ఆలోచన చెయ్యండి, ధనం వాడినా ప్రకటన కు, ఏది మనకు ఎక్కువ ఉపయోగం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,827; 104 తత్వాలు (Tatvaalu) and views 225,935.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అలిగిన కాలం ఆగిన మగ్గం ఆర్టికల్ ఎంతో మందికి చేరుతుంది, సోషల్ మీడియా ద్వారా. మన రచయిత మిత్రుడు కూడా, ఇప్పుడు ఎంతో మందికి తెలుస్తారు, రాష్ట్రం మొత్తం మరియు విదేశాల్లో ఉన్న తెలుగు వారికి కూడా. ఉభయ లాభం , సమస్య ను లేదా మీ తెలుగు అనుభవం పట్టు ను వెలుగులో కి తేవడం. మనకు పేరు రాకపోయినా, సమస్య కు పేరు వచ్చిన చాలు కదా.

చేతన్నల సమస్య ఒకవైపు, మోడీ జగన్ గారి చిత్రం ఇంకోవైపు అందరినీ ఆకర్షిస్తుంది. మీరు మంచి హృదయం తో 2 అడుగు లు వేస్తే, మేమూ 3 అడుగు లు వేస్తాం. మీరు రాసిన మాటలను సానబట్టి, మీరు ఇచ్చిన మామూలు ఫోటో కు వన్నె తెచ్చి, వెలుగు లో కి తెద్దాం. సమస్య పరిష్కారం కాకపోయినా కూడా, కనీసం వెలుగులో కి వచ్చి మొదటి మెట్టు పడుతుంది.

మీకూ తెలుసు, ఒక ప్రకటన కూడా లేదు ఏ మన వెబ్సైట్ లో కూడా, ఆదాయం కూడా లేదు రాదు ఏళ్లుగా. కేవలం సంఘ సేవ. ఎవరినీ విపరీతంగా పొగడటం లేదా తిడితూ కూడా లేదు. మంచి మాట, మంచి బాట అంతే.

లాక్ డౌన్ లో , మీ ఇంట్లో , ఊళ్ళో, ఆఫీసు లో జరిగే చిత్రాలను మార్పులు ను, బాధలను కూడా రాయవచ్చు. ఏ విషయం మీదైనా రాయవచ్చు. అయితే, మాకు తెలుగు ను దిద్దే సమయం తగ్గిస్తే, అంటే తప్పులు లేకుండా, సూటిగా క్లుప్తంగా అర్థ వంతంగా రాయగలిగితే, సంతోషం. లోకం తీరు లో ఉన్న మిగతావి చదివితే, మీకు కూడా కొత్త ఆలోచన రావచ్చు వస్తుంది.

ఉచిత సంఘసేవ అని, వెబ్సైట్ తక్కువ అనుకోకండి, ఫేస్బుక్ లో కి వెళ్లి, చూడండి, ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్నిటిలో 11 వేల మంది పైగా, స్వచ్ఛంద నిజమైన ఫాలోవర్స్ ఉన్నారు. గొప్ప కు ధనం ఖర్చు పెడితే, ఆ సంఖ్య లక్షకు చేర్చవచ్చు, కానీ అది మనకు వద్దు. మీకు, మీ ఊరి సమస్య కు ఉపయోగపడితే చాలు.


11 వేల మంది ఉండి, వారు లైక్ కొట్టినా షేర్ చేసినా, గొలుసు కట్టు లాగా, వాళ్ళ స్నేహితులు అందరికీ వెళుతుంది. వాట్సప్, ట్విట్టర్ ఇంకో వైపు గొలుసు కట్టు. అంటే వెబ్సైట్ కాకుండా, మరిన్ని దోవలు గూగుల్ సెర్చుకు ఉన్నాయి.

ఎవరూ చూడకపోయినా చదవకపోయినా, గూగుల్ సెర్చ్ లో, మనకు తెలియని వారికి కూడా అది దొరుకుతుంది. అంటే ఎంతమంది కి చేరుతుందో మనమూ లెక్క వేయలేము. మాకు లోపల గూగుల్ ఎనలటిక్స్ లో, ఆ అంకె తెలుస్తుంది.

అందుకే నాయకులు, అధికారులు కూడా తమ సోషల్ మీడియాలో, ఎప్పుడూ అప్డేట్ చేస్తుంటారు. అందుకే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి. తిట్టినా కూడా, అది తిట్టా పొగడ్త, ఎవరిని ఎందుకు తిట్టామో, అర్థం కాకుండా ఉండాలి.

చూడండి ఉదాహరణ, పేపర్ కు ఆన్లైన్ కు తేడాలు. ఈ రోజు కృష్ణా అనే అతను 100 మందికి 1000 పంచారు అని ఫోటో తో, న్యూస్ పేపర్లో పడింది. లాక్ డౌన్ లేదా మామూలు అప్పుడు, జిల్లా ఎడిషన్ ఎంత మంది చూస్తారు? ఆ రోజు తర్వాత, ఆ పేపరు మాయం లేదా పాత పేపరుల లో వెతకాలి? ఆన్లైన్ పేపర్ పీడీఎఫ్ ఎంతవరకు సెర్చ్ లో వస్తుంది తెలీదు. ఇప్పుడు లాగిన్ కూడా పెట్టారు. ఎంతో ధనం ప్రకటనలు రూపం లో వస్తుంది కదా వారికి, అలా ఎందుకో మరి.

అదే ఆన్లైన్ లో మనం లేదా ఇంకొకరు ప్రచురించినది, వాళ్ళ చుట్టాలు స్నేహితులు, ఏ దేశంలో ఎప్పుడు అయినా, అంటే ఇంకో 3 నెలల తర్వాత ఆ పైన కూడా, గూగుల్ సెర్చ్ లో కనుగొనవచ్చు. తేలికగా, ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది కదా, ధనం ఇచ్చి వేయించినా?

ఆలోచన చెయ్యండి, ధనం వాడినా ప్రకటన కు, ఏది మనకు ఎక్కువ ఉపయోగం?

ఆర్టికల్ రాసే వారు లేదా ఫోటో వీడియో జర్నలిస్టులు ఫీల్డ్ లో తిరిగేటప్పుడు, ఆరోగ్యం జాగ్రత్తలు అవసరము. ఆరొగ్యముగా తిరిగినంత వరకే మనల్ని ఉపయోగిస్తారు, లేదంటే ఎవరూ పట్టించుకోరు సుమా.

మనకు ఆర్టికల్ రాసే వారి పేరు, ఊరు, వృత్తి, వారికి ఇష్టం అయితే, వారి ఫోటో కూడా పెడుతున్నాం. వారిని గౌరవించాలి, వారూ పదిమంది కి తెలియాలి. వారు ఎదిగి, మంచి ఆఫర్లు అందుకోవాలి తర్వాత పనుల్లో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,827; 104 తత్వాలు (Tatvaalu) and views 225,935
Dt : 21-Apr-2020, Upd Dt : 21-Apr-2020, Category : General
Views : 857 ( + More Social Media views ), Id : 513 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : paid ads article online and print paper , encourage new people to write articles , village town city issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content