పాటతో పరమార్ధం - సరస్వతి నమస్తుభ్యం, ఓనామహా - మనుషులు మట్టి బొమ్మలు - కృష్ణ, జమున, సావిత్రి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,769; 104 తత్వాలు (Tatvaalu) and views 226,498.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Saraswathi Namastubyam O namaha sivayaha - Manushulu Matti Bommalu - Krishna, Jamuna, Savitri

సరస్వతి నమస్తుభ్యం ఓనామహా శివాయహా, ఆఆ, ఈఈ, ఊఊ, ఋౠ, లులూ, ఎ ఏ ఐ, ఒ ఓ ఔ, అం అహా అంటూ తెలుగు అచ్చులు తో కూడిన ఈ మంచి పాట, పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తుంది, ఆ చదువుల తల్లి ఆశీస్సులు ఇస్తుంది.

మరి పిల్లల చేత పాడిస్తారా? వాట్సాప్ లాంటి, సోషల్ మీడియాలో తెలుగు రాపిస్తారా? భాషకు మంత్ర తంత్రం కు పట్టు, ఈ అక్షరాలు, వాటి ఉచ్చారణే. తెలుగు గురువుల గురించి చెప్పండి, ఫోటోలు రచనలు పద్యాలు కాలజ్ఞానం పాటలు చూపండి - వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర. తమ సొంత తల్లి దండ్రులపై, ప్రేమ క్రుతజ్ఞత విశ్వసనీయత చిత్తశుద్ది కూడా, ఇందులో ఈ దోవలో తెలిసిపోతుంది.

దేశాలుగా, రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా, పార్టీలు, సంఘాలు, కులాలు, వర్గాలు, గుంపులు గా విడిపోతున్న, మన జనాలకి, సిగ్గు తెప్పించే ప్రయత్నం ఈ పాట లో ఉంది. అది పసి పిల్లల వయసు నుంచే, వారి మనసులో బలముగా నాటుకోవాలి. మొక్కై వంగనిది మానై వంగునా?

చూడండి ఎంత బాగా చెప్పారో - మన తెలుగు భాషకు అక్షరాలెంతో, దేశానికీ మీరూ అంతే సంస్కార పిల్లలు. మన మంచి మాట మాట కలిస్తే, మంచి పాటౌతుంది. అలాగే మీ మనసు, మనసు కలిస్తే, వెలుగు బాటౌతుంది. కలిసీ మెలిసీ బ్రతకండీ, కలతలే లేక మెలగండి అని ఆనాడు చెప్పారు.

మరి ఈ రోజు, అమ్మ నాన్న, అత్త మామ, స్నేహితం, బంధుత్వం, భాగస్వామి తో పడదు, పిల్లలు మాట వినరు, అంతా కపటం నాటకం. ఒక ఇంట్లో నే ఇంత అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ఉంటే, ఇంక ఊళ్ళు, రాష్ట్రాలు, పార్టీలు, సంఘాలు, వర్గాలు, కులాలు, దేశాల మధ్యలో, పోటీలు కక్షలు కార్పణ్యాలు ఉండవా? ఎవరికి నష్టం, మనకే కదా?

పిల్లలు, స్వేచ్చకు రూపం మీరే, శాంతికీ రెక్కలు మీరే. వేమన, బ్రహ్మన, ఆంధ్రకేసరి వారసులు మీరే. సమతా మమతా పంచండి, నవ్య మానవత పెంచండి, ఈ దేశం మీది, దేశ క్షేమం మీదీ, దీని పరువు, బరువు, బాధ్యత మీది అని ఎంత బాగా చెప్పారు.

మరి మన సంస్కార పిల్లలకు, పరాయి రాష్ట్ర భాష బాబాయి తెలుసు కానీ, మన సొంత తెలుగు గురువులు వేమన, బ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి తెలుసునా?

తెలియదు కాబట్టే, మనము జీవితము అంత వ్రుధా చేసుకుని, ముదుసలి తనములో ఒంటరిగా లేదా ఆశ్రమములో, కన్నీళ్ళుతో దిక్కుమాలిన వారిలాగా ఉంటున్నాము. ఎవరి గొయ్య ఎవరు తీసుకున్నారు?

మన పిల్లలు, నిజం తెలియక, వాస్తవం నమ్మలేక, పుకార్లు అబద్దాల ను నమ్మి, మానసిక బలహీనులౌతున్నారు, ఈ పాపం తల్లి దండ్రిది కాదా? మన చుట్టూ ఎన్నో మేక వన్నె పులులు, కాటేయడానికి రెడీ గా ఉన్నాయి.

పిల్లలు దేశం పరువు, బరువు, బాధ్యత మీది అంటే, ఊళ్ళో, రాష్ట్రం లో నే తగవులు అనుకుంటే, విదేశాల్లో తెలుగు సంఘాలలో కూడా, రోడ్ న పడి తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు, కర్రలు రాడ్ లతో కార్యక్రమాలకు వెళుతున్నారు. షాపు లలో దొంగ తనాలు, ఇంకా ఎన్నో నీతి మాలిన పనులతో, తెలుగు జాతి పరువు తీస్తూ, తమ సొంత తల్లి దండ్రుల సంస్కార పెంపకాన్ని అందరికీ చాటుతూ ఉన్నారు. ఇకనైనా, మానవత్వం ఉన్న మనుషులుగా మారుదామా?

సరస్వతి నమస్తుభ్యం, ఓ. నా. మహా.., శి. వా. యహా..
ఆఆ, ఈఈ, ఊఊ, ఋౠ. లులూ..,
ఎ ఏ ఐ, ఒ ఓ ఔ, అం. అహా.. ||సరస్వతి ||

భాషకు అక్షరాలెంతో, దేశానికీ మీరూ. అంతే.
మాట మాట కలిస్తే, మంచి పాటౌతుంది
మీ మనసు, మనసు కలిస్తే, వెలుగు బాటౌతుంది
కలిసీ. మెలిసీ. బ్రతకండీ ..కలతలే. లేక, మెలగండి

మంచికి., మనుగడకు., మనసులు మీరే.
చదువులకు., సంపదకు., సత్తువ మీరే.
దే.శానికి దై.వానికి, దీపికలు, మీరే దీపికలు
శ్రామిక శక్తిగా మా.రండీ , కరువు రక్కసిని హతమార్చండి

బా.పూ. తెచ్చిన స్వేచ్చకు., రూపం మీరే.
జవహర్ పెంచిన శాంతికీ., రెక్కలు మీరే.
వేమన, బ్రహ్మన, ఆంధ్రకేశరి, వారసులు మీ.రే..
సమతా మమతా.. పంచండి , నవ్య మా.నవత పెం.చండి
ఈ దేశం మీ.ది, దేశ క్షేమం మీ.దీ, దీని పరువు, బరువు, బాధ్యత మీది
ఈ దేశం మీ.ది, దేశ క్షేమం మీ.దీ, ఈ దేశం మీది ||సరస్వతి ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,769; 104 తత్వాలు (Tatvaalu) and views 226,498
Dt : 12-Jul-2023, Upd Dt : 12-Jul-2023, Category : Songs
Views : 371 ( + More Social Media views ), Id : 1832 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Saraswathi , Namastubyam , namaha , sivayaha , Manushulu , Matti , Bommalu , Krishna , Jamuna , Savitri , Namasthubyam , Namastubhyam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content