Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Venu madhava e shwasalo - Nenunnanu - Nagarjuna, Shriya, Aarthi
6 నెలలు కలసి తిరిగితే వాడు వీడు అవుతారు అంటారు. అలాగే మనము దేనితో ఉన్నాము అనే దానిని బట్టి, మన దైవిక విలువ పెరుగుతుంది. సుగంధమా, బురదా? ప్రాపంచిక మాయనా, ఆధ్యాత్మిక మనశ్శాంతినా? మన ఇష్టం. ఎవరి మనకు నేర్పుతారు? ఎవరి మాట, మనకు, మన మనసుకి గురి? మనకే సొంతగా ఆ శక్తి ఉందా, ఎప్పుడు సాధన చేయగలం? రాత, మాట, పాట, చేతలలో, సజీవ గురువు సేవలో?
ఒక రాయి గా రోడ్ మీద ఉంటే, ఎవరు పట్టించుకోరు. అదే రాయి బొమ్మ గా ఇంట్లో ఉంటే, దానికి ఖరీదు విలువ. అదే రాయి గుడి లో ఉంటే, భక్తి భావము, పూజలు. మరి రాయి ఒకటే కదా? సాధన? ఉలి దెబ్బలకు, కష్టాలు కన్నీళ్ళకు నిలబడే స్తిర ధైర్యం, అంతేనా?
అందుకే స్తిర మాట మనసు ఉండాలి - కొన్ని నియమాలు పెట్టుకోండి, అవి శనివారం లిస్ట్ లో ఉన్నాయి. క్రమం తప్పకుండా, వాటిని పాటిస్తూ, మీ బంధువులకు స్నేహితులకు తెలియ చేయండి. ఉదాహరణకు రోజు పూజ ఉదయం 5 కు చేస్తున్నారు, అదే ఫోటో రోజూ 6 కు పంపండి. అది ఇతరుల కోసం కాదు, మీ స్తిర పనులు కోసం. అయ్యో నేను మాట తప్పితే, అందరికీ తెలుస్తింది అన్ని చిన్న భయముతో అయినా, మనము రోజూ అదే పని చేయాలి మనస్పూర్తిగా. తినగ తినగ వేము, తియ్యగా ఉండు?
ఇంట్లో, వ్యాపారములో, ఆఫీస్ లో, భాగస్వామి తో, పిల్లలు తో, ముదుసలి తల్లి దండ్రులతో, ఇలా జీవితములో ప్రతి దాని దగ్గర సాధన లేనిదే, మనము పనికి రాము. సంపదలు రావడం పోవడం వేరు, మానసిక బలం ఉండటం వేరు.
మరి మనందరమూ గాలి పీలుస్తున్నాము. మాటలు మాట్లాడేటప్పుడు కూడా, గాలి అటు ఇటు జరుగుతుంటేనే, స్వర పేటిక నుంచి నాదాలు పలుకులు, వచ్చేది. మరి అదే గాలిని ఎప్పుడు వదలాలో, ఎంత వదలాలో, ఎంత శ్వాస తీయాలో, తెలిస్తే, సాధన చేస్తే, అదే పాట పద్యం, వారే గాయకులు. మరి మనకు, అదే గాత్ర నైవేద్యం దేవునికి, మనశ్శాంతికి, అదో భాగం ఆధ్యాత్మిక సాధనలో - వాక్సుద్ది కి.
వేణు మాధవా, ఏ శ్వాసలో చేరితే, గాలి గాంధర్వమౌతున్నదో. ఏ మోవిపై వాలితే, మౌనమే మంత్రమౌతున్నదో? ఆ శ్వాసలో నే లీనమై, ఆ మోవిపై నే మౌనమై, నిను చేరనీ, మాధవా అంటూ భక్తి భావముతో మనస్పూర్తిగా పాడుదామా, పిల్లలచే మనకన్నా బాగా పాడిద్దామా? కోట్లు ఉన్నా కొనలేని, మనశ్శాంతిని మానసిక బలాన్ని వారికి ఇద్దామా?
మురళి ఎంత పుణ్యం చేసింది, మాధవుని చేరడానికి? మునులు లాగా జపాలు చేసిందా? తన తనువున తొలచిన గాయములే/ కంతలే, తన జన్మకు, వరములు ఇచ్చింది, ఆ పరమాత్మను చేరింది. అష్టాక్షరిని కూడా పలకరిస్తుంది. వెదురు ముక్క పొందిన భాగ్యాన్ని, మనము సాధనతో జీవితములో పొందలేమా? ఎన్ని జన్మలు కావాలి, ఈ అరిషడ్వర్గ అష్టవ్యసన బారి నుంచి బయటపడటానికి?
వేణు మాధవా ఆ....2
ఏ శ్వాసలో చే.రితే., గా.లి గాంధర్వమౌతున్నదో..2
ఏ మోవిపై వా..లితే., మౌనమే మంత్రమౌతున్నదో..
ఆ శ్వాసలో... నే లీనమై...
ఆ మోవిపై.... నే. మౌనమై...
నిను చేరనీ, మాధవా.. ఆ ఆ ఆ...
ఏ శ్వాసలో చే.రితే., గా.లి గాంధర్వమౌతున్నదో...
మునులకు తెలియని, జపములు జరిపినదా.. మురళీ.. సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
తనువును నిలువున, తొలిచిన గాయములే.. తన జన్మకీ..
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా. నిన్ను చే.రింది..అష్టాక్షరిగ మా.రింది
ఎలా ఇంత పె.న్నిధి, వెదురు తా.ను పొం.దింది
వేణుమాధవా నీ. సన్నిధీ......
ఏ శ్వాసలో చే.రితే., గా.లి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వా..లితే., మౌనమే మంత్రమౌతున్నదో..
చల్లని నీ చిరునవ్వులు కనపడక, కనుపా.పకీ..
నలువైపుల నడిరాతిరి ఎదురవదా...
అల్లన నీ అడుగుల సడి వినబడక, హృదయానికీ..
అలజడితో అణువణువూ తడబడదా...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...........
నువ్వే. నడుపు పా.దమిది...
నువ్వే. మీటు నా.దమిది..
నివాళిగా నా.. మది..
నివేదించు నిమిషమిది...
వేణుమాధవా నీ.. సన్నిధీ....
గగరిగరిసరి గగరిరి సరి
గపదసాస దపగరిసరి..
గగదపదా గపదసదా దాపాగరిగా..
దపదసస దపదసస
దపదరిరి దపదరిరి
దసరిగరిసరి
గరిసరి గ రి గరిసరిగా...
రి స ద ప గగ పాప
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప గ రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా
రి గ ప ద రి గా.....
రాధికా హృదయ రాగాంజలీ....
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ...
ఈ గీతాంజలి....
Nenunnanu · Lyricist : Sirivennela Seetharama Sastry · Female Singer : K. S. Chithra · Music : M. M. Keeravani · Director : V. N. Aditya.; Star - Nagarjuna, Shriya, Aarthi; Movie - Ye Shwasalo (2004)
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,523; 104 తత్వాలు (Tatvaalu) and views 256,985 Dt : 09-Jun-2023, Upd Dt : 09-Jun-2023, Category : Songs
Views : 796
( + More Social Media views ), Id : 1783 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Venu madhava ,
shwasalo ,
Nenunnanu ,
Nagarjuna ,
Shriya ,
Aarthi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments