పాటతో పరమార్ధం- వేణువై వచ్చాను, భువనానికి - మాతృదేవోభవ - మాధవి, నాసర్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,652; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Venuvai Vachanu - Matru Devo Bhava - Madhavi, Nassar

మన తాత్కాలిక జీవిత నాటకం గురించి ఎంత బాగా చెప్పిందో చూడండి. రాగాలు మనకు సరిగ్గా రాకపోయినా, వాక్సుద్ది ప్రయత్నము లో భాగముగా, ఏదో 2 సార్లు విని అలా పాడేస్తున్నాము. మనకు పాటలో పరమార్ధం ముఖ్యం, అది మరువద్దు.

మనమందరం శరీరమనే వేణువై వచ్చాము, భువనానికి అంటే భూమికి. మన నాటకం పూర్తి అవగానే, గాలి లో కలసి పోతాము, గగనానికి/ ఆకాశములోకి. ఈ బంధాలు మమతలన్నీ అన్ని మౌన గానం లోకి వెళతాయి. ఇన్ని రోజులు, మనల్ని బానిసలు గా చేసి, జీవితాన్ని వ్రుధాచేసిన కోరికలు/ వాంఛలన్నీ, వాయులీనం అవుతాయి కదూ? ఆ మాత్రం దానికి, ఈ కుట్రలు కుతంత్రాలు ఎందుకు, మనశ్శాంతి లేకుండా?

ఆ ఏడు కొండల కైన, బండ తానొక్కటే, ఏడు జన్మల తీపి, ఈ మోహ తాత్కాలిక బంధమే. మన కంటిలో నలక, లో వెలుగు నే కనక, మేను నేననుకుంటె, ఎద చీకటే కదా? శరీరం వేరు, ఆత్మ వేరు, ఇది కేవలం ఒక తాత్కాలిక చొక్కా, ఎప్పుడైనా దీనిని విడవాలి అని తెలిస్తే, ఇంక పరుగులు ఎందుకు? అశాంతి ఎందుకు? ఈ రాయి బతుకు ఎన్నాళ్ళు, ఆ రామపాదం పట్టుకునేది ఏనాడు, మోక్షం ఎన్ని జన్మలకు?

గత జన్మలు గుర్తు లేదు. మరి ఈ జన్మలో, ప్రాపంచిక మోహ బంధాల కష్టాల వలన, నీరు కన్నీరాయే, ఊపిరే బరువాయే, నిప్పు నిప్పుగ మారే మన గుండెలో. చివరికి ఆ నింగిలో కలిసి, మన శూన్య బంధాలు, పుట్టిల్లు చేరే మన మట్టి బతుకు ప్రాణాలు. మరలా వచ్చే జన్మలో ఇవే కష్టాలా? హరీ, మానసిక నియంత్రణతో అరిషడ్వర్గ్ అష్టవ్యసనం ను జయించే సాధనతో కూడిన శక్తినివ్వు అంటూ, కళ్ళు ఇప్పటికైన తెరుచుకుని, దైవాన్ని ప్రార్ధించి, సాధన మొదలు పెడదామా?

వే.ణువై. వచ్చాను, భువనా.నికి..
గా.లినై. పో.తాను, గగనా.నికి.
మమతలన్నీ, మౌ..నగా.నం..
వాంఛలన్నీ, వా..యులీ.నం.. ||వేణువై వచ్చాను||

మాత్రు దే.వో.భవ, పిత్రు దేవోభవ, ఆచార్య దేవోభవ

ఏడు కొండలకై.న, బండ తా.నొ.క్కటే
ఏడు జన్మల తీ.పి, ఈ బం.ధ.మే..- 2 సార్లు మొత్తము
నీ కంటిలో.. నలక, లో వెలుగు నే.. కనక
మేను నేననుకుంటె, ఎద చీకటే., హరీ..! హరీ..! హరీ..!
రాయినై ఉన్నా.ను, ఈనా.టికీ..
రామ పాదము రాక, ఏనా.టికి.. ||వేణువై వచ్చాను||

నీ.రు కన్నీరా.యే.., ఊ.పిరే. బరువా.యే
నిప్పు నిప్పుగ మా.రే, నా. గుండెలో..- 2 సార్లు మొత్తము

ఆ నింగిలో. కలిసి, నా శూన్య బం.ధా.లు
పుట్టిల్లు చేరే.., మట్టి ప్రాణా..లు, హరీ..! హరీ..! హరీ..!
రెప్పనై ఉన్నాను, మీ. కంటికి..
పాపనై వస్తాను, మీ. ఇంటికి..

వే.ణువై. వచ్చాను, భువనా.నికి..
గా.లినై. పో.యాను, గగనా.నికి. 2

రచయిత - వేటూరి  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,652; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441
Dt : 19-Jun-2023, Upd Dt : 19-Jun-2023, Category : Songs
Views : 248 ( + More Social Media views ), Id : 1805 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Venuvai Vachanu , Matru Devo Bhava , Madhavi , Nassar
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content