తల్లిని మించి ధారుణి వేరే, దైవము లేనే లేదు - అభిమానం - ANR, సావిత్రి, కృష్ణ కుమారి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,014; 104 తత్వాలు (Tatvaalu) and views 226,377.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Thallini Minchi Dharuni - Abhimanam - ANR, Savitri, Krishna Kumari

ఎంతమంది తల్లులు ఉన్నారో, కడుపుకు అన్నం తినే మనకు, చక్కగా ఈ పాటలో చెప్పారు. ముందుగా (1) కన్న తల్లికి మించిన వారు, అలాగే దైవం, ఈ భూమిపై ఇంకొకరు లేనే లేరు, చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా అంటున్నారు. నిజమే కదూ?

మరి అనాధాశ్రమాలు, 60 తర్వాత ఒంటరి ముదుసలి బతుకులు దూరముగా పల్లెటూళ్ళో, పట్టణాలలో ఎందుకు వదిలేసాము? మన భోగ భాగ్యాలు, వైద్య సదుపాయాలు, చిన్నప్పుడు మనల్ని బుడి బుడి అడుగులు రోజూ చేయిపట్టి నడిపించే అండ ఇవ్వకుండా? లేదు ఇక్కడ కష్టం మాకే అంటే, మరి భాగస్వామి కి పిల్లలకు కొత్త ప్రాంతం అలవాటు చేసి ఎంత ఖర్చు అయినా భరిస్తున్నావే?

అంటే కపటం నాటకం అబద్దాలు క్రుతఘ్నత దగా మోసం ద్రోహం, మన నర నరానా రక్తం కణాలలో చేరింది అంటే, ముసి ముసి నవ్వుకుంటాము ఈ రోజు. కానీ రేపు మన ముదుసలి తనము అంతకన్నా ఘోరముగా ఉంటుంది అంటే, అసలు ఒప్పుకోము కదూ? పంచభూతాలు వదలవు మిత్రమా, ఎక్కడికి తప్పించుకోలేము.

(2) మరి రెండవ తల్లి ఎవరు? చేరగ వచ్చే, లేగను చూచి, కోరిక తీరగా, కడు తియ్యని పాలు, తాగించి మురిసే గోమాత మా జననీ అంటున్నారు. పోనీ గో మాత నైనా, పూజించి, అలాంటి మనసు ఉన్న వారిని నాయకులు గా ఎన్నుకుంటున్నామా? అబ్బే లేదు, మనకు సరిపోయే పులి, నక్క, పాము, కపట, నటన లక్షణాలు ఉన్న నాయకులనే గెలిపించి, రాష్ట్రాన్ని భూమిని అమ్మిస్తున్న తాకట్టు పెట్టిస్తున్న, సంస్కారం విశ్వసనీయత లేని ఓటర్లం, మన కన్నా ద్రోహులు ఈ భూమిపై ఉన్నారా? పోనీ ముదుసలి ఆవుని/ బర్రెను ఇంట్లో ఉంచుతున్నామా? అదే లేదు, కన్న తల్లి దండ్రులనే వదిలే కసాయి వారము ఏమి చేస్తాము? కసాయి వారికి ముదుసలి గోవును ఇచ్చేస్తాము.

(3) మరి మూడవ తల్లి ఎవరు? తీగెలనిండి, పూచిన మల్లి, పూవుల తావితో, మనందరికి అనురాగము లొలికే, ఆనందమొసగే, ఉండటానికి ఇంత జాగా ఇచ్చిన, భూమాత మా జననీ అంటున్నారు. మరి క్రుతఘ్నత తో ఏమి చేస్తున్నాము? భూములు దోచి, డైనమేట్లు పెట్టి భూమిని తొలచి, చెరువులు నదులు మూసి, పంట పొలాలను కూడా ప్లాట్లు వేసి, అమ్ముకోవడానికి కాంక్రీట్ చేస్తున్నాము. మరి మనకన్నా విశ్వాసఘాతకులు ఉన్నారా?

(4) మరి 4 వ తల్లి ఎవరు? యింటను వెలసి, కంటను మెరిసే, ఈ తులసీ సతీ,
కలకాలము బ్రోచే, కష్టాలు మాపీ, పాలించు మా జననీ అంటున్నారు. అయ్యో మనము ఖాళీ స్థలము లేకుండా మొత్తము రాయి పరచామే మొక్కలకు చోటులేకుండా అద్దెలు వస్తాయి అని, లేదా చిమ్మే బాధ తప్పుతుంది అని ఒళ్ళు పెంచుకోవడానికి అధిక బరువుకు ఉపయోగం అని ఆపార్ట్మెంట్ లో ఉంటామే, ఇంక తులసి మొక్క మన ఇంట్లో ఆరోగ్య రక్షణకు ఉంచుతామా?

ఏ తల్లికి విలువ, క్రుతజ్ఞత, విశ్వసనీయత చూపలేని మనము, కనీసం తెలుగు లో సోషల్ మీడియాలో రాయలేని నిక్రుష్టులం నీచులం చవటలం సన్నాసులం (దయచేసి ఇంకొంచెం సిగ్గు శరం లజ్జ వచ్చే పెద్ద పదాలు మనకు మనమే తిట్టుకుని, మానవత్వం ఉన్న మారదాం, ఇకనైనా కన్నతల్లి భాష లో రాద్దాం) మనం, మన పిల్లలకు సంస్కారం నేర్పుతామా? నీటి మీద రాసి చూడండి, ఎంత సేపు ఉంటుందో? మరి మనకు శిక్షణ పంచభూతాలతో ఖాయం? అనుమానం లేదు కదా?

తల్లిని మించి, ధా.రుణి వేరే, దైవము లేనే లే.దుగా
చల్లని తల్లి, దీవెనలున్న, ఇల్లే స్వర్గముగా.. |తల్లిని|

చేరగ వచ్చే, లేగను చూచి, కోరిక తీరగా ..
దరి, చేరగ వచ్చే, లేగను చూచి, కోరిక తీరగా ..
కడు తియ్యని పాలు, తాగించి మురిసే.., గోమాత మా జననీ.. |తల్లిని|

తీగెలనిండి, పూచిన మల్లి, పూవుల తావితో ..
ఎల, తీగెలనిండి, పూచిన మల్లి, పూవుల తావితో..
అనురాగము లొలికే, ఆనందమొసగే, భూమాత మా జననీ.. |తల్లిని|

ఇంటను వెలసి, కంటను మెరిసే, ఈ తులసీ.. సతీ..
మా, యింటను వెలసి, కంటను మెరిసే, ఈ తులసీ.. సతీ..
కలకాలము బ్రోచే, కష్టాలు మాపీ, పాలించు మా జననీ.. |తల్లిని|

చిత్రం: అభిమానం (1960); రచన: శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ); సంగీతం: ఘంటసాల వెంకటేశ్వర రావు; గానం: కృష్ణవేణి (జిక్కీ)
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,014; 104 తత్వాలు (Tatvaalu) and views 226,377
Dt : 23-Jun-2023, Upd Dt : 23-Jun-2023, Category : Songs
Views : 298 ( + More Social Media views ), Id : 1815 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Thallini , Minchi , Dharuni , Abhimanam , ANR , Savitri , Krishna , Kumari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content