Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
శివశక్తి హిందూ ఐక్య వేదిక వారు, కరుణాకర్ సుగ్గున గారి నాయకత్వం లో, రెండు తెలుగు రాష్ట్రాలలో, వివిధ హైందవ కార్యక్రమాలతో బాగా ప్రచారం చేస్తున్నారు. వీడియో చూడండి, శివాజీ జయంతి శోభా యాత్ర వరంగల్ లో.
చిట్వేలు మండలం లో శివశక్తి కార్యక్రమాలను గ్రామాల్లో వేగవంతం చేయడానికి 28వ తేదీ నుండి ప్రతిరోజు 200 నుండి 250 ఇండ్లలోని ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకూ, హైందవ ధర్మ ప్రచారానికి సమయం కేటాయించి పర్యటించాలని, నిర్ణయం తీసుకోవడం జరిగింది .
మతం మారే వారికి అలాగే మారు అన్న వారికి, ఎందుకు మారకూడదో చెపుతూ, హైందవము యొక్క గొప్పతనానికి, వివరణలు ఇస్తున్నారు. ఇతర మతాల వారితో సుదీర్గ చర్చలలో పాల్గొని, సరైన జవాబు లు ఇస్తూ, వీరు అడిగే ప్రశ్నలకు అవతలి వారు, జవాబు ఇవ్వలేక పోతున్నారు.
పల్లెటూరు లలో, ఇతర మత ప్రచారమును, వీరు విజయ వంతముగా ఆపగలిగారు, పోలీసుల ద్వారా, వివరించి. శివశక్తి వారి ప్రచారం ప్రకారం, ఇతర మతాల వారు, లోకల్ పోలీసుల అనుమతి లేనిదే, పోస్టర్లు , ఇంటింటికి ప్రచారం, రోడ్డు మీద కూడా తిరుగుతూ, మైకులో చెప్పకూడదు. అది నేరము, అనుమతి పత్రం తోనే, చెయ్యాలి ప్రచారం.
మీకు ఎదురు వస్తే, మీరూ అడగవచ్చు, ఈ ప్రాంతంలో పోలీసుల అనుమతి ఉందా , అది నిజమేనా అని. చూడండి వారి పాంప్లెట్.
మేము సుతి మెత్తగా మాటలలో, హిందూ ప్రచారం చేస్తుంటే, వీరు మాత్రము గట్టిగా, చేతలలో, మాటలలో, రుజువులతో, జవాబులను సూటిగా, ఎదుటి వారి తల తిరిగేటట్లు, సమాధానాలు ఇస్తున్నారు.
మనము చేయలేనిది ఇంకొకరు చేస్తున్నప్పుడు, కనీసం మనం వారిని ప్రోత్సాహం చేయాలి, హైందవ ధర్మ రక్షణ కొరకు. మంచి ఎవరు చేసినా, మన వంతు ప్రొత్సాహము మనము ఇవ్వాలి.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2273 General Articles and views 2,697,912; 104 తత్వాలు (Tatvaalu) and views 285,002
Dt : 24-Feb-2020, Upd Dt : 24-Feb-2020, Category : News
Views : 3056
( + More Social Media views ), Id : 360
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
shivashakthi ,
karunakar ,
hindu vahini
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments