సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ - అమ్మ రాజీనామా - శారద, దాసరి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,966,275; 104 తత్వాలు (Tatvaalu) and views 231,426.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పురాణాలలో బ్రహ్మ ను మన స్రుష్టికర్త గా తెలుసు. కానీ ఆయనకు అమ్మ ఉంది అంటున్నారు. ఆవుకు గడ్డి పెట్టి, పాలు పితికి తాను బాగుపడుతూ, చివరకు వయసు మళ్ళిందని నిర్దాక్షిణ్యముగా, కసాయి వారికి అమ్మడం, మనకు తెలుసు.

మరి అలా మొదలు పెట్టిన ఓ తప్పుడు సాంప్రదాయం, చివరకు, మన కన్నతల్లిని తండ్రిని కూడా, దూరముగా ఒంటరిగా లేదా తక్కువ సౌకర్యాలు ఉన్న ఇతరులతో వదిలివేయడం, ఇప్పుడు క్రుతజ్ఞతలు విశ్వసనీయత సంస్కారం లేని పిల్లల పద్దతిగా తయారు అయ్యింది.

బిడ్డ పెరిగి, గడ్డమొస్తే, కన్నతల్లే, అడ్డు అడ్డు అని, అలాటి నీచుల గురించి ఎంత బాగా రాసారో ఈ పాట వినండి, అలాంటి ద్రోహులకు వినిపించి, కసాయి గుండెలు కరుగుతాయేమో ప్రయత్నం చేయడం వరకే మన పని. ఫలితము ఆ క్రిష్ణయ్యకే.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.. 2
ఆ అమ్మకే, తెలియని, చిత్రాలు ఎన్నో...
ఈ సృష్టినే, స్థంభింపచేసే, తంత్రాలు ఎన్నో... ||సృష్టికర్త ఒక బ్రహ్మ||

-బొట్టు పెట్టి, పూజ చేసి, గడ్డి మేపి, పాలు తాగి
వయసు ముదిరి, వట్టి పోతే, గోవు తల్లే, కోత కోతా.. - 2 సార్లు మొత్తము

విత్తు నాటి, చెట్టు పెంచితే.., చెట్టు పెరిగి, పళ్ళు పంచితే..
తిన్న తీపి, మరిచిపోయి, చెట్టు కొట్టి, కట్టెలమ్మితే

లోకమా.., ఇది న్యాయమా... 2 - ||సృష్టికర్త ఒక బ్రహ్మ||

-ఆకు చాటు, పిందె ముద్దు, తల్లి చాటు, బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి, గడ్డమొస్తే, కన్నతల్లే, అడ్డు అడ్డు - 2 సార్లు మొత్తము

ఉగ్గు పోసి, ఊసు నేర్పితే..., చేయి పట్టి, నడక నేర్పితే..
పరుగు తీసి, పారిపోతే, చేయి మార్చి, చిందులేస్తే

లోకమా.., ఇది న్యాయమా... 2 - ||సృష్టికర్త ఒక బ్రహ్మ||

Amma Rajinama, Srustikartha Oka Brahma, Sharada, Dasari Narayana Ra
చిత్రం : అమ్మ రాజీనామా (1991), సాహిత్యం : దాసరి నారాయణరావు, సంగీతం : చక్రవర్తి, గానం : కె.జె.ఏసుదాసు

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,966,275; 104 తత్వాలు (Tatvaalu) and views 231,426
Dt : 09-Oct-2022, Upd Dt : 09-Oct-2022, Category : Songs
Views : 684 ( + More Social Media views ), Id : 1575 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : srustikartha , brahma , amma , rajinama , sharada , dasari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content