Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. గురువారం వచ్చింది అంటే మరచిపోతున్న తెలుగు గురువులను స్మరించుకుందాం.
ఏ గురువు కూడా, నన్ను నమ్ము పూజించు అనరు, అనకూడదు.
ఇప్పుడు అందరూ, పరమాత్మ ను వదలి, పరాయి గురువు ల వెంట పడుతున్నారు, వ్యాపార ప్రచారం మాయలో పడి , గురు సందేశం అర్థం చేసుకోలేక.
గురువు, కేవలం పరమాత్మ వైపు , చూపు మరల్చి, దోవ చూపించాలి. అలాంటి ఉత్తమ తెలుగు గురువు, మన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన కాలజ్ఞానం గురించి ఎప్పుడూ అనుకుంటా ఉంటాము. గతంలో మన పెద్దలు పేర్లు పెట్టుకోవడం కూడా ఉంది, వీరబ్రహ్మం, పరబ్రహ్మము అని.
ఆయన తత్వాలు తేట తెలుగు లో, అందరికీ అర్థం అయేట్టు ఉంటాయి. గీతాసారం ఆయన తత్వాలు లో కనిపిస్తుంది.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కర్నూలు జిల్లాలో బనగాన పల్లెలో జన్మించారు. క్రీస్తు శకం 1500-1610 మద్య కాలం. ఆయన తండ్రి పేరు వీర భోజ్యరాయలు, తల్లి పేరు పాపమాంబ. చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం, ఎక్కువ ఆత్మచింతన అలవడింది.
ఆయన తండ్రి మరణానంతరం, స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి, తన 8వ ఏట దేశాటన కొరకు, తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం తో, ఆమె అనుమతిని నిరాకరించగా, ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానభోద చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి, అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, దానిని వదలమని హితవు చెప్పి, అనుమతి తో దేశాటనకు బయలుదేరాడు.
ఆయన తత్వాలు సముద్రం నుంచి, ఓ తత్వం లో నాలుగు మాటలు చూడండి, పాటగా వినండి.
చెప్పలేదంట నకపోయేరు, నా మాట వినక తప్పు దారిని, నడిచిపోయేరు 2
నోరులేని పశువులట్లు తిని తిరిగితె లాభమేమి
పరమార్థం సాధించే, పుణ్యమార్గం తెలుసుకోండి ... ||చెప్పలేదంట ||
బాల్యమందున అజ్ఞానంలో, అల్లరి చిల్లర చేష్టల చేయుచు
వంటబట్టని చదువులతో, మూఢత్వమ్మున మునిగిపోయినా
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమీ అంటుకోదు
యవ్వనమందున కన్ను గానకా.... కామక్రోద మద మాత్సర్యాలతో
వావి వరుసలు లెక్కచేయక, ఆముటెద్దు వలె స్వేచ్చగా తిరిగినా
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమీ అంటుకోదు
కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకి నెట్ట 2
కన్ను కనపడక చెవి వినపడక, వృద్ధాప్యమ్మున వెతలకుండగా...
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమి అంటుకోదు
ఆశ పాశం తెగదోసి అన్య చింతలు వదిలేసి
స్వపర బేదములు హెచ్చుతగ్గులు, కులమతమ్ముల గొడవలు మాని...
బ్రతుక్కు అర్థం తెలియకపోతే... పరమాత్ముని స్మరియింపకపోతే..
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమి అంటుకోదు
ఎందుకురా నీకింత బాధా.. జీవ వినుకోర కడసారి బోధా... 2
రెక్కలను ముక్కలుగాజేసి, రేయింపవల్ ఎన్ని అతుకులు అతికినా
బొక్కడన్నమే కాని అంతకుమించి మిక్కిలేది నీకు...
ఎందుకురా నీకింత బాధా, జీవా వినుకోర కడసారి బోధా,
కఫ వాత పిత్తాలు గతులు తప్పిన నాడు,
మృత్యుదేవత వచ్చి, మెడలు విరిచేనాడు,
ఆలు బిడ్డలు నీకు కారు, అన్న దమ్ములు ఆపలేరు,
ఐశ్వర్య బలము నిన్ను ఆదుకొనుటకు రాదు,
దైవ చింతకు నాడు తావు లేనే లేదు
ఎందుకురా నీకింత బాధా, జీవా వినుకోర కడసారి బోధా,
తలచినా మాత్రాన పాపాలు తుడిచేసి,
వరము లిచ్చేటి ఆ పరమాత్మనే మరచి
ఎంతిచ్చి పోయినా ఇంతేనా అని ఏడ్చు,
నీ వాళ్ళ నమ్ము కుని నిగ్గు తావెందుకు,
ఉసురు కాస్తా పోతే, విసరి నేలకు కొట్టి,
నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగ బోరు,
ఎందుకురా నీకింత బాధ, జీవా వినుకోర కడసారి బోధా,
అలాంటి ఎన్నో తత్వాలు గా మన జీవిత సత్యాలను ఆయన , మనకు అందించారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,588,303; 97 తత్వాలు (Tatvaalu) and views 199,714 Dt : 09-Dec-2020, Upd Dt : 09-Dec-2020, Category : Songs
Views : 1453
( + More Social Media views ), Id : 846 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
telugu ,
guru ,
potuluri veera brahmendra swami ,
philosopher ,
kalagnana ,
tatvalu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments