అమ్మ నాన్న గురించి పట్టించుకోని వారు, ఇతరుల బాగు క్షేమం కోరగలరా? ఎవరిని నమ్మాలి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,556; 104 తత్వాలు (Tatvaalu) and views 224,687.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

*తమ అమ్మ నాన్న గురించి పట్టించుకోని వారు, ఇతరుల అమ్మ నాన్న బాగు అడగగలరా, ఇతరుల క్షేమం కోరగలరా? ఎవరిని నమ్మాలి?*

మా మాటలు చూసి, మేము మంచివారు అని పొరపాటున కూడా భావించవద్దు, నమ్మవద్దు, లోకములో ఎవరినైనా అంతే అంటున్నారు ఇప్పుడు.

తమ అమ్మ నాన్న గురించి పట్టించుకోని వారు, ఇతరుల అమ్మ నాన్న బాగు అడగ గలరా? ఇతరుల క్షేమం కోరగలరా, మనస్పూర్తిగా?

అలాగే మీ సమాచారం సంవత్సరముగా లేనిదే, మేమూ నమ్మకూడదు కదా? మనం ఎన్నుకున్న నాయకులను చూడండి, మన మంచి బుద్ది తో.

* ధర్మ కర్త గా ఉండవయ్యా బాబు అని, చంద్రన్న కు అధికారం ఇస్తేనే, ఈ వయస్సులో కూడా వ్యామోహములో, తన పేరు లేనిదే, జనానికి ఊళ్ళోళ్ళ పన్నులు డబ్బులు పందారము చేయను అని, చంద్రన్న పసుపు కుంకుమ లాంటి 50 పేర్ల పధకాలు.

పోనీ అన్ని పేర్లు పెట్టుకుని, తెదేపా వారినైనా, కరోనా చికిత్స ధైర్యంగా ఆంధ్రాలో చేపించుకునే ఒక్క ఆసుపత్రి ఇచ్చారా? లేదు, లోకెష్ వచ్చి కడతారు అంటున్నారు భవిష్యత్ తరాల కోసం అంటున్నారు. రాష్ట్రానికి అప్పులు, హెరిటేజ్ కి లాభాలు.

* బుగ్గలు నిమిరాడు కోట్ల ధనం ఉంది నిస్వార్ధమేమొ అని రాజన్న లక్షణాలు అని జగనన్నకు ఇస్తే, నేనూ తక్కువేమి కాదు చంద్రన్న కన్నా వ్యామోహం లో, అని జగనన్న దీవెన లాంటి 50 పేర్ల పధకాలు. రాజన్న సోనియమ్మ జపం చేస్తే, జగనన్న తన జపమే తాను చేసుకుంటున్నారు పధకాల పేర్ల తో. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు కూడా, హలో హాస్పటల్ చలో హైదరాబాద్ అంటున్నారు.

భారతి సిమెంట్ సాక్షి అమిత లాభాలు, రాష్ట్రానికి కుప్పల కుప్పల అప్పులు, ఇక దొరకనంత, చీ చీ ఇవ్వము అనే అంత. షుమారు 20 జిల్లాలు, 20 విమానాశ్రయాలు, 20 మెడికల్ కాలేజీలు, 20 పోర్టులు, 20 హార్బర్లు, . . .మనకు లేనివి అన్ని ప్రకటించారు, డబ్బులు ఎక్కడివి అని మాత్రం అడగొద్దు, బహుశా తర్వాత జగనన్న నోటి నోటికీ భోజన మెతుకు పధకం కూడా వస్తుంది, ఇక వండుకోవక్కర లేదు.

* దేశం, మనల్ని ఉత్తమ ఓటరు గా నమ్మి, ఓటు హక్కు ఇస్తే, అందరి దగ్గరా చేయి చాచి, ఇంత తీసుకుని లేదా అవకాశం అవసరం కు బానిసలమై, ఇలాంటి మన సర్వ ఉత్తమ లక్షణాలు ఉన్న వారి చేతిలో ఓటేసి తాళాలు పెట్టి, ఓటీటీ లో సినిమాలు ఈటీవీ లో సీరియల్ తో, తిండి మంచం టీవీ టీకా పధకాలతో, మనం మరియు మన పిల్లలు బిజీ.

నిద్ర లేస్తే చాలు, దేశం నాశనం అవుతుంది, దొంగ కు బుద్ది లేదా ఇనప్పెట్టె తాళాలు ఎందుకు తీయాలి అంటాము, ఆ తాళాం ఇచ్చింది మనమే మన మూర్ఖత్వమే ఓటుతో అని మరచి, అది మన విజ్ఞానం.

కాబట్టి, ఎవరం ఎవరినీ నమ్మకూడదు కదా? అందుకే సర్వం కరోనా మయం, జై కరోనా గురూ, మా భారం నీదే, అలాగే భూ పాప భారం తగ్గించే బాధ్యతా నీదే అంటున్నాము.

గురువులైన మీ పాదాలకు నమస్కరించి, వినమ్రపూర్వకముగా అందరి ఎదురు చెపుతున్నా, మీ కన్నా 100 శాతం పాపిని. ఇది అక్షర సత్యం, 8 ఏళ్ళు పై గా వింటున్నారు చూస్తున్నారు కదా మా మాటలు.

మనుషుల చట్టాల నుంచి తప్పించుకున్నా కూడా, పంచభూతాల నుంచి మన పాపాలు తప్పించుకోలేవు. కాలచక్రం లో, లంచం మంచం మాయ హోదా అధికారం పని చేయదు, శిక్ష తప్పదు, ఎంతటి రారాజు దేశాధినేత కైనా, నేడు కూడా, వీర బ్రమ్మం రాఘవేంద్ర వేమన, సాక్షిగా చెపుతున్నా.

కాబట్టే శనివార 123 వారాల 108 ప్రదక్షిణలు ఆనందముగా మనస్పుర్తిగా, వయసు శారీరక కష్టం గా ఇబ్బంది బాధగా ఉన్నా, ఎందుకంటే కాల శిక్ష కన్నా, ఈ శ్రమ చాలా తక్కువ.

ఈ వారము లో, కనీసం 10 పైగా పురుగులను/ బొద్దింకలు/ దోమలను చంపాము చంపించాము, కుడతున్నాయి కుడతాయేమో అని, అమ్మకు ఇబ్బంది కాకూడదు అని. యజమానులతో చెపితే మందు పెట్టారు ఇంకా ఏదొ స్ప్రే అంటా.

నోటి శాఖాహారముతో, ఎన్నో మొక్కల కాడలు కొమ్మలు తెంపాము. పూజకు, పూలు కొమ్మలు నిర్దాక్షిణ్యం గా తెంపాము. దానికి కారణ భూతుడను అయ్యాము. సాక్ష్యం ఇస్తున్నాము, హింస చేసాము, ఇంకో మార్గం లేక. నడుస్తుంటే, కాలి కింద ఎన్ని జీవాలు బలి అయ్యాయో కదా?

అవి నోరులేని జీవాలు కాబట్టి, అర్జీలు కేసులు పెట్టవు తిట్టవు తన్నవు, వాటికి పోలీసులు కోర్టులు దొంగ సాక్షాలు అబద్దాలు మోసాలు మంత్రులు నాయకులు ఓటర్లు ధనము లంచాలు లేవు కాబట్టి, తప్పించుకున్నాము. అదే వాటికి చట్టాలు ఉంటే, మనము తప్పుకో గలనా? మరి పాప పరిహారం?

మందులు వేసుకోమని, నడవమని, ఆయుర్వేదం తినమని, ఆరోగ్యం గా ఉండమని, అమ్మను కూడా ఇబ్బంది పెట్టాము.

శని వారము అరిషడ్వర్గాలను జయించే 13 పైగా పనులు చూసారు గదా, ఈ రోజుల్లో ఎంత పాపం చేస్తే, ఎంత పాపాత్ముడైతే, ఎంత సోమరి, ఎంత అవిశ్వాసి కుసంస్కారి, ఎంత క్రుతగ్నుడు అయితే, అలాంటి పిచ్చి ఉపయోగం లేని పనులు ప్రయోగాలు చేస్తారు.

రేపు ఉంటామో లేదో తెలియని, ముదుసలి తల్లికి దగ్గర ఉంచి 8 ఏళ్ళు ఉత్తమ వైద్యం ఎంతో ఖర్చుతో, సొంత ఆయుర్వేదం లాంటివి ఎందుకు?

అవి మంచి పనులు అయితే, మీరు మీ పిల్లలు, ఎందుకు మీ పెద్దలను దగ్గర ఉంచి చేయరు? ఎందుకంటే మీరు జ్ఞాన వంతులు గురువులు, కాబట్టి ఆ పిచ్చి పనులు అవసరము లేదు.

మీ తల్లి దండ్రులకు చేస్తున్న సేవలు, గర్వము గా చెపుతారు కదూ? పదిమందికి ఉత్సాహాన్ని ఇవ్వడానికి? అనాధ ఆశ్రమాలు, ఒంటరి బతుకులు, తగ్గించడానికి? లేకపోతే,

మన ఆస్తులు ఐశ్వర్యం పాడుచేయడానికి, వాటితోనే మనకు జ్ఞానం కలగచేయడానికి చేయడానికి తగిన మంచివారిని, ఆల్రేడీ మన ఇంట్లో లేదా మన చుట్టుపక్కల లేదా మన అనుచరుల్లో ఒకరిని సిద్దం చేసే ఉంటాం. కాబట్టి వారి చేతిలో స్థానికముగా తేలికగా మన విధానములోనే, తగిన బోధ జ్ఞానం కలగడం, ఉత్తమం.

ప్రతి ఇంట్లో ఒక గురువు ఉంటారు బుద్ది చెప్పడానికి, ఈ రోజుల్లో పిల్లలే మన గురువులు, మన అజ్ఞానాన్ని వ్యామోహం ను దుమ్ము దులుపుతారు. పాత రోజుల్లో గురువు వెతుక్కుని రావాలి, ఇప్పుడు మనమే ఇంట్లో కంటున్నాము.

కాబట్టి ఎవరినీ నమ్మలేని కుటుంబాన్ని, సమాజాన్ని, మనమే పెంచి పోషించాము, దానికే సమిధలు అవుతున్నాము. తప్పు మనది కాదా? దీనికీ దేవుడే బాధ్యుడా? మన చేతగాని తనాన్ని, ఆయన మీద నెట్టి, ఇంకా పతనం అవుదామా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,556; 104 తత్వాలు (Tatvaalu) and views 224,687
Dt : 20-Feb-2022, Upd Dt : 20-Feb-2022, Category : General
Views : 715 ( + More Social Media views ), Id : 1305 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : old , -parents , welfare , trust , babu , jagan , voter
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content