శంకరాభరణము -ఆధ్యాత్మిక నాదం- రాగం తానం పల్లవి, శంకరా నాద శరీరా పరా, దొరకునా ఇటువంటి సేవ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1491 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1526 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sankarabharanam Telugu/ Tamil/ Malayalam/ Kannada movie, Ragam Tanam Pallavi, Shankaraa Nada Sarirapara, Dorakuna ituvanti seva - devotional songs. Please try to sing and teach to kids for good vaksuddi.

తినగ తినగ వేము తియ్యగనుండు, పాడగా పాడగా పలుకు బాగా వచ్చును, మీరు 3 ఏళ్ళు పై గా మారుతున్న గొంతును చూస్తున్నారు. స్పష్టమైన వాచక తపస్సుకు, ఆధ్యాత్మిక నాదం కు, మీరూ ప్రయత్నము చేస్తూ, పిల్లలతో వాక్సుద్ది నేర్పుతారు కదూ.

దేవుని దరిచేరడానికి పూజించడానికి, మన చుట్టూ ఉన్న గురువులను సేవించడానికి, శిష్యులను ఆదరించడానికి, ఇతరుల అజ్ఞానం పోగొట్టడానికి, మనశ్శాంతిని పొందడానికి ఇవ్వడానికి, గొంతు మాట వాక్సుద్ది పాట రాత కూడా, నియమ కఠిన సాధనతో వచ్చే ఒక శక్తి వంతమైన ఉచిత దోవలే.

ఎవరూ దొంగిలించలేని ఈ సత్ గుణములు, మనశ్శాంతి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి ఇతరులకు ఉచితముగా ఇవ్వడానికి కూడా ఇవి ఉపయోగము. మరలా మరలా నెలల ఏళ్ళు తర్వాత ఖాళీ సమయములో చదవవచ్చు, వినవచ్చు సుమా.

రాగం తానం పల్లవి, నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి, అంటూ మనమూ చిన్న గా కూని రాగాలు తీద్దామా, గొంతు స్వర తంత్రులతో రాగం తీయడం మొదలు పెడదామా?

ఇంకెప్పుడు మరి, ఇప్పుడే అన్ని నాడులు కదిలేటప్పుడే గదా, ప్రయత్నించాలి? భగవద్గీత అయినా అంతే అని అనుకున్నాము కదా?

శంకరా, నా ప్రాణము నీవని, నా గానమే నీదని, ఆ నీ ప్రాణమె ఈ మా గానమనీ, మన మౌనవిచక్షణ, మన ధ్యాన విలక్షణ, ఆ రాగమె ఒక యోగమని అనలేమా? నాదో పాసన, చేసిన వాడను, నీ వాడను, నేనే అని అనలేమా?

దొరకునా ఇటువంటి సేవ, మీ పద రాజీవముల చేరు, నిర్వాన సోపాన మధిరోహణము, సేయు త్రోవా అని మనసారా హ్రుదయములో నుంచి పలకలేమా?

20 ఏళ్ళు పై గా మీలాంటి మంచి గురువులను సేవించుకోవడము, మీ నుంచి సహాయం పొందడం, దానికి ఈ విధముగా క్రుతజ్ఞతలు తెలపడం, మీరు అలాగే మేమూ అరిషడ్వర్గాల మాయలో పడి, అష్టవ్యసనాలకు పాద దాసులై, పంచభూతాల శిక్షకై వెళ్ళకుండా ఆపే ప్రయత్నం, రోజూ ఓ 15 నిమిషాలు సత్సంగ సేవ చేసే, భాగ్యం దొరకడం ఎంత అద్రుష్టము, ఎన్ని జన్మల ఆధ్యాత్మిక సువాసన?

అదీ తెలిసిన మరియు తెలియని గురువులు, రాజకీయ గురువులు, అధికార గురువులు, ఎవరినీ ఏమీ ఇన్నాళ్ళు ఆశించకుండానే, క్రుతజ్ఞతతో తలచే, భవిష్యత్తు జాగ్రత్తలు గుర్తు చేసే, భాగ్యం ధైర్యం ఆలోచన ముందుచూపు, ఎంత మందికి ఉంటుంది?

శంకరాభరణం 1980 లో, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన, సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ఈ చిత్రాన్ని పూర్ణోదయా క్రియేషన్స్ పతాకం పై, ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.

జె. వి. సోమయాజులు, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ముఖ్యపాత్రలు పోషించారు. కె. వి. మహదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది.

కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మూస చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది.

అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది.

ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ కళా తపస్విగా పేరొందారు. గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్రరంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది.

పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు, రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని, ఒక్క కాపు కాయడానికి, తన చేతులడ్డు పెట్టిన, ఆ మహానుభావులెవరో వారికి, శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను, అని సినిమా చివరలో శంకర శాస్త్రి, సభికులతో చెప్పే మాట, ఈ సినిమా యొక్క సారాంశాన్ని కొన్ని మాటల్లో వివరిస్తుంది. ఈ సినిమాకు రాష్ట్ర నంది, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో.

1) ప: రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి 2 ||రాగం తానం||

నాదవర్తులై, వేదమూర్తులై... 2 రాగకీర్తులై త్రిమూర్తులై..||రాగం తానం||

చ:కృష్ణా. తరంగాల సారంగ రా.గా.లు
కృష్ణ లీలా., తరింగిణీ., భక్తి గీతాలు - 2 సార్లు 2 లైన్లు
సస్య కేదారాల, స్వరస గాంధారాలు 2
సరస హృదయ క్షేత్ర, విమల గాంధర్వాలు 2
క్షీర సాగర శయన, దేవ గాంధారిలో .. . ఆ ఆ ఆ 2
నీ పద కీర్తన సేయగా... పమ పదని ||రాగం తానం||

శ్రుతి లయలే, జననీ. జనకులు కాగా
భావాల, రాగాల తాళాల తేలి - 2 సార్లు 2 లైన్లు
శ్రీ చరణ మందార, మధుపమ్ము నై వ్రాలి 2
నిర్మల నిర్వా.ణ, మధు ధారలే గ్రోలి 2
భరతాభినయ వేదా ఆ ఆ ఆ , 2 వ్రత దీక్ష పూని
కైలాస సదనా, కాంభోజి రాగాన 2
నీ పద నర్తన సేయగా...ప దా ని ||రాగం తానం||

Ragam Tanam Pallavi, Singers: SP. Balasubramaniam, Lyrics: Veturi


2) శంకరా.., నాద శరీరా పరా..,
వేద విహారా హరా., జీవేశ్వరా... శంకరా... - 2 సార్లు

ప్రాణము నీవని, గానమే నీదని, ప్రాణమె గానమనీ ..
మౌనవిచక్షణ, ధ్యాన విలక్షణ, రాగమె యో.గమని - మొత్తము 2 లైన్లు 2
నాదో పా.సన, చేసిన వా.డను, నీ. వాడను, నే.నై.తే 2
దిక్కరీంద్రజిత, హిమగిరీంద్రసిత, ఖందరా నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ, నిర్ణిద్ర గానమిది,
అవతరించరా, విని తరించరా ||శంకరా||

మెరిసే మెరుపులు మురిసే పెదవుల, చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల, సిరి సిరి మువ్వలు కాబోలు - మొత్తము 2 లైన్లు 2 సార్లు
పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా..
నా గానలహరి నువు మునుగంగా, ఆనంద వృష్టి నే తడవంగ... ||శంకరా||

Shankaraa Nada Sareerapara, Singers: SP. Balasubramaniam, Lyrics: Veturi

3) దొరకునా...దొరకునా... ఆ ఆ
దొరకునా ఇటువంటి సేవ 2
నీ పద రాజీవముల చేరు, నిర్వాన సోపాన మధిరోహణము, సేయు త్రోవా ||దొరకునా||

రాగాలనంతాలు, నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల, పోకార్చు దీపాలు మొత్తము 2 లైన్లు 2
నాదాత్మకుడవై... నాలోన చెలగి,దగ్గు నా ప్రాణదీపమై నాలోన వెలిగే...దగ్గు
ఆ..ఆ..ఆ...దగ్గు ఆ ఆ దగ్గు
ఆ నాదాత్మకుడవై...నాలోన చెలగి, నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
నిను కొల్చువేళ, దేవాధి దేవా...,దేవాధి దేవా..,ఆ...ఆ ఆ ||దొరకునా||

ఉచ్చ్వాస నిస్వాసములు, వాయు లీనాలు
స్పందించు నవ నాడులే, వీణా గానాలు
నడలు, యెదలోని సడులె, మృదంగాలు మొత్తము 3 లైన్లు 2
నాలోని జీవమై, నాకున్న దైవమై
వెలిగొందు వేళ, మహానుభావా, మహానుభావా....||దొరకునా||

దొరకునా ఇటువంటి సేవ
దొరకునా... ఇటువంటి సేవ

Dorakuna itu, Singers: SP. Balasubramaniam, Vani Jayaram

Sankarabharam, Music: KV. Mahadevan, Lyrics: Veturi

Sankarabharanam Ragam Tanam Pallavi Shankaraa Nada Sarirapara Dorakuna ituvanti seva  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1526 General Articles, 51 Tatvaalu
Dt : 27-Jul-2022, Upd Dt : 27-Jul-2022, Category : Songs
Views : 107 ( + More Social Media views ), Id : 1476 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sankarabharanam , ragam , tanam , pallavi , shankaraa , nada , sarirapara , dorakuna , ituvanti , seva
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content