వినాయక చవితి - గణపతి తత్వం - సంకష్ట నాశన, వాతాపి గణపతిం, ఎలుక పైన, దండాలయ్యా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,089; 104 తత్వాలు (Tatvaalu) and views 225,022.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Vinayaka Chavithi - Ganapati tatvam - Sankashta Nashana, Vatapi ganapatim, Elukapaina, Dandalayya Undralayya

*వినాయక చవితి - గణపతి తత్వం - సంకష్ట నాశన, వాతాపి గణపతిం, ఎలుక పైన, దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా*

వినాయక చవితి శుభాకాంక్షలు, Happy Ganesh Chaturthi, हैप्पी गणेश चतुर्थी

Let us show some of the qualities of Ganesha in practice. It is only important to show Ganapayya's qualities in mental attitude and actions, not the adornment.

వినాయక గుణాలు, కొన్ని అయినా, ఆచరణలో చూపుదాం. మానసిక భావం, చేతలలో గణపయ్య గుణాలను చూపడం మాత్రమే ముఖ్యం, అలంకారం ఆడంబరము కాదు.

ప్రతి రోజూ, అరిషడ్వర్గాలు ను జయించే సాధన ని, ధర్మం ను కాపాడే ధైర్యంను, మానసిక నియంత్రణ ను, తప్పు ఒప్పు ను ధైర్యంగా స్పష్టం గా వివేకంతో చెప్పే సంస్కారం విచక్షణ ను, కుటుంబ సంస్కార పెంపుకు, పంచభూతాల నవగ్రహాల అండ దండలు, పొందడం కు,

తెలుగు భాష రాతకు, దైవ శ్లోకాల పద్యాల పలుకుకు, భారత రామాయణ భాగవత భగవద్గీత చదువు కు, ముదుసలి తల్లి దండ్రుల సేవకు, త్యాగం నిస్వార్ధ సేవకు,

తగిన ఆరోగ్యం ను, శక్తి ని, ఆలోచన ను, ఆచరణ ను, వాక్సుద్ది ని, మాతృ మూర్తి భాష దేశ సేవ ఆర్తిని, ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురువులకు ప్రణామములు.

ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా అంటూ అందరము పూజలు చేసాము, కనీసం పసుపు ముద్ద గణపతిని పెట్టుకుని.

ఈ గణపతి తత్వాలలో కొన్ని అయినా, మనకు మరియు మన పిల్లలకు ఉన్నాయా అని పోల్చుకుని, లేకుంటే అలవాటు చేసుకుని, అరిషడ్వర్గాలను జయించి, మనశ్శాంతి ని పొంది, మోక్షము వైపు కు అడుగులు వేస్తూ, చివరకు ముదుసలి వయస్సులో, ఒకవేళ పిల్లల ఉంటే వారి ఇంట్లో ఉంటూ గౌరవముగా తనువు చాలించాలి - ఒంటరితనం, అనాధాశ్రమం లేకుండా.

అప్పుడే మనము చేసిన మానవ సేవకు, దైవ పూజకు, సంస్కార పెంపకముకు ఫలితము దక్కినట్లు. లేదంటే, జంతువుల/ బండరాళ్ళ పెంపకము లాగా జీవితం నిష్ప్రయోజనమని ఉందని మనమే బాధపడాలి.

1. Shiva's family is like our family - children are raised with care, see, with culture. The position is competitive, without passion and bias. Quality, goodness, Courtesy only important.

2. In case of disagreement between 2 children, the parents settled Ganadhyaksha position for winner. They teaches how to live in harmony with intellectual qualities. Raised children as a culture without abusing authority.

3. Ganesha, who is made of Shakti, with great pride went to war is with the Father. For coming down, the father severely punished him, resurrected him and imparted wisdom, as Ganesha, He was made into a mighty man of wisdom.

In other words, it is clear that even they punished children if they make a big mistake. Character and Culture is important than the relation/ bond.

4. Lord Ganesha said it is difficult for me to circumambulate the earth. Then parents gave wisdom, according to Shastra. They said that circumambulation of the parents is equal to the circumambulation of the earth.

No matter what we do, we need correct thinking, and help of Shastra and experienced elders, Listen to them. Mistakes should be corrected. What we don't know, secrets tips, they know.

5. Both the brothers are in harmony with good qualities, gave good name to the parents. No wrong deeds, no ignorant deeds done by them. Because their father is Layakara, they did not misbehave with other deities, as they wished. They didn't use parents name, for living, they clearly showed their wisdom.

6. No relation with age, even if kids are wise, virtuous, we should bow and respect their knowledge. Eventhough we have many gods, the youngest Ganesha got the first worship. We also respect Prahlad. Knowledge is important, not age.

7. Ganesha helped Vyasa with courtesy, to wrote the Mahabharata in Sanskrit. As much as you say I write fast, if you stop, then I will go away, that is the philosophy of competition. As another says, we cannot write that fast.

Many of us don't even know how to write Telugu/ mother tongue, don't learn it, carelessness. Because we don't teach culture, we don't care our older parents.

8. He broke his tooth and used it to save the world and kill the demon. The best folks will think about the world. They also help, even at the expense of self-interest. like this, a lot can be written.

For every festival, the first thing we do is to increase our Samskara, comparing with divine gunas. That is the good purpose of our festivals.

1. శివ కుటుంబం, మన కుటుంబం లాంటిదే - పిల్లలను ఎంత జాగ్రత్త గా పెంచారు చూడండి సంస్కారముతో. మోహం, పక్షపాతం లేకుండా, పోటీతోనే పదవి అన్నారు. గుణము మంచి మర్యాద మాత్రమే ముఖ్యం అన్నారు.

2. ఇద్దరు పిల్లల మధ్యలో తగవు లేకుండా, తల్లి దండ్రులే పరిష్కారం చూపి, గెలిచిన వారికే గణాధ్యక్ష పదవి కట్టబెట్టారు. తెలివి గుణములతో, సఖ్యత గా ఎలా మెలగాలో నేర్పారు. తమ పిల్లలు, అధికార దుర్వినియోగం చేయకుండా, సంస్కారం గా పెంచారు.

3. శక్తి తో తయారు చేయబడిన వినాయకుడికి, ఎంతో అహంకారము తో తండ్రితోనే యుద్దానికి దిగినందుకు, తండ్రి కఠినముగా శిక్ష వేసి, మరలా బ్రతికించి జ్ఞాన బోధ కలిగించి, గణేషుడుగా, బుద్ది సిద్ది కలిగిన మహా బలవంతుని గా తీర్చి దిద్దారు.

అంటే, తప్పు చేస్తే, బిడ్డలు అయినా సహించేది లేదని స్పష్టము గా చెప్పారు. బంధం కన్నా గుణం సంస్కారం ముఖ్యమని చాటారు.

4. గణేషుడు, నేను భూమండలం ప్రదక్షిణ చేయడం కష్టం అంటే, తెలివి చెప్పారు శాస్త్రం ప్రకారం, తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసిన, అది భూమండలం ప్రదక్షిణకే సమానమని చెప్పారు.

మనము ఏ పని చేసినా, మనకు కరెక్ట్ అనుకోకుండా, శాస్త్రం మరియు అనుభవజ్ఞులైన పెద్దల మాట విని చెయ్యాలి. తప్పులు సరి చేసుకోవాలి. మనకు తెలియని, రహస్యాలు చిట్కాలు, వారికి తెలుసు.

మర్యాదతో నడచుకుంటేనే, వారు సహాయం చేసి, దోవ చూపుతారు. మనకు పెద్ద సమస్యలు కావచ్చు, కాని పెద్దలకు అవి చిన్న సమస్యలు. మనము అహంకారము తో ఉంటే, వారు దూరముగా ఉంటారు.

5. అన్న దమ్ములు ఇద్దరూ మంచి లక్షణాలు తో సఖ్యత గా ఉంటూ, తల్లి దండ్రులకు మంచి పేరు తేచ్చారు. ఎటువంటి తప్పుడు పనులు, నలుగురు ద్రుష్టిలో అజ్ఞాన పనులు చేయలేదు. మా తండ్రి లయకారుడు అని, ఇష్టవచ్చినట్లు, ఇతర దేవతలు తో దురుసుగా ప్రవర్తించలేదు. తల్లి తండ్రి పేరు చెప్పుకుని బతకకుండా, స్పష్టముగా తమ ప్రజ్ఞను చాటారు.

6. తెలివైన వాడు, గుణ వంతుడు, పసివాడైనా, మనము నమస్కరించి గౌరవించాలి, వయస్సు తో సంబంధము లేదు. ఏ దేవతల అందుకే చిన్నవాడైన గణేషుడు కే, మొదటి పూజ. అలాగే మనము ప్రహ్లాదుని కూడా గౌరవిస్తాము. జ్ఞానము ముఖ్యం, వయసు కాదు.

7. గణేషుడు అణుకువ గా ఉండి, వ్యాసునికి సంస్క్రుతం లో మహాభారతం రాసి పెట్టారు. మీరు చెప్పేంత స్పీడు గా రాస్తాను, మీరు మాట ఆపారు అంటే, ఇక వెళ్ళి పోతాను అని చెప్పారు, అది పోటీ తత్వము. ఇంకొకరు చెపుతుండగా, మనము అంత స్పీడ్ గా రాయలేము.

మనకు చాలా మందికి తెలుగు రాయడం కూడా రాదు, నేర్చుకోము, నిర్లక్ష్యము. ఎందుకంటే పిల్లలకు సంస్కారం నేర్పము, తల్లి దండ్రులను చూడము కాబట్టి.

8. తన దంతాన్ని విరిచి, లోక రక్షణకై, రాక్షసుని చంపడానికి ఉపయోగించారు. ఉత్తములు లోకం గురించి కూడా ఆలోచన చేస్తారు, స్వతలాభము కొంత మాని, తాము నష్టపోతూ కూడా. ఇలా చెప్పు కుంటూ పోతే, ఎన్నో రాయవచ్చు.

ప్రతి పండగకు, మనము చేయాల్సిన మొదటి పని, మన సంస్కారం ను పెంచుకోవడం, దైవ గుణాలతో పోల్చుకుంటూ, సుమా. అది మన పండుగల మంచి ఉద్దేశ్యము.

1) Sankata Nashana Ganesh Stotram సంకష్ట నాశన గణేశ స్తోత్రం संकष्ट नाशन गणेश स्तोत्र

సంకష్ట నాశన గణేశ స్తోత్రం జపించడం వల్ల అన్ని రకాల సమస్యలు, బాధలు తొలగిపోతాయి. ఈ స్తోత్రం నారద పురాణంలో ఉంది, ఈ స్తోత్రంతో గణేశుడిని ఆరాధించడం వల్ల అన్ని సమస్యలు, భయాలు తొలగిపోతాయని నారదుడు వివరించాడు. సంకట నాశన గణేశ స్తోత్రం ద్వాదస నామ స్తోత్రం, ఇందులో గణేశుడిని తన 12 పేర్లతో ప్రార్థించడం జరుగుతుంది. భక్తితో సంకష్ట నాశన గణేశ స్తోత్రం జపించండి.

నారద ఉవాచ

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్ || 3 ||

నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || 5 ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||

ఇతి శ్రీ నారద పురాణే సంకట నాశన గణేష స్తోత్రం సంపూర్ణం ||

2) వినాయక చవితి - వాతాపి గణపతిం భజే

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
అగజా, ఆ.నన పద్మార్కం, గజానన మహర్నిశం
అనే.క దంతం, భక్తానాం., ఏక దంతముపాస్మహే..
ఏక దంతముపాస్మహే

వాతాపి గణపతిం భజేహం 4
వారాణాస్యం వరప్రదం శ్రీ
వారాణాస్యం వ.ర.ప్ర.దం. శ్రీ
వాతాపి గణపతిం భజే.. ఏ.

భూతాది, సంసేవిత చరణం
భూత భౌతికా, ప్రపంచ భరణం
వీత రాగిణం, వినత యోగినం 2
విశ్వ కారణం, విఘ్న వారణం
వాతాపి గణపతిం భజే.. ఏ...

పురా. కుంభ, సంభవ మునివర
ప్రపూజితం, త్రిభువన, మధ్య గతం
మురారి, ప్రముఖాద్యుపా.సితం
మూలాధార, క్షేత్రా స్థితం
పరాది, చత్వారి, వా.గాత్మకం
ప్రణవా స్వరూప, వాక్రతుండం
నిరంతరం, నిఖిల చంద్ర ఖండం
నిజ వామకర, విధ్రుతేక్షుతండం

కరాంభుజ పాశ బీజాపూరం, కలుష విదూరం భూతాకారం.. 2

హరాది గురుగుహ, తోషిత బింబం,
హంసధ్వని, భూషిత హేరంబం

వాతాపి గణపతిం భజేహం
వారాణాస్యం వరప్రదం శ్రీ
వాతాపి గణపతిం భజే ఏ.. ఏ.. ఏ

చిత్రం : వినాయక చవితి (1957), సంగీతం : ఘంటసాల, గీతరచయిత : ముత్తుస్వామీ దీక్షితార్, నేపధ్య గానం : ఘంటసాల
Vinayaka Chavithi
Actor : NTR / ఎన్ టీ ఆర్, Actress : Jamuna / జమున, Music Director : Ghantasala / ఘంటసాల, Movie Director : Samudrala Raghavacharya (Samudrala Senior) / సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్) ,

3) ఎలుక పైన ఊరేగి, ఎల్ల లోకముల తిరిగి
ఏలుచుందు వెల్లరను, గణపతి
ఎటు పొగడుదు, నీ మహిమలను.. - 2 సార్లు

మోదకముల నైవేద్యం, భుజియింపుచు కడుపారా.
మోదమొందు విగ్నేశ్వరా...
భక్తుల మ్రొక్కుల గొనుమో, దొరా - 2 సార్లు ||ఎలుక పైన ఊరేగి ||

ఎన్నెన్నో అడ్డంకులు, ఈ. బ్రతుకు పొడుగునా.
అన్ని అడ్లు, తీరునట్లు, వరమీయగ దిరానా
వేడెదమో గజవదనా.., గతి వేరెవరిక నినువినా ||ఎలుక పైన ఊరేగి ||

లోకములో మొదటి పూజ, నీకే గద విఘ్నరాజ
నీ ఘనతకు వే..రే..ల, నిదర్శనం
మాకు నీవొసగుము నీ..దర్శనం - 2 సార్లు ||ఎలుక పైన ఊరేగి ||

Lyrics: ఎలుకపైన ఊరేగి, జానకి గారు, SINGER: . జానకి గారు

4) జై జై జై జై గణేష జై
జై జై జై జై వినయకా జై
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా, దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా, చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి, తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలే ఆదరించి, తోడు నీడ అందించయ్యా ఓ. ||దండాలయ్యా||

చిన్నారి ఈ చిట్టెలుకెలా, భరించెరా లంబోదరా
పాపం, కొండంత, నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా
ఓ. హో హో, జన్మ ధన్యం.. - మొత్తము 2 సార్లు
అంబారిగా, ఉండగల, ఇంతటి వరం
అంబాసుతా, ఎందరికి, లబించురా
ఎలుకనెక్కే, ఏనుగు కథ, చిత్రం కదా..||దండాలయ్యా||

చరణం2:
శివుని శిరసు సింహాసనం, పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే, చేసింది, వేళాకోళం,
ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా,
ఏమై, పోయింది, గర్వం - మొత్తము 2 సార్లు
త్రిమూర్తులే, నిను గని, తలొంచరా
నిరంతరం, మహిమను, కీర్తించరా
నువ్వెంత అనే, అహం నువ్వే, దండించరా ||దండాలయ్యా||

Dandalayya Undralayya Lyrical Song, Venkatesh, Coolie No1

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,089; 104 తత్వాలు (Tatvaalu) and views 225,022
Dt : 30-Aug-2022, Upd Dt : 30-Aug-2022, Category : Songs
Views : 711 ( + More Social Media views ), Id : 1506 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vinayaka , chavithi , ganapati , tatvam , vatapi , ganapatim , elukapaina , dandalayya , undralayya , sankata , nashana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content