Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Veyi Padagala Meeda - Mundadugu - Krishna, Shoban Babu, SriDevi, Jayaprada
అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడని, సొంత కుటుంబానికే ద్రోహం చేసే, కపట నటన 2 నాల్కల మానవుల ఆగడాలను ఆపడానికి, సాత్వికులకు రక్షణగా, రమ్మని కాపాడమని, ఆ స్వామి ని చిత్తశుద్ది వాక్సుద్ది తో వేడుకొనడం చూడండి.
వేయి పడగలమీద, కోటి మడుగుల నేల, మోసి అలసిన స్వామి, మోపిదేవి స్వామి,
హరుని కంఠము వీడి, హరిని నిద్దురలేపి, కదలిరా తండ్రి, మాలాంటి దీనుల రక్షింప, ధర్మ స్థాపన జరగడానికి అని ఆ దేవుని తప్ప, మత్తులో ఉన్న మానవులను పిలువలేము కదా.
సొంత ముదుసలి అమ్మ నాన్న అత్త మామ లకే, అలాగే సంస్కార పెంపక లేని పిల్లలకు, ద్రోహం చేసే ఈ కపట దాన వీరులు, సాటి మానవులకు మంచి చేయగలరా?
రుద్రవీణల లోన, నిద్ర వోయిన తీగ, రాగమయితే నేనురా, నాగమయితే నీవురా, శిష్ట రక్షణ కర్మ వీరా, దుష్ట శిక్షణ చేసి పోరా, పాపరాయా, సర్వ పాపాలనే కాలరాయ, కదలిరా, తరలిరా.
నిలువెల్ల విషమైన, రాక్షసులకన్నా నీచమైన, కపట నటన అధమ మానవ కీటకాలకు దక్కి, నిత్యం కాటు పడుతున్నామురా, ధర్మానికి జరిగే చేటు తెలిసీ లేచిరా, కాలగతివై కాలనాగువై, కాలధర్మపు కర్మపాశమై, ఆర్తరక్షణ చేసిపోరా అంటూ మనము ఆర్తిగా పిలుద్దామా?
శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకేచోట కొలువుదీరి భక్త జనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూ గా వెలసిన కార్తికేయుడు, నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే.
దీపావళి అనంతరం వచ్చే నాగులచవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్త జనులు తరలి వచ్చి ఇక్కడి పుట్టకి విశేషపూజలు నిర్వహిస్తారు.
కృష్ణాజిల్లాలో దివి సీమకు చెందిన ఒక మండలం మోపీదేవి. ఇది మచిలీపట్టణం నుండి 30 కిమీల దూరంలో వుంది. దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని పేరు. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది.
రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు. తూర్పుదిశగా వున్న ఆలయ గర్భగుడిలో 6,7 సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మస్వామిగా పూజలందుకుంటున్నాడు.
పుట్టమట్టిని ప్రసాదంగా ధరించటంవల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి నిదర్శనం. అందుకే ఆ రూపంలో వున్న స్వామిని ధ్యానించినవారికి మంచి, విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయని పురాణాలు తెలియచేస్తున్నాయి.
వేయి పడగలమీద, కోటి మడుగుల నేల,
మోసి అలసిన స్వామి.., మోపిదేవి స్వామి..,
హరుని కంఠము వీడి, హరిని నిద్దురలేపి,
కదలిరా.., కదలిరా.., కదలిరా.. ||
రుద్రవీణలలోన, నిద్ర వోయిన తీగ, రాగమయితే నేనురా.., నాగమయితే నీవురా..,
నీల గళ, గరళ జ్వా.లవై.., విలయ లయలో, రేగు లీలవై..,
బుసబుసల భూత్కార, శర పరంపరల తో,
దిగ్ దిగంత శ్రాంత, దుర్జనా నిధ్వాంత, గర్జనా.ళి ప్రకంపనలతో.., లయలతో..,
శిష్ట రక్షణ కర్మ వీరా.., దుష్ట శిక్షణ చేసి పోరా..,
పాపరాయా.., పాపరాయ.., సర్వ పాపాలనే కాలరాయ..,
కదలిరా.., కదలిరా.., తరలిరా.., ||వేయి పడగలమీద||
నిలువెల్ల విషమైన, కీటకాలకు దక్కి, కాటుపడుతున్నామురా.., చేటు తెలిసీ లేచిరా..,
కాలగతివై కాలనాగువై.., కాలధర్మపు కర్మపాశమై..,
కాకోల విష విషమ, కర్కోటకుల జంప,
సత్యమును గెలిపింప, ధర్మరతి వెలిగింప, శేషశైల ప్రకంపనలతో.., పగలతో..,
ఆది తక్షక లేచిరారా.., ఆర్తరక్షణ చేసిపోరా..,
నాగరాజా.., నాగరాజా.., సర్ప యాగాలకే నిత్యభోజా||
కదలిరా.., కదలిరా.., కదలిరా.. || ||వేయి పడగలమీద||
Movie: Mundadugu, 1983; Song: Veyi Padagala Meeda; Lyrics: Veturi Sundara Rama Murthy; Music: Chakravarthi; Singers: S P Balasubrahmanyam
Sri Subramanyeswara Swamy Temple - Mopidevi
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,518; 104 తత్వాలు (Tatvaalu) and views 254,492 Dt : 25-Aug-2023, Upd Dt : 25-Aug-2023, Category : Songs
Views : 890
( + More Social Media views ), Id : 1889 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Veyi ,
Padagala ,
Meeda ,
Mundadugu ,
Krishna ,
Shoban ,
Babu ,
SriDevi ,
Jayaprada ,
Mopidevi ,
Subramanyeswara Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments