స్వాతిముత్యం - సువ్వి సువ్వి సువ్వాలమ్మా, సీతాలమ్మా - కమల్ హాసన్, రాధిక - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,278; 104 తత్వాలు (Tatvaalu) and views 226,149.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చెప్పండి, మన జీవితంలో నటించకుండా, మన పతనం ఆపడానికి, మన తప్పు ను వదలమని మార్చుకోమని ధైర్యంగా, మన ఎదుటే, ఖచ్చితంగా చెప్పేవారు ఎవరు? ఎంత మంది ఉన్నారు, మన చుట్టూ, మనసుతో ఆలోచన చెయ్యండి? వారే, దేవుడు పంపిన మన గురువు.

అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వములో, మన భవిష్యత్ మనకు కనపడకపోయినా, వారికి స్పష్టముగా కనపడుతుంది.

మనకు మనం, పతనం తప్పక జరగాలి అన్న సంకల్పముతో అహంకారముతో, మనకు వారి మంచి మాటలు నచ్చక పోతే దూరంగా ఉండవచ్చు, కానీ మమ్మల్ని తక్కువ చేస్తున్నావు అని, దుర్యోధనునిలా వారినే అవమానిస్తే, ఇంకా ఎక్కువ పాపం, పతనం మనకు. గురువుకు అవమానం, ఇంకా పెద్ద మానసిక అండ పోగొట్టుకోవడం.

అన్ని ఉన్నప్పుడు ఎవరి మాట వినం, అన్ని పోయాక ఎవరూ తోడు ఉండరు. మన తప్పులతో, మన పిల్లల పతనం మనమే చేస్తున్నాము, చూడండి పేపర్ వార్తలలో రోజూ, ఎన్ని ఘోరాలో. మన లోపం సరిచేసుకోకుండా, మన తప్పు ఒప్పుకోకుండా, ఎన్ని పూజలు చేసినా, ఎంత నటించినా, శిక్షలు మనకు తప్పవు నేడో రేపో. నాడు దేవుడు కూడా అండ రాడు.

ఆ శిక్షలు అమలు అయినాక, ఎవరమూ ఏమీ చేయలేము. మంచి వాడైన కర్ణుడు కూడా, దుష్టచతుష్టయములో భాగం అయ్యి, అన్ని పాపాలలో పాలు పంచుకుని, సుఖభోగాలు అనుభవించి చివరకు పతనదశలో, క్రిష్ణా ఇదేమి న్యాయం అని అమాయకముగా అడిగాడు, ఇంతకాలం తాను పంచుకున్న పాపాలను మరచి. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. పంచభూతాలు, రికార్డ్ చేస్తున్నాయి సుమీ.

ఒకరికి జరిగిన కష్టాని చూసి, ఎలా పాడుతున్నారో, మీరు ఒకసారి పాడి ప్రయత్నం చేయండి, తోటి వారి కష్టాలను కనీసం వినండి తీర్చకపోయినా, ధైర్యం చెప్పండి, మంచి దోవ చూపండి. వింటే వారి బతుకు మారుతుంది, వినకపోతే, వారి రాత వారే రాసుకుంటారు, తర్వాత ఫలితం కోసం.

ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...
ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....
చాల బాగా పాడుతున్నారే
ఆ... పైషఢ్యం...
మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..
ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ

ని స రి మ ప ని స రి ని రి రి స
ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..
తానననా... తానా...న తదరే.... నా.... ఆ....

సువ్వి సువ్వి సువ్వాలమ్మా , సీతాలమ్మా...ఆహ..
గువ్వ మువ్వ సవ్వాడల్లే, నవ్వాలమ్మా.. హహ
సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ, సీతాలమ్మా...
గువ్వ మువ్వా... సవ్వాడల్లే, నవ్వాలమ్మా..
...ఆ... ఆ..... ఆ.........
సువ్వి సువ్వి సువ్వాలమ్మా, సీతాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా...

అండా.. దండా.. ఉండాలని, కోదండ.. రాముని నమ్ముకుంటే 2
గుండే లేని మనిషల్లే, నిను కొండా.. కోనల కొదిలేశాడా
గుండే లేని మనిషల్లే...2
నిను కొండా.., కోనల కొదిలేశాడా
అగ్గీ లోనా దూకి
పువ్వు, మొగ్గా లాగా, తేలిన నువ్వు
నేగ్గేవమ్మా, ఒక నాడు, నింగి నేల నీ తోడు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు

సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి, సువ్వాలమ్మా, సీతాలమ్మా...

చుట్టూ ఉన్నా చెట్టు చేమ, తోబుట్టువులింకా నీకమ్మా 2
ఆగక పొంగే కన్నీళ్ళే, నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా 2
పట్టిన గ్రహణం విడిచి
నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు, చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు, చూస్తాడా ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వీ..

చిత్రం : స్వాతిముత్యం (1986), కమల్ హాసన్ , రాధిక; సంగీతం : ఇళయరాజా, సాహిత్యం : సి.నారాయణ రెడ్డి, గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

Movie : Swathimutyam (1986), Kamal Haasan, Radhika; Music : Ilayaraja, Lyrics : C. Narayana Reddy, Vocals : Y. P. Balasubrahmanyam, Y. Janaki

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Swathimutyam, Suvvi Suvvi suvvaalamma, Kamal Haasan, Radhika  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,278; 104 తత్వాలు (Tatvaalu) and views 226,149
Dt : 24-Oct-2022, Upd Dt : 24-Oct-2022, Category : Songs
Views : 395 ( + More Social Media views ), Id : 1595 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : swathimutyam , suvvi , suvvaalamma , kamal , haasan , radhika
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content