పాటతో పరమార్ధం - శివ గోవింద గోవింద - వెలుగునీడలు - ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వీఆర్, జగ్గయ్య, రేలంగి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,940,996; 104 తత్వాలు (Tatvaalu) and views 230,662.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Siva Govinda Govinda - Velugu Needalu - ANR, Savitri, SVR, Jaggayya, Relangi

లోకములో జరిగే, జరగబోయే చిత్రాలు విచిత్రాలు పెద్దలు ఎప్పుడో చెప్పారు శివ గోవింద, హరి గోవింద అంటూ, అవి నేటికీ మనకు పాఠాలే. ప్రాపంచిక బ్రమలు లో మునిగి మానవుడు, స్వార్ధపరుడై, ఎప్పుడు ఏమి చేస్తాడో కూడా, ఎవరికీ తెలీదు, ఆఖరికి తనకే తెలీదు. భస్మాసురుడు ఏమి చేసుకున్నాడు, శివుని నుంచి వరాలు పొంది? అలా ఉంటాయి, మన మానవుల పైత్యపు చేష్టలు.

లేనప్పుడు లేదని ఓ ఏడుపు, ఉంటే భూమిపై కాలు నిలువదు. సంతానమే లేక, స్వర్గమే లేదని ముందు చిట్టి పాపను, తెచ్చి పెంచు కుంటారు. తర్వాత ఖర్మ కాలి, వారికి సంతు కలిగిందంటే, ఆ చిట్టి పాపాయి గతి, ఏమి అవుతుందో మనందరికీ తెలుసు.

తమ బాగు కోసమై, తంటాలు పడలేరు, కష్టపడి సంపాదించలేరు, సంపాదించిన దానిని మంచికి ఖర్చుపెట్టలేరు. ఎదుటి కొంపకు, ఎసరు పెడతారు. పొరుగు పచ్చకు, ఓర్వలేని వారి గతి, ఏమి అవుతుందో మనందరికీ తెలుసు.

పొరుల కోసం, త్యాగమొనరించు వారొకరు, పరుల మోసం, చేసి బ్రతుకు వారింకొకరు. ఉపకారికే కీడు తలపెట్టు, కనీసం సొంత ముదుసలి అమ్మ నాన్న కే తమతో సమాన వైద్య సౌకర్యాలు ఇవ్వలేరు, మరి వారి గతి, ఏమి అవుతుందో మనందరికీ తెలుసు.

కలిమి లేనన్నాళ్ళు, బీదవారు మధ్యతరగతి వారు అందరూ కలిసి మెలిసుంటారు, బాంధవ్యాలతో. అద్రుష్టము కలసి వచ్చి, కలిమి చేరిన నాడు, వారు వీరునే గాక, బయట వారి తో కలిపి, కాట్లాడుకుంటారు. ఇక ఆ కలిమి పెంచే, కాయ కష్ట జీవుల పని, ఏమి అవుతుందో మనందరికీ తెలుసు.

ఆనాడు, శ్రీ యోగి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానము, బోధ చేశారయా మనందరికీ. కానీ మనకు బుద్ది రాదు, జాగ్రత్తలు పడము. ఈనాడు, కొడసరి వెంగళప్ప లేదా మనము చెప్పిన లేదా మీరు చెప్పిన, మాట అక్షరాలా, జరిగి తీరేనయా అని తెలిసి కూడా, పతనము వైపు అడుగులు మారడం లేదు.

శివ గో.వింద గోవింద, హరి గో.వింద గోవింద 2

సంతానమే లేక, స్వర్గమే లేదని
చిట్టి పాపను, తెచ్చి పెంచు కుంటారు - మొత్తము 2 లైన్లు
సంతు కలిగిందంటే, చిట్టి పాపాయి గతి
శ్రీమతే రామానుజాయన్న మా||శివ గోవింద||

తమ బాగు కోసమై, తంటాలు పడలేరు
ఎదుటి కొంపకు, ఎసరు పెడతారయా
పొరుగు పచ్చకు, ఓర్వలేని వారి గతి
శ్రీమతే రామానుజాయన్న మా||శివ గోవింద||

పొరుల కోసం, త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం, చేసి బ్రతుకు వారింకొకరు - మొత్తము 2 లైన్లు
ఉపకారికే కీడు తలపెట్టు, వారి గతి
శ్రీమద్రమా రమణ గోవిందో ||హరి గోవింద||

కలిమి లేనన్నాళ్ళు, కలిసి మెలిసుంటారు
కలిమి చేరిన నాడు, కాట్లాడుకుంటారు
కలిమి పెంచే, కాయ కష్ట, జీవుల పని
శ్రీమతే రామానుజాయన్న మా||శివ గోవింద||

ఆనాడు, శ్రీ యోగి వీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము, బోధ చేశారయా - మొత్తము 2 లైన్లు
ఈనాడు, కొడసరి వెంగళప్ప, మాట
అక్షరాలా, జరిగి తీరేనయా||శివ గోవింద||

Kosaraju, Madhavapeddi Satyam and Udutha Sarojin
Kala Kaanidi, Sri Sri, Relangi

చిత్రం: వెలుగునీడలు (1961); సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు; సాహిత్యం: కొసరాజు ; గానం: మాధవపెద్ది సత్యం, ఉడుత సరోజినీ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,940,996; 104 తత్వాలు (Tatvaalu) and views 230,662
Dt : 12-Oct-2023, Upd Dt : 12-Oct-2023, Category : Songs
Views : 324 ( + More Social Media views ), Id : 1939 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Siva , Govinda , Velugu , Needalu , ANR , Savitri , SVR , Jaggayya , Madhavapeddi , Satyam , Kosaraju , Relangi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content