పాటతో పరమార్ధం- ఎవరో ఒకరు ఎపుడో అపుడు, నడవరా ముందుగా, అటో ఇటో - అంకురం - ఓం పురి, రేవతి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1757 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1792 General Articles and views 1,383,277; 93 తత్వాలు (Tatvaalu) and views 184,010.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Evaro okaru epudo apudu - Ankuram - Revathy, Sarath Babu, Om Puri

*పాటతో పరమార్ధం- ఎవరో ఒకరు ఎపుడో అపుడు, నడవరా ముందుగా, అటో ఇటో - అంకురం - ఓం పురి, రేవతి - అది మీరే ఎందుకు కాకూడదు మంచికి*

Someone is going to walk first, then and there, this or that side. Why can't you be the first one for good?

ఎవరో ఒకరు ఎపుడో అపుడు, నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు అన్నాడు రాజు, సోమక్కతో.

పాటలకేమయ్యా, ఎవరైనా రాస్తారు పాడతారు పురాణాలు వల్లె వేస్తారు, మరి త్రికరణ శుద్దిగా చేష్టలు మాత్రం ఉండవు దైనందిక జీవితములో, సాక్ష్యం తో చూపలేరు. నా 4 గురు బిడ్డలు, 3 గురు విదేశాల్లో, ఒకరు బెంగళూర్ లో వెలగబెడుతున్నారు, ఎన్నో ఆస్తులు కొని. ఏ ఒక్కరు, ఈ తల్లిని దగ్గర ఉంచి వైద్యం తో పాటు ప్రేమ పంచుకుందాము, రోజూ చేయి పట్టి నడిపిద్దాము అనుకోవడం లేదు. దగ్గర ఉండ రోజూ మందులు ఏద్దామని అనుకోవడం లేదు. కారులో వారం వారం తిప్పుదామని లేదు వారితో పాటుగా అన్ని చోట్లకు.

ఎందుకనీ, అలా దూరంగా ఉంచారు అక్కా అని అడిగాడు. ఎప్పుడు నిన్ను దగ్గర పెట్టుకోలేదా అని అడిగాడు?

60 ఏళ్ళ లోపు అన్ని పనులకు, పురిట్లకు వేడుకలకు ఇంటిపని వంటపనికి అన్నిటికీ తిప్పారు. కానీ ఎప్పుడైతే, రోగాలు పెరిగి, నడవలేక ఇంటికే పరిమితమయ్యానో, ఇక్కడ బంధువులకు ధనం ఇచ్చి, చూడమన్నారు. తర్వాత ఆశ్రమానికి మారుస్తారేమో. ఎంతైనా, నేను పెంచిన బిడ్డతో ఇతరులు సమానమా. పొనీ వీరికి క్రుతజ్ఞత విశ్వసనీయత ఉందా, ఏదో ధనంకోసం మొక్కుబడిగా నన్ను చూడటమే కానీ, ఉపయోగం లేదు. వాళ్ళేమో, అన్ని విధాలు గా స్తిరపడి, పౌరసత్వాలు తెచ్చుకుని, వ్యాపారాలు చేస్తూ, నీకు ఇక్కడ పడదు ఉండలేవు అని అబద్దాలు చెపుతున్నారు. అదేమంటే, మా స్నేహితుల మందలో ఎవరూ కూడా, ముదుసలి వాసన ఇంట్లో పెట్టుకోరు, కనీసం వారి గురించి మాటలు కూడా మాట్లాడరు, అత్త మామల గురించి కూడా అన్నది. అంతా వ్యాపారం, ఉద్యోగం, ఆస్తులు ఎలా పెంచాలి, రోగాలకు ఎలా ఖర్చుపెట్టాలి. మనుమళ్ళు వారిలాగే తయారు అయ్యారు, వాళ్ళను చూసి నా పిల్లలు భయపడుతున్నారు. అందరూ ఇంతేనా? ఎవరూ తల్లిని గుండెల్లో పెట్టుకుని చూడరా? అని అడిగింది.

ఎందుకు లేరు సోమక్క, మొన్నే ఎవరో పంపారు ఒక ఫోటో, అందులో వివరముగా రాసి ఉన్నాయి. వాళ్ళ అమ్మను 9 ఏళ్ళు గా దగ్గర ఉంచి సజీవ గురువులాగా సేవ చేస్తున్నారు అంట. ప్రపంచ ఉత్తమ వైద్యం ఇప్పిస్తున్నారు అంట. రోజూ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు అంట. ఇంట్లోనే ఆయుర్వేదం తో, నిండు నుంచి అర బిళ్ళకు తెచ్చి షుగర్ బీపీని కట్టేసారు అంట. ఒక రోజు వేసుకో పోయినా ఏమి కాదు. అన్ని కారాలు ఉప్పు తిండి అన్ని పడుతున్నాయి. కాకర అల్లం వెల్లుల్లి రసం అంటా, కషాయం అంటా, .. ప్రతి వారం, గుడికి, షికారు, మార్కెట్ కి తీసుకుని వెళతారు అంట, కాళ్ళకు పూజ అంట, రోజు పాద నమస్కారం అంటా... అబ్బో ఎన్నో రాసారు స్పష్టముగా. ఇందాక నేను పాడింది అదే అక్కా, ఎవరో ఒకరు ఎపుడో అపుడు, నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు అన్నాడు మరలా. ఒకరితో మంచి మొదలు అయితే, మిగతా వాళ్ళు అది చూసి తామూ మొదలు పెడతారు.

నిజమా రాజూ, ఎవరూ వారు, ఏ వూరు, ఇది ఖచ్చితముగా నిజమని ఎలా చెప్పగలవు?

ఊరు తెలీదు అక్కా, నాకు పంపిన వారిని అడిగితే, మాకు తెలీదు, చిత్ర విచిత్రం గా ఉన్నాయి అని, నాకు పంపారు. కానీ సోషల్ మీడియా లింక్ ఉంటే, అందులోకి వెళ్ళి చూసా 3 ఏళ్ళు పైగా, ప్రతి వారం, ఏదో ఒక ఫోటో ఉంది. ఇంక అంతకన్నా ఎక్కువ ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసే ఓపిక లేదు నాకు. ఎందుకంటే మన జనాలు, కష్టాలు లో, ఒక నెల చేసి, 2 వ నెలే మానేస్తారు. అప్పులు లేవని మన పిల్లలు ఒక్క రోజు చెప్పరు.

వామ్మో అయితే నిజమే, ఇంక చిత్ర విచిత్రాలు ఏమిటి, అందులో?

అక్కో అదొక పురాణమే అవుతుంది, నువ్వు నమ్మలేవు. ఎందుకంటే, ఆ మాటలకు, మన పిల్లల చేష్టలకు, అసలు కుదరవు. డబ్బు అప్పు అంటే పడి చస్తారు మన పిల్లలు, ఆఖరికి నిన్నే వదిలేసారు. కానీ అక్కడ, లక్షల ఆదాయం ఫించను ప్రభుత్వ ఉద్యోగం వదలి, 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా, అమ్మకు ఎటువంటి సౌకర్యాలు తగ్గలేదు అంట.

నిజమా, మా పిల్లోడు ఒక్క నెలకే ఉద్యోగం పోతే, భాగస్వామి ని పిల్లలను మన ఇంటికి తోలాడు.

అంతే కాదు అక్కా, నేల నిద్ర అంటా, ఇంటి శాఖాహారం అంటా, 20 ఏళ్ళుగా ఉదయం 5 లోపు లెగిచి యోగా ధ్యానం అంటా. జలనేతి అని ముక్కులో నీళ్ళు అంట. 180 వారాల పైగా 108 ప్రదక్షిణాలు అంటా. పురాణాలు, వేద శ్లోకాలు పద్యాలు పాటలు అంటా ఓ 400 దాకా, కధనాలు ఓ 1700 అంటా. జిల్లా కావాలని అధికారులు, నాయకులు అందరికీ సందేశాలు పంపి తల నొప్పి పుట్టించాడు అంట.

ఒరే నిజం చెప్పు, ఆ అబ్బాయి ఏదైనా అసలు ఉద్యోగం చేసాడా లేక, అడవిలో సన్యాసా, చాప ఏంది, శాఖాహారం ఏమిటి? ఇట్టాంటి విడ్డూరాలు ఎక్కడా వినలేదు. మా పిల్లలు శనివారం అంటే 9 కి లెగుస్తారు, 12 కి భోజనానికి గుడికి వెళతారు. సాక్స్ వెసుకుని ఓ 3 ప్రదక్షిణాలు మొక్కుబడిగా చేస్తారు. అసలు నోటికి మంత్రాలు రావు. అంతా ఎంపీత్రీ పాటలు. 3 రోజులు నీసు లేనిదే, డాక్టర్ దగ్గరకు చూపులు లేనిదే నిద్ర పట్టదు. నాకే మన చుట్టాలకే మాటలు ఫోటొలు పంపరు, ఇంకా అధికారులు నాయకులు అంటే, మనకెందుకు అమ్మా అంటారు.

ఉండేది మనతో పాటే, విదేశాలు వెళ్ళి వచ్చినా, తెలుగు లోనే అన్ని మాటలు. ఇలాంటి వారు ఇంకా ఉంటారు, వారూ బయటకు రావాలి. అందరి అమ్మ నాన్న అత్త మామలను ఇంట్లో పెట్టుకుని గొప్ప వైద్యం ఇవ్వాలి ప్రేమతో, రోజూ చేయిపట్టుకుని నడిపిస్తూ. మరి మీరు ఆ మొదటి అడుగు వేస్తారు కదూ?

అబ్బాయి, వాళ్ళ తల్లికి చేస్తే మనకు చేసినట్లేరా. ఎందుకంటే, మన ఊళ్ళో పెద్దమ్మకు నైవేద్యం పెడితే, మనకు పెట్టినట్లే అని భావించడం, మన ఆచారం. ఆ తల్లికి జరిగే సజీవ గురువు సేవ, ఇంకా ఎంతో కాలం జరగాలి ఆదర్శంగా. మన పిల్లలకు అది పంపు, ఒకరికైనా బుద్ది వస్తుందేమో చూద్దాం. అలాంటి కొడుకును ఇమ్మని, దేవుడుని ప్రార్దిద్దాం వచ్చే జన్మకైనా. పది మంది వారికి అండగా ఉండి, ఆ మంచి కార్యక్రమాన్ని గుడిలో నైవేద్యం గా కొనసాగించాలి. మనం చేయలేక పోయినా, చేసే వారిని ప్రోత్సహించాలి, ముందుకు దోవ చూపాలి, స్తిరం చేసేటట్లు చేయాలి అన్నది సోమక్క.

సామాజిక చైతన్య చిత్రం, అంకురం లోని ఈ ఆణిముత్యం లాంటి పాటలో, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత స్పూర్తిని, ఓ క్షణం అయినా సమాజం గురించి, తన గురించి ఆలోచించేటట్లు చేస్తుంది, మొదటి అడుగుకు.

ఓ మహిళ న్యాయం కోసం, నమ్మిన నిజం కోసం చేసే పోరాటమే...అంకురం. రేవతి నటన అద్భుతం. సీతారామశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట. హంసలేఖ స్వరపరచిన ఈ స్వర మధురం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మధురమైన ఆణిముత్యమే.

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు, ఎపుడో అపుడు
నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో, ఎటో వైపు..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి..
మొదటి అడుగు, ఎప్పుడు ఒంటరే మరి..
వెనుక వచ్చు వాళ్ళకు, బాట అయినది..||ఎవరో ఒకరు||

కదలరు ఎవ్వరు, వేకువ వచ్చినా..
అనుకొని కోడి కూత, నిదరపోదుగా..
జగతికి మేలుకొల్పు, మానుకోదుగా..
మొదటి చినుకు సూ.టి.గా., దూకి రానిదే.
మబ్బు కొంగు చా.టు.గా., ఒదిగి దాగితే..
వాన ధార రా.దు.గా, నేల దారికి..
ప్రాణమంటు లే.దు.గా, బ్రతకటానికి.. ||ఎవరో ఒకరు||

చెదరక పోదుగా, చిక్కని చీకటి.
మిణుగురు రెక్క చాటు, చిన్ని కాంతికి..
దానికి లెక్క లేదు, కాళ రాతిరి.
పెదవి ప్రమిద నిలపనీ., నవ్వు జ్యోతిని..
రెప్ప వెనక ఆపనీ., కంటి నీటిని..
సాగ లేక ఆగితే, దారి తరుగునా..
జాలి చూపి తీరమే, దరికి చేరునా..||ఎవరో ఒకరు||

యుగములు సాగినా, నింగిని తాకక..
ఎగసిన అలల ఆశ, అలిసిపోదుగా..
ఓటమి ఒప్పుకుంటు, ఆగిపోదుగా..
ఎంత వేడి ఎండతో., ఒళ్ళు మండితే..
అంత వాడి ఆవిరై., వెళ్ళి చేరదా..
అంత గొప్ప సూర్యుడు., కళ్ళు మూయడా..
నల్ల మబ్బు కమ్మితే., చల్లబారడా..||ఎవరో ఒకరు||

చిత్రం : అంకురం (1993); సంగీతం : హంసలేఖ; సాహిత్యం : సిరివెన్నెల; గానం : బాలు, చిత్ర; నటులు - రేవతి, శరత్ బాబు, ఓం పూరి  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1792 General Articles and views 1,383,277; 93 తత్వాలు (Tatvaalu) and views 184,010
Dt : 22-May-2023, Upd Dt : 22-May-2023, Category : Songs
Views : 71 ( + More Social Media views ), Id : 1756 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Song , Spirit , Evaro , okaru , epudo , apudu , Ankuram , Revathy , Sarath , Babu , OmPuri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content