మనం ఆత్మ విమర్శ చేసుకోలేనప్పుడు, ఇలాంటి వారి అండ మనకు బంగారు భవిష్యత్తు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,786,502; 104 తత్వాలు (Tatvaalu) and views 217,098.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మన శక్తి కి మించిన, పెద్ద పని చేసేటప్పుడు, శ్రేయోభిలాషులు, పెద్దలు, మన మంచి కోరే వారు అందరికీ చెప్పి, వారి ఆశీస్సులు సలహాలు తీసుకుని, అండ గా ఉంచుకోవడం మంచిది.

ఏళ్ళు గా తెలిసి ఉండి, స్ధిరమైన భావాలు ఆలోచన, దైవం ధర్మం పెద్దల గౌరవం చేతలలో ఆచరణలో చూపే, మంచి మనసు గల వారి ఆశీస్సులు, ఎప్పుడూ మనకు కొండంత అండ.

ఎందుకంటే, ఎటువంటి కష్టాలు నష్టాలు మోహం వ్యామోహం అవమానం అభిమానం లో కూడా, వారిలో మార్పులు ఉండవు, మనము ఏళ్ళు గ గమనించి ఉంటాము, ముక్కుకు సూటిగా ఉంటారు, మనమే సాక్ష్యం. స్ధిరమైన మానసిక శక్తి కలిగి ఉంటారు.

ఆత్మ విమర్శ మనం సొంతగా చేసుకోలేనప్పుడు, పిచ్చిపనులు చేసి నష్టపోయే కనా, ఇలాంటి వారి అండ, మనకు బంగారు భవిష్యత్తు.

అందుకే అటువంటి వారితో తగువు పెట్టుకోకుండా ఉండాలి, వారికి అన్ని విషయాలు, ఎప్పుడూ మన గురించి చెపుతూ, మానసికముగా దగ్గరగా ఉండాలి.

ఎందుకంటే వారి మాటలు, సలహాలు ముందు చూపు, మనకు ఈనాడు నచ్చకపోయినా బాధ కలిగినా, మనకు శ్రీ రామ రక్ష, ఏనాటికైనా. అనుభవం తో కూడిన, ముందు చూపు జాగ్రత్తలు ఉంటాయి, వారి మాటలలో జాగ్రత్త గా ఆలోచన చేస్తే.

మనం తప్పు దోవలో వెళ్ళకుండా కాపాడతారు, మన ఇంట్లో వారికి అంత శక్తి యుక్తులు ముందు చూపు ఉండవచ్చు ఉండకపోవచ్చు. భవిష్యత్తు సమస్యలు ఊహించలేకపోవచ్చు.

ఒకవేళ మనకు నచ్చకపోయినా, ప్రయత్నం చేయడానికి చూస్తాం అని మర్యాద గా చెప్పి, తర్వాత అయినా ఎందుకు చేయలేకపోయాము అన్నది, సరైన బాధ్యత గల కారణం చెప్పగలిగి ఉండాలి రుజువు తో, నమ్మకం పెంచుకోవాలని ఉంటే.

* మన ఆదాయం కు, ఆస్తి కి, అర్హతకు, శక్తి కి మించిన, కొత్త విషయాల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది.

* అప్పు చేసి పప్పు కూడా, ఎప్పుడూ ప్రమాదమే. ఇతరుల ధనం తో పైకి పోయే వారు, ఏనాటికైనా పతనం తప్పదు. అవసరానికి తక్కువ అప్పు తప్పుకాదు, అయితే, ఆ అప్పు వలన మనము లేదా ఇతరులు మునిగే పరిస్థితి మాత్రము తప్పే.

* కీడెంచి మేలెంచు అని పెద్దల సామెత. అంటే ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే, ఫలితాలు మనకు వ్యతిరేకముగా ఉంటే, మనం మన కుటుంబం రోడ్డు న పడకూడదు అన్నది కూడా ఆలోచన చెయ్యాలి ముందు చూపుతో.

* అంటే ఉన్నవి అన్ని తాకట్టు పెట్టి ధనం తెస్తే, రేపు అవన్నీ పోయి, మనం రోడ్డు న ఉండకూడదు. ఇవన్నీ ముందే ఆలోచన చేసి పెట్టుకోవాలి.

* ముగ్గురు పిల్లలు ఉంటే, ముగ్గురు కు సమాన ధనం అనుకుని, ఒకరు మంచి కోసం, మిగతా ఇద్దరు కు చెందిన ధనం కూడా వాడి, మిగతా వారికి అన్యాయం చేయకూడదు. ఎవరి ధనం ఆస్తి వారికే ఉంచుకోవడం మంచిది.

* అదే విదేశాల్లో లేదా పక్కన రాష్ట్రం లేదా నగరం అయినా, అక్కడ ఉన్న వారిని, ఆ కాలేజీ లేదా వ్యాపారం లేదా ఉద్యోగం లేదా సంబంధం గురించి స్పష్టంగా వివరాలు తెలుసుకోవాలి. ఇంటర్నెట్ లో కూడా చాలా సమాచారం ఉంటుంది, అక్కడ ఎవరూ తెలియకపోయినా. తెలుసుకోలేకపోతే, వాటికి దూరంగా ఉండటము మంచిదేమో.

* తీరా అక్కడ కు వెళ్లిన తర్వాత మోసం అని తేలి, ఇబ్బందులు పడి, నష్టపోయి, పోలీసులు చేతిలో చిక్కిన లేదా ఉత్త చేతులు తో ఉసూరుమంటూ, వెనక్కు వచ్చిన వారూ ఉన్నారు.

* కొత్త విషయాలు గురించి, ముందు తీయటి కధలు కధలు గా చెబుతారు, ఆకర్షణ తో తమ వ్యాపారం చేసుకోవడం కోసం, తమ మాయలో పడేయడం కు. కాలేజీ వ్యాపారం పెళ్లి ఏదైనా ఆకర్షణీయమైన మాటలు మోసాలు ఎప్పుడూ ఉంటాయి.

మన అమాయకత్వం నిర్లక్ష్యం దురాశ పరుగులే, ఇతరులకు తేలిక ధన వ్యాపార మోస మార్గం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,786,502; 104 తత్వాలు (Tatvaalu) and views 217,098
Dt : 03-Sep-2021, Upd Dt : 03-Sep-2021, Category : General
Views : 688 ( + More Social Media views ), Id : 1242 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : self , think , criticize , people , support , golden , future , experienced
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content