యజుర్వేదం - రుద్రం నమకం చమకం - ఆధ్యాత్మికం మరియు ఆరోగ్యము - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,060; 104 తత్వాలు (Tatvaalu) and views 225,817.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

శివయ్య కు అభిషేకం చేసేటప్పుడు, రుద్రం నమకం చమకం చదువుతారు. ఊపిరి బిగబట్టి, శ్లోకాలు వరుసగా రాగయుక్తం గా, వారు జపిస్తారు. అనువాకము, మంత్రము, ఋక్కు, యజస్సు అని భాగాలుగా పిలుస్తారు. 13 పదములు కల వచన రూప మంత్రమునే యజుస్సు అంటారు.

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది, మరల దానిని తీసుకుపోయేది కూడా, ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది.

నమకం ఋగ్వేద దేవుడైన, రుద్రుని స్తోత్రము. పరమేశ్వరుడైన పరమశివుడిని, శ్రీ రుద్రంలో 100 శ్లోకాలతో, స్తుతించింది వేదం. వీటిలో నమ: అనే పదాలు, అధికంగా దొర్లినందువల్ల, ఈ మంత్రాలు నమకం గా ప్రసిద్ధి చెందాయి.

నమకం విశిష్టత : నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని, అనువాకం అంటారు. మొదటి అనువాకంలో, పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.

రెండవ భాగంలో, చమే అన్న పదం, మరల మరల రావటం వలన, దానిని చమకం అంటారు.

చమకం విశిష్టత - నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి, దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని, ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.

మనమూ పలికే ప్రయత్నం చేస్తే, మనశ్శాంతి, వాక్కు శుద్ది కలుగుతుంది. పిల్లల కు చాలా తేలిక. మాట స్పష్టంగా, నత్తి లేకుండా బాగుపడుతుంది, ఈ చిన్ని ప్రయత్నం తో. ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యముగా ఎటూ లాభమే.

ఓం హరహర మహా దేవ శంభోశివ శంకరా.

రుద్ర నమక చమకాలు చదవడం ఆరోగ్యం కూడా. ప్రాణాయామం లాగా, ఊపిరి ఆపుకోవడం వలన, నరాలు ఉత్తేజవంతమై, రక్త ప్రసరణ బాగుంటుంది. రక్తపోటు, రక్తం గడ్డ కట్టింది , అలాంటి జబ్బులు రావు.

మొదట ఇవి చదవడం కష్టం గా ఉంటాయి, పదవ తరగతి కూడా కష్టమే కదా. 5 సార్లు ఒక్కో పదం, చదివితే, అన్ని తేలికనే.

కొన్ని తప్పులు దొర్లుతాయి కూడా. ఎక్కడ ఆపాలి అని, జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి. అందుకే 10 ఏళ్ల లోపు పిల్లల కు నేర్పితే, చాలా తేలికగా నోరు తిరుగుతుంది.

పెద్దలు అయినా కూడా, సాధనము న సమకూరు విద్య లెల్ల. తినగ తినగ వేము లాగా. ప్రయత్నం చేసి వినిపిస్తారు కదూ, ఓ పంక్తి. రక్తపోటు కు దూరంగా ఉంటారు కదూ.

పిల్లల కు చూపించి వినిపించాలి, నాభి లో నుంచి, పలుకు, మాట, మంత్రం రావాలి. అప్పుడే వైబ్రేషన్ లు వస్తాయి. తన్మయత్వం వస్తుంది, కన్నీళ్లు వస్తాయి. మానసిక ఉత్తేజం వస్తుంది.

ఆడియో ప్లేయర్ తో వింటే కాదు, మన సొంత నోటి పలుకు ఉండాలి. నేర్చుకోవడానికి వినవచ్చు, కాని పూజ అప్పుడు మనమే చదవాలి.

ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి మన ఎదురు గా కూర్చుని ఉంటే, మనం నేరుగా గౌరవించి మాట్లాడకుండా, పక్కన టేప్ రికార్డు పెట్టి లేదా వేరే వాళ్ళు అన్నది గమ్ముగా డబ్బింగ్ నటన చేస్తే, ఆ మంత్రి ఏమనుకుంటారు? ఎదురు గా ఉంటారా? అవమానించారని అవమానిస్తున్నారని, వెంటనే వెళ్లి పోతారు.

మరి అన్ని ఇచ్చిన దేవ దేవుని పూజలో కూడా, టేప్ రికార్డు లేదా ఎంపీ3 ఆడియో తో, అవమానిస్తామా? పాపం వస్తుంది. ఉన్నవి, చివరలో అయినా పోతాయి, మన అహంకారం కు. దేవుడు ఇచ్చిన వాక్కు, ఆయనకే వాడనూ అంటే.

రాకపోతే, రామ రామ అన్నా చాలు కదా, ఎవరు చేయమన్నారు ఇష్టము లేని దానిని.

చమకం లో ఓ చిన్న భాగం
శంచమే మయశ్చమే ప్రియంచమే నుకామశ్చమే సౌమనసశ్చమే భద్రంశ్చమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యాంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంశ్చమే మహశ్చమే సంవిశ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసూశ్చమే శీరంశ్చమే లయశ్చమే ఋతంచమే మృతంచమే యక్ష్మంచమే నామయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే నమిత్రంచమే భయంచమే సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే ||

నమకం లో ఓ చిన్న భాగం
నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః.

నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం+ పతయే నమో
నమః సస్పింజరాయ త్విషీమతే పధీనాం+ పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేన్నానాం+ పతయే నమో
నమో హరికేశా యోప వీతినే పుష్టాణాం+ పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం+ పతయే నమో
నమో రుద్రాయా తతావినే క్షేత్రాణాం+ పతయే నమో
నమః సూతాయా హంత్యాయ వనానాం+ పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం+ పతయే నమో
నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం+ పతయే నమో
నమో భువంతయే వారివస్కృతా యౌషధీనాం+ పతయే నమో

మః ఉచ్చైర్-ఘోషా యాక్రందయతే పత్తీనాం+ పతయే నమో
నమః కృత్స్న వీతాయ ధావతే సత్వనాం+ పతయే నమః

Srirudram.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,060; 104 తత్వాలు (Tatvaalu) and views 225,817
Dt : 12-Feb-2020, Upd Dt : 12-Feb-2020, Category : Devotional
Views : 1668 ( + More Social Media views ), Id : 830 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : yajurveda , shiva , rudram , namakam , chamakam , spirituality , health
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content