పాటతో పరమార్ధం- సిరులొలికించే చిన్నినవ్వులే - యమలీల - అలీ, ఇంద్రజ, మంజు భార్గవి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,928,706; 104 తత్వాలు (Tatvaalu) and views 230,151.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sirulokinche Chinni - Yamaleela - Ali, Indraja, Manju Bhargavi, Krishna - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

పెళ్ళి అనేది, మన తర తరాలను పెంచేది. అది రాక్షస గుణాలకు ఉంది, ధనం ఆస్తి వీసా పదవి అధికారం కు అమ్ముడు బోయేది, అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు.

అలాగే దేవతా గుణాలకు ఉన్నది, కేవలం మంచి గుణానికే తల వంచేది, ప్రాపంచిక బ్రమలకు అమ్ముడు పోకుండా.

మరి ఇరువురూ, తమ పిల్లలు ఎదగాలి, రాజ్యాలు ఏలాలని ఆశ పడతారు. కాని ఒకరు, ప్రాపంచిక రాజ్యం కోసం ప్రాకులాడటం, ఇతరులకు వెన్నుపోటు గుండెపోటు తెచ్చైనా, నక్క పులి పాముకే వీరి అండ ఓటు, అది రాక్షస గుణం.

ఇంకొకరు, ఆధ్యాత్మిక రాజ్యం, అది దైవ గుణం, మానసిక నియంత్రణ, త్యాగాలతో, పదిమందికి నిస్వార్ధ సేవ, ముదుసలి వారికి సజీవ గురువు సేవ. ఆవుకు ఓటు అండ లేదా నోటా కే ఓటు.

అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే రామాయణ, మహాభారత, భాగవతాలు చెప్పి, మానసిక బలవంతులుగా చెయ్యాలి. హిరణ్యకశపుని కొడుకు ప్రహ్లాదుడు, రాక్షస వంశములో పుట్టినా కూడా, దేవతా గుణాలను నేర్చుకున్నారు.

పిల్లలను అతి గారాబము చేసి, వారి చెడు గుణాలకు/పనులకు తానా తందానా అంటే, 100 మంది కొడుకులను, తమ మూర్ఖత్వానికి బలి చేసిన, ద్రుతరాష్ట్ర గాంధారి లాగా, చివరకు ఒంటరిగా మిగిలిపోతాము, అనాధాశ్రమాలలో లేదా ఇంట్లో. ఎందుకంటే వారికి ఇతరులకు కీడు చెయ్యడం తప్ప ఇంకేమీ తెలీదు, మంచి మర్యాద చెప్పలేదు నేర్పలేదు. చివరకు తల్లి దండ్రులకే కీడు చేసి, ముందే దూరమయ్యారు పిల్లలు అంతా. అందుకే పెద్దల మాట, చెడపకురా చెడేవు.

ఊరువాడ, నిన్నే, మెచ్చుకుంటే, చూడనీ? ఎందులో ధనము, పదవి లోనా? లేక మంచి గుణములోనా? రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య లను కూడా అందరూ మెచ్చుకున్నారు కదా? ప్రపంచం అంతా తెలుగు వారికి తెలుసు కదా?

కలకాలము, కనుపాపల్లే కాసుకోనీ, నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ - తల్లి దండ్రులు ఈ కోరిక కోరడం తప్పు లేదు కదా? మరి ఎంత మంది క్రుతజ్ఞత విశ్వసనీయత మానవత్వం గల పిల్లలు, తమ ముదుసలి తల్లి దండుర్లు అత్త మామలకు, తమ భాగస్వామి పిల్లలు తో, సమానముగా ఇంట్లో పెట్టుకుని, ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నారు?

వేశా మొదటి అడుగు, అమ్మ వేలే ఊతగా అన్నది అన్నం తినే మనుష జంతువులకు, అమ్మ ముదుసలి వయసులో ఎందుకు అనిపించదు? అమ్మ జంతు లక్షణాలు నేర్పిందా?

నేర్చా మొదటి పలుకు, అమ్మ పేరే ఆదిగా అని ఎందుకు క్రుతజ్ఞతలు చూపలేక పోతున్నారు అవసరాలు తీరాక? నాలో అణువు అణువు, ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోనా, అమ్మ ఋణమే తీరగా అని అందరూ అనుకుంటే, అనాధాశ్రమాలు ఒంటరి బతుకులు ఎందుకు? ముదుసలి తల్లి దండ్రి అత్త మామ శవాలు, ఐస్ పెట్టెలో ఎదురు చూపులు ఎందుకు?

తోడుండగా, నను దీవించే కన్న ప్రేమ, కీడన్నదే కనిపించేనా ఎన్నడైన? ఇది ఎంత మందికి తెలుసు? ఏలినాటి శని నుంచి ఉచితముగా తప్పించేది, ముదుసలి సాత్విక తల్లి దండ్రులు అని? వారి సజీవ గురువు సేవ చెయ్యకుండా, ఎన్ని నూనెలు పోసినా పూజలు చేసినా, శిక్షణ తప్పదు కదా.

సిరులొలికించే చిన్నినవ్వులే, మణి మాణిక్యాలు.
చీకటి ఎరుగని బాబు కన్నులే, మలగని దీపాలు.
బుడిబుడి నడకల తప్పటడుగులే, తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే, మా ధనధాన్యాలు..
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన..
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా..
మహరాజులా.., జీవించాలి నిండు నూరేళ్లు..||సిరులొలికించే ||
జాబిల్లి జాబిల్లి జాబిల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి

నాలో, మురిపెమంతా, పాలబువ్వై, పంచనీ..
లోలో, ఆశలన్ని, నిజమయేలా, పెంచనీ..
మదిలో, మచ్చలేని, చందమామే, నువ్వనీ.
ఊరువాడ, నిన్నే, మెచ్చుకుంటే, చూడనీ.
కలకాలము, కనుపాపల్లే కాసుకోనీ
నీ నీ.డలో, పసిపాపల్లే చేరుకోనీ.. ||సిరులొలికించే ||

వేశా, మొదటి అడుగు, అమ్మ వేలే, ఊతగా..
నేర్చా, మొదటి పలుకు, అమ్మ పేరే, ఆదిగా..
నాలో, అణువు అణువు, ఆలయంగా, మారగా.
నిత్యం, కొలుచుకోనా, అమ్మ ఋణమే, తీరగా
తోడుండగా,, నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే., కనిపించేనా ఎన్నడైన..||సిరులొలికించే ||

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు
సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,928,706; 104 తత్వాలు (Tatvaalu) and views 230,151
Dt : 03-Apr-2024, Upd Dt : 03-Apr-2024, Category : Songs
Views : 90 ( + More Social Media views ), Id : 2076 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sirulokinche Chinni , Yamaleela , Ali , Indraja , Manju Bhargavi , Krishna , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content