పాటతో పరమార్ధం - తనివి తీరలేదే నా మనసు నిండలేదే (పేరడీ) - గూడుపుఠాణి - కృష్ణ, శుభ, హలం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,889,433; 104 తత్వాలు (Tatvaalu) and views 226,906.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Thanivi theeraledhe (Parody) - Guduputani - Krishna, Shubha, Halam

*4 బస్తాలు బియ్యం, కాయలు, పళ్ళు, కూరలు, 4 ఇళ్ళు, 4 స్తలాలు పొలాలు, 4 కార్లు, 4 సెవర్లు కొంటాం అదీ అప్పు చేసి - మన వరికే మన వారికే ఉండాలి సౌఖ్యం సంతోషం - ఇది గూడుపుఠాణి, స్వార్ధం కాదా? అవసరమా, 6 అడుగుల గొయ్యి కన్నా?* ప్రాపంచిక మోహ స్వార్ధ తీరదా? మనసు త్రుప్తి పడదా? అది మనల్ని దహించదా? ఈ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, ఒకరి కొకరు ద్రోహముతో, భూస్తాపితమేనా? స్టేటస్ లో బొమ్మలు చూస్తున్నారా?

ఇదే కదా మనము ఏళ్ళు మొత్తుకుంటున్నది, ఒక్కరి కైనా ఎక్కిందా? అదే మంటే, మా ఇష్టం, మేము 3 పంటల పొలాలు కాంక్రీట్ చేసి, ప్లాట్ లు అమ్ముతాము, అలాగే మేము కొంటాము అంటున్నారు నిర్లజ్జగా. ఎవరో ఒకరు ఆగితే, 2 వది జరగదు కదా? ఇద్దరూ ఆగరు.

ప్రాపంచిక సుఖాలు కోరికలు ఎలాగైతే త్రుప్తి లేకుండా, ఇంకా పాకులాడుతూ, చివరి వరకు పరుగులు తీస్తూ పతనము చెందుతారో, నిరంతర దైవ నామం తో మానసిక బలహీనత ను పారద్రోలి, మంచి తనం మానవత్వం నింపడానికి ప్రయత్నం చెయ్యాలి.

అలా చేయాలంటే, మనకు ఆధ్యాత్మికము పై ప్రేమ గౌరవం నమ్మకం బాధ్యత ఉండాలి. అప్పుడు మనము కూడా, తనివి తీరలేదే మా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ, ఆధ్యాత్మికం, దైవమా, మా, దైవమా అని ఆర్తి గా పిలుస్తాము. తోటి మనిషితో ప్రేమ పంచుతారు.

మనకు తోటి మనిషి పై ప్రేమ ఉందా? అరే, భాగస్వామి, పిల్లల తోనే, సరిగ్గా ఉండం, ఇతరులతో మాకేమి పని అంటారు? అదే స్వార్ధం, మనల్ని భూస్తాపితం చేయబోతుంది, భవిష్యత్ లో.

చూడండి ఒక వైపు దేవుని సంతానమని దైవాన్ని పూజిస్తూ, ఇతరులను ఏ విధముగా వంచించాలి అని ప్రయత్నము చేస్తున్నాము. ఒక డాక్టరు, లాయరు, ఇంజినీరు, ఏ వ్రుత్తి అయినా, అధికారి, నాయకులు, ఓటరు ఎవరికీ మానవత్వం లేదు, ఎంత ఇస్తావు ఏమి ఇస్తావు, ఎలా దోచుకుందాము.

ధనం చేతిలో ఉంటే, 4 ఇళ్ళు స్థలాలు కొనేస్తారు, ఇక మిగతావారికి భూమి దొరకదు, తక్కువ అద్దెకు ఇల్లు దొరకదు. మేమే తెలివి గల వారం అనుకుంటారు. ఇప్పుడు బియ్యం దొరకదు అని ప్రచారంతో, బస్తాలు మాయం కొన్ని చోట్ల. ఇంకో చోట అధిక ధరలు, మరి తిండి లేక చస్తే, 4 ఇళ్ళు దేనికి? అబ్బే మాకు అది అనవసరం, ఏ విధముగా ఇతర జీవులకు, అప్పు ఎంత చేసైనా ద్రోహం చెయ్యాలి, ఇతరులు మాత్రం మాకు మా కుటుంబానికి పిల్లలకు ద్రోహం చెయ్యకూడదు అంటే ఎలా? నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా? మిత్రమా?

నిన్న ఓ కుటుంబం కు, శని దశ గురించి దశ అంతర్దశ గురించి, మానసిక నియంత్రణ సాధనాలు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం నిర్మూలన లాభాలు జాగ్రత్తలు, భవిష్యత్తు రాబోయే ఏలినాటి శని వరకు, 20 ఏళ్ళు ముందు జాగ్రత్తలు ఉచితముగా వివరించడం జరిగింది. సమయం తేదీ కరెక్ట్ గా రాశి నక్షత్రం తో సరిపోయింది - గంటన్నర దేవుని సంతానం, ఆత్మ బంధువు సేవ. ఇది కదా, త్రికరణ శుద్ది, చిత్త శుద్ది, నరుని సేవ నారాయణ సేవ, దైవ పూజ అంటే, మానసిక పూజ అంటే?

అదే మనము ఎవరినైనా ఎమిటండీ నెల నుంచి పలకలేదు అంటే, అబ్బే మేము మా కుటుంబం స్వయం పతనములో బిజీ బిజీ అండి అంటాము. నష్టం ఎవరికి?

తనివి తీరలేదే.., మా మనసు నిండలేదే.
ఏనాటి బంధమీ, ఆధ్యాత్మికం, - 2 సార్లు మొత్తము
దైవమా.., మా, దైవమా ...

ఎన్నో వసంత వేళలలో, జపముల ఊయల లూగామే 2
ఎన్నో పున్నమి రాత్రులలో, ధ్యాన జలకాలాడేమే
అందని లోకాల.., చెంతకే చేరిననూ.. 2
విరిసిన ఆధ్యాత్మిక.., లోతులే చూసిననూ.. ||తనివి తీరలేదే||

ఎప్పుడు దైవం మాతో ఉంటే, ఎన్ని వసంతాలై తేనేమి 2
కన్నుల దైవం కనబడుతుంటే, ఎన్ని పున్నమలు వస్తేనేమి
మచ్చలేని మదిలో.., హాయిగా జపించిననూ.. 2
తీయని హృదయంలో.., మానవత కురిపించిననూ.. ||తనివి తీరలేదే||

చిత్రం : గూడుపుఠాణి (1972); సంగీతం : కోదండపాణి; సాహిత్యం : దాశరథి; గానం : బాలు, సుశీల; కృష్ణ, శుభ, హలం

Thanivi theeraledhe, S.P.Balu, Susheela, Guduputani(1972), Dhasharadhi, Krishna, Shubha, Halam  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,889,433; 104 తత్వాలు (Tatvaalu) and views 226,906
Dt : 21-Jul-2023, Upd Dt : 21-Jul-2023, Category : Songs
Views : 246 ( + More Social Media views ), Id : 1846 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Thanivi theeraledhe , tanivi tiralede , Parody , Guduputani , Krishna , Shubha , Halam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content