ఏలూరులో అంతు చిక్కని వ్యాధి, ముందే గుర్తుచేసినా, జాగ్రత్తలు లేని అధికారుల నాయకుల నిర్లక్ష్యము - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,062,296; 104 తత్వాలు (Tatvaalu) and views 236,232.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో అంతు చిక్కని వ్యాధి. ఏలూరు లో కొందరు ప్రజలు, వ్యాధికి గురై తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. పట్టణంలో నీటి శుద్ది, పారిశుద్ధ్య లోపం వలనే, ఈ వ్యాధి ప్రబలుతోంది అని, కొందరి నమ్మకం. ప్రతి పక్ష నారా లోకెష్, సీయెం జగన్ గార్లు బాధితులను పరామర్శించారు.

ఏలురు మునిసిపాలిటీ తో పాటుగా, అన్ని జిల్లా ల, నిర్లక్ష్యపు మున్సిపాలిటీస్ లిస్ట్ గతములో అందరికీ పంపాము గుర్తు ఉందా? పని చేసే అధికారులు, హుందాగా గర్వముగా సంతోషముగా, రోజూ సోషల్ మీడియా అప్డేట్ చేస్తారు. అదే, పని చేయని అధికారులు, ఏమని ప్రజలకు ఫోటోలు పెడతారు రోజూ? పెట్టలేరు కదా? అర్ధము అయ్యిందా, ఎందుకు సోషల్ మీడియా పేజీల, సమాచారం అడుగుతున్నామో?

ఈ సంవత్సరం, మే నెలలో అలాగే అక్టోబర్లో, మనము ఆంధ్రాలో ఉన్న, ఉత్తమ మరియు పనిచేయని సోషల్ మీడియా మున్సిపాలిటీస్ లిస్ట్ పంపాము, లింక్ లో చూడండి. Link. సోషల్ మీడియాలో, సరిగ్గా రోజూ చేసిన పనులు పెట్టడం లేదు అంటే, అక్కడ జనాల ప్రాణాలకు విలువ లేదు అని, అధికారులు హాయిగా జీతము తీసుకుంటూ, రెస్ట్ తీసుకుంటున్నారు అని అర్ధము.

రాష్ట్ర మరియు జిల్లా అధికారులకు మరియు ఆ శాఖా మంత్రి, బొత్స గారికి కూడా, ఈ సమాచారం పంపాము. అప్పుడే వాళ్ళని, నిద్ర లేపి ఉంటే, ఈ రోజు ఈ పరిస్తితి, ఏలూరులో ఇలా ఉండేదా?

ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా, జవాబు లేదు. పరిస్థితిని సరి చేయడము, మార్పు లేదు. నేటి పాలనలో, అధికారులు, మన జగనన్న ను మభ్యపెడుతూ మాయ చేస్తూ, అన్నింటిలో నూ నిర్లక్ష్యమే, జనాల ప్రాణాలకు విలువ లేదు అని, కరోనా సమయములో నే చూసాము. ఆసుపత్రి లో అన్ని సదుపాయాలు ఉన్నాయి అంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం, హైదరాబాదు వెళ్ళడం మనము చూసాము.

ప్రజలకు వినపడని కనపడని, ప్రజా సేవలో నిరంతరము, మునిగి తేలుతున్న, ఆ అధికారులకు కానీ మంత్రులకు గానీ, ఆ మున్సిపాలిటీస్ గురించి పట్టించుకోవడం అంటే కష్టం. సోషల్ మీడియాలో అంటే ఆ నగరంలో, పనులు సరిగా చేయకుండా నిర్లక్ష్యం గా ఉన్న, మున్సిపల్ కార్పొరేషన్ నగరాలను లిస్ట్ చూద్దాము -

శ్రీకాకుళం, చిత్తూర్, ఒంగోలు, నెల్లూర్, ఏలూరు, కడప, అలాగే రాష్ట్ర మున్సిపల్ శాఖ

ఇందులో ప్రజలను లెక్క చేయ కుండా, సోషల్ సమాచారం కూడా ఇవ్వని, జిల్లా కలెక్టర్ల లిస్ట్ తో పోల్చుకోండి. కలేక్టరే నిర్లక్ష్యముగా ఉంటే, మిగతా వారు ఎలా ఉంటారు?

* విశాఖ కలెక్టర్ అప్పుడప్పుడు మాత్రమే సమాచారం - విజయ్ సాయి గారు పట్టించుకోవాలి.
* గుంటూర్ వారు, మే 2020 నుంచి ఆపేసారు - ఉపసభాపతి కోన గారు మీరు అడగాలి.
* ఇక 2019 నుంచి ముందుకు కదలని 7 జిల్లాలు (3 సబ్ కలెక్టర్లు) - ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూర్, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూల్ వారు - ఈ జిల్లా మంత్రులు నాయకులు అధికారులు ఏమి చేస్తున్నారో, జగన్ గారిని ఎందుకు మోసం చేస్తున్నారో, ఆ దేవుడికే తెలియాలి.

ఇక మా ప్రకాశం జిల్లా లో మున్సిపాలిటీస్ చెప్పక్కరలేదు. 2019 తర్వాత, ఎవరూ, సోషల్ సమాచారం పంచుకోలేదు, అంటే ప్రజలను పట్టించుకోలేదు. వారిని, అడిగే నాధుడు లేరు. మా లాంటి విలేఖరులను, లెక్క చేయరు గదా. మీ జిల్లాలో, మీ మున్సిపాలిటీ పరిస్తితి కూడా ఒక్క సారి చూసుకోండి, ప్రజలారా? రేపు మన పంచాయితీ మున్సిపాలిటి లో నీళ్ళ టాంక్ కూడా, కడగక, పాచి పట్టి, ఇలాంటి పరిస్తితి వస్తుందేమో? అధికారులు, మా రక్షణ చూడండి దయచేసి, అని బావురు మంటున్న ప్రజలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,062,296; 104 తత్వాలు (Tatvaalu) and views 236,232
Dt : 07-Dec-2020, Upd Dt : 07-Dec-2020, Category : Request
Views : 730 ( + More Social Media views ), Id : 839 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : unknown disease , eluru , mentioned earlier , negligence , careless , officers , leaders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content