మనసు నియంత్రణ అంటే? నా మనసు, మాట వింటూనే ఉంది అనుకుంటున్నా. నేను మీరు అనుకునేది, ఒకటేనా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2105 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2140 General Articles and views 2,084,891; 104 తత్వాలు (Tatvaalu) and views 237,282.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, మనసు నియంత్రణ అంటే ఏమిటి? నాకు ఎప్పుడూ నా మనసు, నా మాట వింటూనే ఉంది అనుకుంటున్నా. ఉదాహరణ ఎప్పుడైనా లెగవడం, తినడం, టీవీ సినిమా చూడడం. కానీ మీవి చదువుతుంటే, అనుమానం వస్తుంది. నేను అనుకునేది, మీరు చెప్పేది ఒకటేనా? అని.

జవాబు - ధన్యవాదాలు. ఎప్పుడు లాగనే, పెద్దలు, ఇందులో తప్పులు సరి చేయవచ్చును.

అందరూ అక్కడే పొరపాటు పడుతుంటారు. నా మనసు నా మాట వింటుంది కదా, మరలా నియంత్రణ ఏమిటీ అని. మనసు వింటుంది, చెడ్డ లేదా మంచి విషయాల కా అన్నది మాత్రం, ఎవరూ తొందరగా ఒప్పుకోరు.

మనశ్శాంతికి జయించాల్సిన మన మొదటి 6 శత్రువులు మనలోనే ఉన్నారు, అదే జీవిత లక్ష్యం లేదంటే పతనం, అరిషడ్ వర్గాలు గా - కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యము (అసూయ).

మన జీవిత మంతా, వీటి చుట్టూనే ఉంటుంది. ఇప్పుడు మన మనసు వినడము కూడా, వీటి చుట్టూనే ఉంటుంది. అది 2 రకాలు గా 1. అరిషడ్ వర్గాలకు బానిసలాగా 2. అరిషడ్ వర్గాలను జయించిన రాజు లాగా.

75 శాతం, మొదటి రకానికి చెందిన వారే. వారూ, మా మనసు మా మాట వింటుంది, అని భ్రమలో నే ఉంటారు. వీరంతా, సంతోషం సుఖం, మనకు బయట ఉందని, భ్రమలో ఉంటారు, మోసపోతారు, కాల చక్రములో చిక్కుకుంటారు. సంతోషం మనలోనే ఉంది అని, వీరు ఎప్పుడూ తెలుసుకోలేరు. ఉదాహరణలు చూడండి.

* * * ఆదివారం లేదా సెలవు లేదా ఏరోజైనా, 8 నుంచి 10 గంటలకు లెగుస్తాను - ఇది బద్దకం, నిర్లక్ష్యం.
1. అరిషడ్ వర్గాలకు బానిసలాగా - ఒకతను, నేను సెలవు దినం, 10 ఇంటికి లెగుస్తాను అనుకున్నాడు, లెగిచాడు. ఇది మనసు వినడం కాదు, మోహపు పని లో, అంటే, మత్తులో ఎక్కువ సమయం తూగడం బద్దకము తో, నిర్లక్ష్యముతో. అంటే, తనను తాను మోసము చేసుకుంటూ, బ్రమలలో బతకడం. తన అవయవాలు కూడా, ఓ 3 గంటలు లేటుగా, పని చేద్దాము అనుకుంటే?

2. అరిషడ్ వర్గాలను జయించిన రాజు లాగా - చూడండి మనసు వినడము అంటే, నేను రోజు, సూర్యోదయానికి, ముందే కాల క్రుత్యాలు తీర్చుకుని, భగవంతుని పూజ చేసి, దైనందిక కార్యక్రమం మొదలు పెడతాను. ఇది, మనసును జయించిన వారికే సాధ్యం.

* * * నేను సినిమా, టీవీ, షికారు ల, డ్రింక్ ల తో ఆనందముగా ఈ రోజు గడుపుతాను - ఖర్చు సమయం వ్రుధా
1. అరిషడ్ వర్గాలకు బానిసలాగా - ఊరక వచ్చిన సొమ్ము, బాధ్యత తెలియని వయస్సు లేదా మనస్సు, ఇలా ఆలోచన చేసి, దుబారా చేస్తూ, సమయాన్ని వ్రుధా చేస్తు, ముందు ఎంజాయ్ చేసి, చివరలో మూలన కూర్చుంటారు. ఇది మనసు విన్నట్లు కాదు, చెడగొట్టినట్లు.

2. అరిషడ్ వర్గాలను జయించిన రాజు లాగా - నేను సినిమా, టీవీలను చూసే స్థాయి నుంచి, కనపడే స్థాయికి రావాలంటే, ఏమి చెయ్యాలి? ఎంత కష్ట పడాలి? ఆ సమయములో, ఇంకో మంచి పని చేయవచ్చా - ఓ పాట సొంతముగా పాడ గలనా, రాయగలనా? కనీసం, వ్యాసం రాయగలనా? మత్తు తో, మనసు ఆరోగ్యం పాడవుతుంది, కాబట్టి దానికి దూరం గా ఉండాలి. దుబారా వ్రుధా ఖర్చు చేయను. ఇలా చేయగలిగితే, మనసు విన్నట్లు.

* * * కోపం వస్తే, ఇతరులను కొడతాను, తిడతాను, కీడు చేస్తాను.
1. అరిషడ్ వర్గాలకు బానిసలాగా - అలా అనుకుని, ఇలా చేస్తారు. పతనము అవుతారు. అది మనసు కు దాసోహం అవడము.

2. అరిషడ్ వర్గాలను జయించిన రాజు లాగా - ఈ వ్యక్తులతో పడనప్పుడు, వారికి దూరము గా ఉంటాను. వారితో గొడవ అనవసరం. క్రుష్ణుడు కౌరవులకు, దూరం గా ఉన్నాడు, తగువుకు పోలేదు.

* * * కామ అంటే, కోరికలు. అవి కావాలి ఇవి కావాలి అని - సుఖం, వస్తువులు, తిండి, సౌకర్యాలు, ధనం, హోదా, . . . అంతు ఉండదు.
1. అరిషడ్ వర్గాలకు బానిసలాగా - కోరికలు గుర్రాలు అయితే, అది మనసు వినడము కాదు, మనము మనసుకు బానిసలం. పతనము అవుతాము.

2. అరిషడ్ వర్గాలను జయించిన రాజు లాగా - మన శక్తి ఏమిటి, మనకు ఎంత వరకు అవసరము, అది ధర్మ మార్గము లో తెచ్చుకో గలమా. అని కోరికల గుర్రాలకు, పగ్గాలు వేసి ఆప గలిగితే, మన మాట విన్నట్లు.

* * * నేను నాకుటుంబం బాగుంటే చాలు, బయట ఏమైనా నాకు అనవసరం, ఇతరులతో నాకు వద్దు.
1. అరిషడ్ వర్గాలకు బానిసలాగా - ఇది స్వార్ధ చింతన. ఇదీ ఒక మోహమే, నేను నాది అని. రైతు నేను పండించుకున్నాను, నేనే తింటాను అనుకుంటే, మనము బతికి ఉంటామా? దేవుడు, మనకు ఎందుకు ఇంత సౌక్యమైన జీవితం ఇవ్వాలి, స్వార్ధపరులుగా? అన్ని ఆయనే ఉంచుకోవచ్చు కదా? అయితే, కొంత నయం, ఇతరులతో గొడవలు పెట్టుకోరు, కానీ మనది మనం అన్న భావన లేకపోతే, దేవుని చేరము.

2. అరిషడ్ వర్గాలను జయించిన రాజు లాగా - అందరూ దేవుని సంతానమో. అందరూ బాగుంటేనే, వారి మధ్యలో నివసించే, మనము బాగుంటాము. మనము సంఘ జీవులము. సంఘము మొత్తము చెడిపోతే, మనము మాత్రమే మంచిగా, మనశ్శాంతి తో బతకలేము అన్న యదార్ధాన్ని గ్రహిస్తాడు.

కాబట్టి, పెద్దలు చెప్పిన మంచి విషయాలు సంస్కారము తో ఆచరించగలిగితే, అరిషడ్ వర్గాలను జయించ గలిగితే, అప్పుడు మన మనస్సు మన మాట విన్నట్లు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2140 General Articles and views 2,084,891; 104 తత్వాలు (Tatvaalu) and views 237,282
Dt : 12-Sep-2021, Upd Dt : 12-Sep-2021, Category : General
Views : 1093 ( + More Social Media views ), Id : 1248 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mind , control , listening , thoughts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content