Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మీ దగ్గర అన్నా కాకి, పిల్లి, కుక్క ఏదో కల్తీది అయినా, లేదా ఇంజక్షన్ ఇచ్చి పెంచిన దైనా, కనీసం వారం క్రితం కుళ్ళు ది అయినా నాన్ వెజ్, తాజా ది దొరుకుతుంది. వారం అంటే తాజాదే కదా, నెల కన్నా, ఇంకా ఎక్కువ కన్నా.
మా దగ్గర అసలు, ఆ ఐస్ లో పెట్టి, ఎన్ని వారాల దైనా, మన ఇంట్లో మరలా ఇంకో వారం నెలా దాపెట్టి, జనం లొట్టలు వేసుకుంటూ తింటుంటే, నా సామి రంగా, నిజమైన దైవ భక్తి, జంతువుల ఎడల కరుణ, మానవత్వం, మట్టి మశానం, అంతా వారిలో ప్రతిబింబిస్తుంది.
ఇంకా చిత్రం ఏమిటి అంటే, తిన్నాక కబుర్లు లో మరలా వారే, అబ్బే లోకం చెడిపోయింది అండి, జాలి దయ మానవత్వం నశించి పోతుంది, అని ఉపన్యాసాలు.
ఇంట్లో చనిపోయిన మన వాళ్ళ శవాన్ని కూడా, ఒక రోజు ఉంచుకోమే, మరి చనిపోయిన జంతు శవ మాంసాహార విందు, ఆరగిస్తూ ఉండే మహానుభావులు ఎంత పుణ్యాత్ములో కదా.
తాజా జంతు శవ మాంసం కూడా దొరుకుతుంది, ఇక్కడ కూడా. తెలుసు కదా, అవి కూడా, గబుక్కున పెంచి చిటుక్కున తుంచే, ఎదిగీ ఎదగని క్షణిక జంతు ప్రాణాలే.
మన శాస్త్రం ప్రకారం, పూర్వ జన్మ పాప పరిహారం, జంతు పశు పక్షి కీట కాదులుగా, మన స్నేహితులో బంధువులో ఉండవచ్చు. అది కాకపోయినా నమ్మకపోయినా, జంతుహింస మహా పాపం. మనం కారణం కారాదు.
దేవతలకు జంతు లేదా ప్రాణ బలి ఇవ్వాలని, ఏ శాస్త్రం చెప్పలేదు. బలి అంటే అర్థం, మన తిండి లో, కొంత భాగం దేవతకు పెట్టమని, నైవేద్యం గా, ఇంట్లో లాగ.
అందుకే పోలేరమ్మ పొంగళ్ళు. కానీ రక్త మాంస రుచి మరిగిన పెద్దలు, మాంత్రికులు, తాంత్రికులు, కొందరు స్వార్థం తో, జంతువుల ప్రాణాలు బలి లో కలిపారు.
బడుగు బలహీన వర్గాలు తిరగబడినట్లే, జంతు సమూహాలు అన్ని ఏదో నాడు, మనలాగా దైవ శక్తితో ఒకటి గా మాట్లాడుకుని ప్రాణరక్షణ కొరకు, ఎదురు తిరిగి మూకుమ్మడిగా, దాడి చేయడం మొదలు పెడితే, మనకు దాంకోవటానికి చోటు కూడా ఉండదు సుమా.
భవిష్యత్తు ప్రమాద కరంగా మారుస్తోంది, రాక్షస ప్రవృత్తి గల నాలుక రుచి బానిస మనుషులమే. మనం బతుకు దాం, ఇతర జీవాలను బతకనిద్దాం.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,349; 104 తత్వాలు (Tatvaalu) and views 224,882 Dt : 19-Feb-2020, Upd Dt : 19-Feb-2020, Category : General
Views : 1045
( + More Social Media views ), Id : 351 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
parents ,
vegetarian ,
Corona virus ,
COVID-19 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments