జనసేన శాఖలు, అలా కష్టపడి ప్రజల వైపు ఉండరు, తిరగరు, తెచ్చే ప్రయత్నం చేయరు, అని సంవత్సరం గా ప్రజలు భావిస్తున్నారు. వారి ఫేస్బుక్ పోస్ట్ లే ప్రత్యక్ష సాక్ష్యాలు.

వారిని ఉత్తేజ పరచడానికి మాత్రమే, ఈ మాటలు మిత్రమా, కోప తాపాలు వద్దు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,891; 104 తత్వాలు (Tatvaalu) and views 226,117
Dt : 10-Nov-2020, Upd Dt : 10-Nov-2020, Category : Politics
Views : 767 ( + More Social Media views ), Id : 803 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rumors , andhra , 32 districts , chirala , 2024 , ycp ticket , potula sunita , karanam , amanchi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content