పాటతో పరమార్ధం- శ్రీరామదాసు - శ్రీ రామా, శుభకరుడు, సురుచిరుడు - ANR, నాగార్జున, సుమన్, స్నేహ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,184; 104 తత్వాలు (Tatvaalu) and views 226,052.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sri Ramadasu - Sri Rama, Shubhakaru, Suruchirudu - ANR, Nagarjuna, Suman, Sneha

తాగరా, శ్రీ రామ, నామామృతం, ఆ నామమే, దాటించు, భవసాగరం అంటూ ఎందరో మహాను భావులు, ప్రాపంచి మోహాన్ని వీడి, అరిషడ్వర్గం అష్టవ్యసనము లను జయించి, రామయ్య సన్నిధిని చేరారు. ఆ ఉచిత నిత్యానందాన్ని, మనలో మనమే నిరంతరము పొందగలము సాధనతో త్రికరణ శుద్ది గా.

మరి మనకు మనము ఇలా ప్రశ్నించుకుంటే?

1) శుభకరుడు, సురుచిరుడు, భవహరుడు, భగవంతుడెవరూ? కల్యాణ, గుణఘనుడు, కరుణా ఘనా ఘనుడు, ఎవరూ? జవాబు ఒక్కటే, ఆనంద నందనుడు, అమృతరస చందనుడు, రామచంద్రుడు కాక, ఇంకెవ్వరూ? అంటూ తాగరా, శ్రీ రామ, నామామృతం, ఆ నామమే, దాటించు, భవసాగరం.

2) ఏ మూర్తి, మూడు మూర్తులుగ, వెలసిన మూర్తి ? ఏ మూర్తి, ముజ్జగంబుల, మూలమౌ మూర్తి? ఏ మూర్తి, శక్తి చైతన్య మూర్తి? ఏ మూర్తి, అడగించు, జన్మజన్మల ఆర్తి?
ఆ మూర్తి, ఏ మూర్తియును, గానీ రసమూర్తి, ఆ మూర్తి, మన అయోధ్యా శ్రీ సీతా రామచంద్రమూర్తి.

3) ఏ వేల్పు, ఎల్ల వేల్పులను, గొలిచెడి వేల్పు? ఏ వేల్పు, ఏడేడు లోకాలకే, వేల్పు? ఏ వేల్పు, నిట్టూర్పు ఇలను, నిల్పు? ఏ వేల్పు ద్యుతిగొల్పు, ఏ వేల్పు మరుగొల్పు? ఏ వేల్పు, దే మలుపు, లేని గెలుపు? ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు ఆ సీతాపతి రామ చంద్రయ్యనే కదూ?

మరి మీరు మీ పిల్లలూ గొంతెత్తి రామ గీతాన్ని పాడుతారు కదూ? మమ్మల్ని తరింప చేస్తారు కదూ?

రామ నామము తారక మంత్రం. భవ భందాల నుండి విముక్తి కలిగించి, సంసార సాగరాన్ని దాటించగల ఏకైక మంత్రం.

ప్రణవనాదమైన ఓంకారం తర్వాత అంత మహత్వపూర్ణమైనది. ప్రతి మంత్రానికి రామనామంతో సారూప్యం చూపిస్తాడు. మనురిషి స్యవనుడు తన స్యవన స్మృతితో రామనామము సకల వేదాలు, శాస్త్రాలు ఇతిహాసాల సారంగా పేర్కొన్నాడు.

రా అనే అక్షరం అష్టాక్షరి మంత్రం అయిన ఓం నమోనారాయణాయి నుంచి, మ అనే అక్షరం పంచాక్షరి మంత్రం అయిన ఓం నమశివాయ నుంది వచ్చాయి.

ఈ నామాన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకు జాతి, కుల, మత బేధాలు లేకుండా జపించవచ్చు, రాయవచ్చు, స్మరించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి ఆది దేవుడు అయిన శివ పరమాత్ముడు నిత్యం రామనామం జపిస్తారు. అంత గొప్పది రామ నామం.

రామా… ఆఆ
శ్రీ రామా… ఆఆ ఆ
శుభకరుడు, సురుచిరుడు, భవహరుడు, భగవంతుడెవరూ..
కల్యాణ, గుణఘనుడు, కరుణా ఘనా ఘనుడు, ఎవరూ..
దైవ తత్వమున, అల్లారు ముద్దుగ
అలరారు, అందాల, చంద్రుడెవరూ..
ఆనంద నందనుడు, అమృతరస చందనుడు
రామచంద్రుడు కాక, ఇంకెవ్వరూ..

తాగరా, శ్రీ రామ, నామామృతం..
ఆ నామమే, దాటించు, భవసాగరం..2 సార్లు మొత్తము

2)ఏ మూర్తి, మూడు మూర్తులుగ, వెలసిన మూర్తి
ఏ మూర్తి, ముజ్జగంబుల, మూలమౌ మూర్తి
ఏ మూర్తి, శక్తి చైతన్య మూర్తి...

ఏ మూర్తి, నిఖిలాండ, నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి, నిర్వాణ, నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి..

ఏ మూర్తి, ఘన మూర్తి, ఏ మూర్తి, గుణ కీర్తి
ఏ మూర్తి, అడగించు, జన్మజన్మల ఆ.ర్తి
ఆ మూర్తి, ఏ మూర్తియును, గానీ రసమూర్తి
ఆ మూర్తి, శ్రీ రామచంద్రమూ..ర్తి..

తాగరా… ఆ ఆ, తాగరా శ్రీ రామ నామామృతం..
ఆ నామమే దాటించు భవసాగరం..

పాపాప, మపనీప, మపనీప, మప సనిప మాపామ, శ్రీ రామా
పాపాప, మపనీని, పనిసాస, రిరి సనిప, మాపాని మ పమా, కోదండ రామా
మపని సరి సానీ, పానీ..పా..మా… సీతారామా
మపని సరి సా రీ, సరి మరిస నిపమా, ఆనందరామా
మా., మా., రిమరిమ రిసరిమా… రామా జయరామా
సరిమా.. రామా.., సపమా.. రామా… పా.. ఆఆఆ వన రామా..

3)ఏ వేల్పు, ఎల్ల వేల్పులను, గొలిచెడి వేల్పు
ఏ వేల్పు, ఏడేడు లోకాలకే, వేల్పు
ఏ వేల్పు, నిట్టూర్పు ఇలను, నిల్పు..

ఏ వేల్పు, నిఖిల కళ్యాణముల, కలగల్పు
ఏ వేల్పు, నిగమ నిగమాలన్నింటిని, తెల్పు
ఏ వేల్పు, నింగి నేలలను, గల్పు

ఏ వేల్పు ద్యుతిగొల్పు, ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు, దే మలుపు, లేని గెలుపు

ఏ వేల్పు, సీతమ్మ వలపు, తలపుల నేర్పు
ఆ వేల్పు, దాసాను దాసులకు, కై.మో.డ్పు
తాగరా ఆఆ ఆఆ… తాగరా శ్రీ రామా నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,184; 104 తత్వాలు (Tatvaalu) and views 226,052
Dt : 01-Jun-2023, Upd Dt : 01-Jun-2023, Category : Songs
Views : 316 ( + More Social Media views ), Id : 1769 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sri , Ramadasu , Rama , Shubhakaru , Suruchirudu , ANR , Nagarjuna , Suman , Sneha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content