దేవాలయ కమిటీ ల జోలికి వెళ్ళాలి, అంటే నే దడ. వీటిని ఎవరు, ఎప్పుడు ప్రక్షాళన చేస్తారో - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,126,215; 104 తత్వాలు (Tatvaalu) and views 239,346.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏ దేవాలయ ధర్మ కర్తలు, ఛైర్మన్ పదవులు అంటే ఏదో, ఒక రాజకీయ పదవి వచ్చిన విధంగా, చాలా మంది గంతులు వేసుకుంటూ ఆనందముగా వెళతారు. దాని వెనక మనకు వచ్చే పాపం తెలిస్తే అర్ధము అయితే, మామూలు వ్యక్తులు దాని జోలికి పోరు. ఆ పదవి ఇచ్చే వారు, తీసుకునే వారు కూడా, చాలా నిబద్ధతతో ఉండాలి, సరైన హైందవ ధర్మం కాపాడుటకు ప్రాణాలు ఇచ్చే వారికే ఇవ్వాలి.

మొన్న ఆర్టికల్ లో, రాజకీయ వ్యవస్థ మరియు అనుచరులు వలన, తప్పులు కు వచ్చే పాపాలు అన్ని, ఆయా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి ఖాతాలో, వడ్డీ తో సహా జమ అవుతాయి, తర్వాత తమ తరాలకు ఎదుగుదల కు అడ్డు అవుతాయి, అని అనుకున్నాం కదా. అంతే వేగంగా, పాపాలు మూట గట్టు కునే అవకాశం, దేవాలయ వ్యవస్థ లో ఉంది.

ఒక దేవాలయం వారు ధర్మకర్త గా అడిగితే, దండం పెట్టి వద్దు బాబోయ్, అనే పరిస్థితి ఉంది. ఆ లెక్కలు తేలవు, అర్థం కావు, దేనికి ఖర్చు పెడతారో తెలీదు, వచ్చిన నగలు విరాళాలు ఏమోతాయో, ఎవరి దగ్గర ఉంటాయో, ఎంత భద్రత ఉంటుందో, ఎక్కడ తాకట్టు పెట్టారో తెలీదు. మరలా గ్రూపులు, ముఠాలు, రాజకీయాలు, అదో అర్థం కాని పేద్ద సాలె గూడు.

ఇక్కడ డబ్బులు, అక్కడ ఖర్చు పెట్టమంటారు. ఆ పొలం, ఆ స్ధలం ఎవరు వాడుతున్నారో తెలీదు. మనకు చెప్పరు, మన మాట వినరు. పలుకుబడి ఒత్తిళ్లు. వారి వీరి అనుచరులు వీరంగం, భక్తులు శాపనార్థాలు.

వామ్మో, నేటి దేవాలయ కమిటీ ల జోలికి వెళ్ళాలి, అంటే నే దడ. వీటిని ఎవరు, ఎప్పుడు ప్రక్షాళన చేస్తారో, దోవలో పెడతారో తెలీదు. దేవుని కి, ఆయన ఆస్తులు సంపదలు కే, భద్రత లేకుండా పోతుంది, ఏ ప్రభుత్వం ఉన్నా వాటి తీరు అంతే. ఇతర మతస్థులకు కూడా ఆశ్రయం ఇస్తారు.

ప్రతి ప్రభుత్వము, రాజకీయ వత్తిడి ల తో, ధర్మ కర్తలను నియమిస్తున్నారు. వారు ఏమి హైందవ సేవ చేశారు, ఏమి చరిత్ర ఉంది, కనీసం నోటితో 4 శ్లోకాలు చదవగలరా, ఏ హైందవ కార్యక్రమంలో పాల్గొన్నారు అని, ఏదీ గత చరిత్ర చూడరు. మన వాడైతే చాలు, పెట్టేయండి. రాజకీయ వాసన ఉన్న వారిని మరియు వారి అనుచరులను, అసలు దూరంగా పెట్టాలి కదా.

అందుకే అంటారు, హైందవ మతాన్ని ధర్మాన్ని వ్యవస్థ ని, నాశనం చేసే ప్రయత్నం లో, ముందడుగు, మనలోని తప్పుడు మనసులదే సుమా, బయట వారి కన్నా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,126,215; 104 తత్వాలు (Tatvaalu) and views 239,346
Dt : 17-Dec-2020, Upd Dt : 17-Dec-2020, Category : General
Views : 1082 ( + More Social Media views ), Id : 867 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : temple committees , good work , clean hindu non-political , members
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content