తాండవ కృష్ణుడు-తరతరాల నా దేశం, నాకిచ్చిన సందేశం(ఉత్తమ ఉపాధ్యాయ బోధ విద్యార్ధులకు)-ANR,Jayaprada - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,220; 104 తత్వాలు (Tatvaalu) and views 224,948.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Tandava Krishnudu - taratarala Naa Desam - college lecturer moral song to students

A lecturer in a college is not only to give lessons but also to teach values ​​of life. See the message of this song.

కాలేజీలో లెక్చరర్ అంటే కేవలము పాఠాలు చెప్పడమే కాదు, బతుకు విలువలు నేర్పడము కూడా. ఈ పాట సందేశం చూడండి.

However, if the parents are not cultured and are in the slavery of Arishadvarga Ashtavyasana, so are their children.

అయితే, తల్లి దండ్రులకు సంస్కారం లేక, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉంటే, వారి పిల్లలు అంతే.

We see the news in the paper - earning 2 hands, rent on 4 houses, parents giving pocket/jacket money, making children dumb, going to movies, getting addicted to drugs, giving cart petrol to go around Baladur, getting drunk in clubs at day and night, We have seen the news parents sent by Veera Tilak so that they drive fast on the bypass/ring road and cause an accident, killing themselves and ruining the lives of others.

పేపర్లో వార్త చూస్తున్నాము - 2 చేతులా సంపాదన, 4 ఇళ్ళు అద్దె ఉన్న, తల్లి దండ్రులే పాకెట్/ జాకెట్ మని ఇచ్చి, పిల్లలను మొద్దులు గా చేసి, సినిమాలు షికార్లు తిరుగుతూ, మత్తు కు అలవాటుపడి, బండి పెట్రోల్ ఇచ్చి బలాదూర్ తిరగమంటూ, పగలే గాక రాత్రి క్లబ్బుల్లో తాగి తూలుతూ, రింగ్ రోడ్/ బైపాస్ మీద వేగంగా నడిపి యాక్సిడెంట్ చేసి, తాము చస్తూ, ఇతరుల జీవితాలు కూడా నాశనం చెయ్యండి అని, వీర తిలకం దిద్ది పంపిన వార్తలు చూసాము.

For Such students, knowing it is useless, they are trying their best, just like us.

అలాంటి విద్యార్ధులకు, ఉపయోగం లేదని తెలిసీ, తన వంతు ప్రయత్నం చేస్తున్నారు, మనలాగే.

All together like us, he took a class. God has given us the opportunity to teach the same morals to degree college computer children, in the past. If it was like that then, today it is impossible for us to enlighten them.

అచ్చు మనలాగే అందరికీ కలిపి, క్లాస్ తీసుకున్నారు. మనకు దేవుడు డిగ్రీ కాలేజీ కంప్యూటర్ పిల్లల కు, ఇలాగే నీతులు చెప్పే అవకాశం, గతంలో ఇచ్చారు. ఆనాడే అలా ఉంటే, ఈరోజు మన వలన కాదు, వారికి బుద్ధి చెప్పడం.

In the absence of discipline and ethics, everything is empty. On the day, when there are no devotees of fear, there won't be a life. If we bow down to no one, out of pride, our children will not bow down to us. That's why, as a teacher, the moral words of the teacher, saying My Shankha Raavam, this awakening song, to his riotous students, are also for all of our lives.

క్రమశిక్షణ నీతి నియమము లేని నాడు, అంతా శూన్యం. భయ భక్తులు లేని నాడు, బ్రతుకే దైన్యం. మనం ఎవరికీ తలవంచం అంటే అహంకారముతో, మన పిల్లలు మనకూ తలవంచరు. అందుకే గురువు గా, నా శంఖా రావం, ఈ జాగ్రుతి గీతం అంటూ గురువు, అల్లరి చేసే తన ఆకతాయి విద్యార్ధులకు చెప్పే నీతి మాటలు, మన అందరి జీవితాలకీ కూడా.

తరతరాల నా దేశం, నాకిచ్చిన సందేశం..
నరనరాలలో, నాలో నిండి ఉన్న, ఆదర్శం
వినిపిస్తా వింటారా, నా గీతం
మీకోసం నేర్చుకున్న, ఈ పాఠం.., గుణపాఠం..

అక్షరాలు దిద్దుకునే, అవకాశం లేని వాళ్ళు
చదివించే దిక్కులేక, చట్టుబండలైన వాళ్ళు
అభాగ్యులు అనాధలు, ఇందరున్న దేశం లో
అవకాశం ఉండి మీరు, జారవిడుచుకుంటే
సంఘానికి దేశానికి దైవానికి ద్రోహం, అది కాదు కాదు క్షమార్హం ||తరతరాల ||

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ:

గురువంటే దైవమని., చదువంటే వేదమని.
వశిష్ట విశ్వామిత్రులు గురువులు గా,
రామ లక్ష్మణులు నేర్చిన చదువులు తెలుసా
గురి ఉంటే, మట్టి బొమ్మ గురుబ్రహ్మ కాగలదని 2
గురి కన్నా సిరి లేదని చాటిన విధ్యార్ధి, ఏకలవ్యుడి కధనే విన్నారా

ఆ దీక్ష ఆ సాధన మీరు మరచిపోతే,
ఈ దేశపు ప్రజల గతి, మన ప్రగతి చీకటి, చీకటి, చీకటి||తరతరాల ||

తెలుగుల విజ్ఞాన ఘని, కట్టమంచి సందేశం.
తెలుగుల సంస్కార నిధి, కందుకూరి ఆదేశం.
తెలుగు పౌరుషాఘ్ని శిఖ, అల్లూరి ఆదర్శం.
తెలుగులకొక అడుగుజాడ, గురజాడ అమరగీతం,
మరచిపోయినారా..., మనుగడ శూన్యం...,
క్రమశిక్షణ లేని నాడు, అంతా శూన్యం..
భయ భక్తులు లేని నాడు, బ్రతుకే దైన్యం
అందుకే గురువు గా, నా శంఖా రావం, ఈ జాగ్రుతి గీతం.

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ:

చిత్రం: తాండవ కృష్ణుడు (1984), సంగీతం: కె.చక్రవర్తి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: యస్.పి. బాలు

Tandava Krishnudu taratarala Naa Desam anr 1984 balu college lecturer students moral song  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,220; 104 తత్వాలు (Tatvaalu) and views 224,948
Dt : 05-Sep-2022, Upd Dt : 05-Sep-2022, Category : Songs
Views : 494 ( + More Social Media views ), Id : 1507 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tandava , krishnudu , taratarala , desam , anr , balu , college , lecturer , students , moral , song
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content