రాజన్న నివాళులు లో వార్నింగ్ లు, క్రమశిక్షణ బాధ్యత లేని, చీరాల వైసీపీ రాజకీయం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1495 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1530 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

జరుగుతున్న కార్యక్రమం ఏమిటి, చేస్తున్న ఆరోపణలు హెచ్చరికలు ఏమిటి? మనం ఒకరోజు ముందే, అందరికీ గుర్తు చేశాము, ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించి, మనం రాజన్న కు ఘన నివాళులు అర్పించాలి అని.

రోగులకు సేవ అందించడం లో, ఆక్సిజన్ సిలిండర్ లు పంచడం లో, ఊళ్ళో 24 గంటలు అందుబాటులో ఉండటం లో, ఆరోగ్య కరమైన పోటీ ఉండాలి, అందులో తప్పు లేదు.

చీరాల జిల్లా మరియు పార్లమెంట్, స్మార్ట్ సిటీ, స్మార్ట్ బీచ్, హార్బర్, చేనేత పార్కు, నిమ్స్ లాంటి ఆసుపత్రి, ఐఎల్టీడీ లాంటి పరిశ్రమ, జీడిపప్పు పరిశ్రమ, ప్రభుత్వ డిగ్రీ/ పీజీ కొత్త హంగులు కోర్సులతో, గురించి సవాళ్ళు విసిరుకుంటే, జనం మెచ్చుతారు, అందరికీ మంచి జరుగుతుంది.

పార్టీ పెద్దలు, విజయ సాయి గారు, వైజాగ్ ఆసుపత్రిలో రోగులు ను పలకరించారు, తగిన కోవిడ్ జాగ్రత్తలు వహించి. కరోనా తో పోరాడి కూడా, గమ్ముగా రాజన్న విగ్రహం కు దండ వేసి ఉన్నా, ఎవరం అడగలేం ఆరోగ్యం దృష్ట్యా. కానీ, ధైర్యంగా ఆసుపత్రి సందర్శించారు, అది గొప్ప విషయం.

అలా పెద్ద నాయకులు ను చూసి, మనము మంచి పనులు చేయాలి. కరణం మరియు ఆమంచి లు ఇద్దరూ తమకు వచ్చిన కరోనా తో పోరాడారు, ఇంకా వారికి విశ్రాంతి కావాలి.

అసలు నివాళులు కార్యక్రమంలో, హెచ్చరికలు అవసరం ఏమిటి? అదీ ఒకే పార్టీ వ్యక్తుల పైన. ప్రేమగా అభిమానంగా ఉండాలి మాట్లాడాలి గానీ, మన రాజన్న జగనన్నల గురించి. తర్వాత రోజో, కరణం గారు వచ్చిన తర్వాత నో, పార్టీ పెద్దలు ఎదురు ఆరోపణలు చేసుకోవచ్చు, గుట్టుగా. అంత పెద్ద ఫ్లెక్సీలు అన్ని ఆ సెంటర్లో, అవసరమా? వ్రుధా ఖర్చు.

పైన పేర్కొన్న అభివృద్ధి పనులు కు, ఆ ఫ్లెక్సీల ధనం వినియోగించవచ్చు. వెంకటేష్ కొంచెం నెమ్మదిగా ఉండి ఆ రోజు వరకు, నివాళులు అయిన తర్వాత రోజు న, ఈ హెచ్చరికల కార్యక్రమం, పెట్టుకుని ఉంటే బాగుంటుంది. ఆమంచి ఎదురు ఆరోపణలు, నేరుగా చేయకుండా, పార్టీ పెద్దలు కు ఫిర్యాదు చేశారు.

ఇప్పుడు అయినా, అభివృద్ధి లో పోటీలు పడండి, జగనన్న పేరు నిలబెట్టగలరు అని, ప్రజలు అభిమానులు ఆశపడుతూ, ఆవేదన చెందుతున్నారు.

బాపట్ల ప్రజలకు శుభవార్త చెప్పారు రాబోయే కొత్త ఆసుపత్రి గురించి, వీడియో వినండి, మన బాపట్ల ఎమ్మెల్యే మరియు ఉపసభాపతి, సౌమ్యంగా వినమ్రంగా, కోనా రఘపతి గారు. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇది ప్రజలకే గాదు, రాజన్న కు నిజమైన నివాళి, జగనన్న కు ఖ్యాతి. కరోనా చికిత్స ఆంధ్రా లోనే చేయించుకున్నారు, ఆ సమయంలో కూడా అందుబాటులో ఉన్నారు, అని మనందరి కీ తెలుసు.

ప్రజలకు కావాల్సింది ఊక దంపుడు అరుపులు సవాళ్లు కాదు, అభివృద్ధి పనులు. నియోజకవర్గ నాయకుడు అంటే అలా ఉండాలి.

చీరాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరూ కూడా గర్వంగా, రాజన్న కు నివాళులు అర్పించే అంశాలు, అభివృద్ధి పరంగా ఉన్నాయా? ఇద్దరూ కూడా, తమ కరోనా చికిత్స కు చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి లేదా ఒంగోలు రిమ్స్ కి వెళ్ళలేదు. ఇద్దరు కూ తాము చేసిన చేస్తున్న, అభివృద్ధి మీద నమ్మకం లేదని, ప్రజల భావన.

ఇన్నేళ్ళు ఎమ్మెల్యే గా ఆమంచి ఉండి, తన పలుకుబడి తో తన వెనక అండ ఉన్న నాయకులు తో, పై పది అభివ్రుద్ది పనులు, ఎందుకు తేలేదు అని కరణం గారు, గోపాలకృష్ణా సెంటర్ లో నిలదీయవచ్చు. జనం, ఈలలు వేసి అభినందిస్తారు. ఎందుకంటే జనం కు, ఉపాధి అవకాశాలు వస్తాయి. అదీ రాజన్న నివాళులు, తర్వాత రోజుల్లో.

అలాగే, ఆమంచి గారు కూడా, కరణం గారు సంవత్సరం నుంచి మీరు, మీ పలుకుబడి ఉపయోగించి, మిమ్మల్ని పార్టీలో కి తెచ్చి న వారి అండతో, పై వాటిలో ఎన్ని తెచ్చారు? ఎన్ని తేగలరు చూద్దాం? కనీసం ఊళ్ళో ఇల్లు తీసుకుని, ఎప్పుడు ఉంటారు, అందుబాటులో అని గట్టిగా అడగవచ్చు. తెదేపా ను కనీసం ఎత్తి పొడవని మీరు, అద్దంకి లో నిలబడలేని మీరు, ఇక్కడ ఉంటారా అని అడగవచ్చు అని బాధ్యత గల ప్రజల భావన.

వీటిపైన సవాళ్లు కూడా ఎందుకు, వినమ్రంగా చెప్పండి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు దగ్గర లో ఉన్నాయి. ఇప్పుడు అయినా, మీ మీ వెనక ఉన్న నాయకులు ను అడిగి, చీరాల అభివృద్ధి కి తోడ్పడండి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1530 General Articles, 51 Tatvaalu
Dt : 04-Sep-2020, Upd Dt : 04-Sep-2020, Category : Politics
Views : 491 ( + More Social Media views ), Id : 676 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : amanchi , karanam , warnings , rajanna tributes , irresponsible , no discipline , chirala , ycp , politics , bapatla , kona
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content