పసుపు గడపకి కాళ్ళకు పూసి కుంకుమ, మామిడి తోరణాలు, కనకాంబ్రాలు మరమము, ఎన్నో ఆచారాలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1164 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1193 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మంచి మాటలు ఆచారాలు మనము చదివేయి అన్ని, మనకు తెలియదని కాదు. గుర్తు చేసుకోవడము మరలా, అర్ధము చేసుకుని పాటిస్తున్నామా ఇన్ని ఏళ్ళుగా? లేదు ఇప్పుడైనా పాటిస్తామా? పోనీ మనము పాటించినా లేకపోయినా, మన పిల్లలు బంధువులు స్నేహితులు కు అవి తెలుసా, నేర్పుదామా?

ఇప్పుడు చూడండి, కరోనా కోవిడ్ 19 గురించి విని, అందరూ భయపడి, ఇంటిలో వాళ్ళకు వీధిలో వాళ్ళకు చెపుతున్నాము కదా జాగ్రత్తలు.

మరి మంచి మాటలు కూడా, అలా చెపితే చిన్నప్పటి నుంచే నేర్పితే, మన చుట్టూ అందరూ ఆచరిస్తే, మనకు కరోనా అక్క వచ్చినా కూడా, భయము ఉండదు కదా?

కొన్ని పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు చూడండి, అందరికీ తెలుసు, కాని చేయరు.

* పసుపు ప్రతి గడపకి పూసి, కుంకుమ పెట్టే వాళ్ళు అప్పుడు. ఇప్పుడు, అపార్ట్మెంట్లో గడపలు లేవు. ఇళ్ళలో కూడా, బయట గడప ఉన్నా, లోపల గడప లేదు. ఒక వేళ గడప ఉన్నా తప్పించుకోవడానికి, పసుపు రంగు పుసి, ఎర్ర రంగు చుక్కలు పెడుతున్నారు. అంతే గాని, ప్రతి గడపకు పసుపు పూయడము లేదు. పసుపు యాంటిబయాటిక్ అంటే క్రిములు వైరస్ లను ఆపుతుంది అని అందరికి తెలుసు, కానీ చేయరు.

* కొంచెం అనారోగ్యంతో ఉన్నా కూడా వేడి పాలలో లేదా నీళ్లు లో పసుపు వేసుకుని తాగేవారు. ఇప్పుడు, నామోషి.

* జుట్టు ముడి వేసే వారు, ఇప్పుడు అంతా వదులుగా వదిలేయడమే విరబోసుకోవడము

* పేరంటానికి గాని, ఇంటికి గాని పెద్దలు వస్తే, కాళ్ళకు పసుపు పూస్తారు అప్పుడు. ఒకవైపు మర్యాద సాంప్రదాయము, ఇంకోవైపు రక్షణ, నడుము వంగుతుంది కూడా, మనలో అహంకారము పోతుంది.

గంధము, పసుపు గొంతుకు పూసేవారు అప్పుడు. ఇప్పుడు దాదాపుగా 80 శాతము చేయడము లేదు. చేసినా గిన్నె పెట్టి తీసుకోమంటున్నారు.

* పండగలకి, నిత్య పూజలకు కూడా, ఇంట్లో పసుపు నీళ్ళు చల్లే వాళ్ళు, చుట్టూ తిరిగి శుద్ధి చేసేవారు. అవి పడితే క్రిములు, కీటాకలు పారిపోతాయి. అలాగే ధూపము, దీపము, సాంబ్రాణి కూడా వేసే వారు. ఇప్పుడు అవేవి చేయము.

* ఇంటికి మామిడి తోరణాలు కట్టేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ తోరణాలు. మామిడి ఆకు వాసనకు, క్రిములు వైరస్ రావు.

* కాళ్ళు చెప్పులు బయట కడిగి, అవి బయట విడిచేవారు. ఇప్పుడు, ఇంట్లోనే విడుస్తున్నారు. అంటే, క్రిములను ఇంటోకి తెస్తున్నారు.

* ఇంటి ముందు పూల తోట ఉండేది, ఇప్పుడు ఇంటిముందు ఖాళీ మరియు తీరిక లేదు. కనకాంబ్రాలు మరబము (మరమము) ఇంకొన్ని పూల వాసనకు క్రిములు రావు.

చాలా మంది మేము బయటకు పోవడము లేదు, మాకు రాదు అనుకోవడము సరికాదు. జూ లో పులికే వచ్చింది, అది షికారు కు పోదు, జనము తాకరు. ఇంట్లో ఇతర మనుషులు బయటకు పోవచ్చు, పని పిల్ల రావొచ్చు, కూరలు కాయలు పాల పాకెట్, ఇతర పాకెట్ లు, బయట నుండి తెచ్చిన ఏ వస్తువు ద్వారా, అయినా రావొచ్చు. జాగ్రత్తలు సుమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1193 General Articles, 47 Tatvaalu
Dt : 16-Apr-2020, Upd Dt : 16-Apr-2020, Category : General
Views : 327 ( + More Social Media views ), Id : 499 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : covid 19 , corona , old indian tradition , turmeric , kumkuma , flower garden , shoes
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content