పాటతో పరమార్ధం - ఏనుంగు నెక్కి, కవి తిక్కన పద్యము - నర్తనశాల - ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్, రేలంగి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,927; 104 తత్వాలు (Tatvaalu) and views 226,365.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Yenungu nekki, poet Tikkana padyam - Nartanasala 1963 - NTR, Savitri, SVR, Relangi

నేటి రాజకీయ నాయకులు ఎలా తూర్పార బడుతున్నారో, ఒకరి నొకరిని మనం చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము, పిల్లలకు/ మనుమలకు నేర్పుతున్నాము.

అయ్యో నాయకులు ఎక్కడ నుంచి వచ్చారు? మనలో నుంచే కదా. మన ఇంటి కుసంస్కార పెంపక లక్షణాలు, నక్క పులి పాము బుద్దితో, మన కన్నా ఎక్కువ కుసంస్కారులను ఎన్నుకుంటున్న ఫలితమే, ఈ నేటి బూతు పంచాంగం. గుణవంతులను మనము నిలబెట్టము, గెలిపించము, ధనమిచ్చి బతికించము.

టీవీలలో, సోషల్ మీడియాలో, మన భాగస్వామి పిల్లలు మనుమలు, చక్కగా ఈ నాయకుల బూతు మాటలు విసుర్లు గొడవలు, పాఠాలుగా నేర్చుకుని, బడిలో తోటి విధ్యార్ధులతో, ఇంట్లో మనతో వాదిస్తున్నారు. ఆ పాపము మనదే.

మరి ఆనాడు భారతములో, అజ్ఞాతవాసములో విరాట్ సామ్రాజ్యములో ఉన్న అర్జునుడు, తనతో యుద్దానికి వచ్చిన రారాజు దుర్యోధనుని, ఎలా తూర్పార బడుతున్నారో చూడండి.

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో మునిగి, ముదుసలి తల్లి దండ్రులను అత్త మామాలను దగ్గర ఉంచుకుని, సజీవ గురువు సేవ చేయకపోతే, పిల్లలకు సంస్కారం నేర్పకపోతే మనకు అనాధ శరణాలయమే ఒంటరి బతుకే. చివరకు మనకు అహంకారపు రారాజు గతే పడుతుంది.

ఇది జూదం కాదు రారాజా, వంచన చేసి, ఓడించడానికి. నిఠలాక్షుని జయించిన కిరీటి తో యుద్దం.

సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
రా. పురవీధుల గ్రా.లగలదె...
మణిమయంబగు భూషణ జాలములనొప్పి
ఒడ్డో.లగంబున నుండగలదె..
కర్పూర చందన కస్తూరి కాదుల
నింపు సొంపా.ర భోగింపగలదె..
అతి మనో.హరలగు చతురాం.గనల తోడి
సంగతి వేడ్కలు సలుపగలదె..

గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర..
వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె..
జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము.. ఆ ఆ ఆ

నర్తనశాల సినిమాలో ఘంటసాల గానం చేసిన ఈ పద్యం చాలామంది విని వుంటారు. భారతం విరాటపర్వం లోనిది ఈ పద్యం. కవి తిక్కన సోమయాజి. సందర్భం ఉత్తర గోగ్రహణ సమయంలో కురుసేనను కకలావికలం చేసి, దుర్యోధనుణ్ణి ఓడించి, అతని ఎదురుగా నిలిచి, అతన్ని ఉద్దేశించి అర్జునుడు ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ చెప్పిన మాటలు ఇవి.

ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి చూసుకో. అసలు నీకు సిగ్గనేది ఉంటే ఎక్కడన్నా పడి చావు. తొల్లింటి చూఱగలదె (చూఱ అంటే కొల్ల, దోచుకోవడం) – ఇంతకు ముందు లాగా ఇంకా కొల్లగొడదామనుకుంటున్నావేమో – ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం.

నిజానికి పై వివరమంతా చెప్పాల్సిన పని లేదు. పద్యం చదువుతుంటేనే జ్వరతీవ్రతతో శరీరం వేడెక్కుతున్నట్టుగా పఠితకు పద్యభావంతోటి తాదాత్మ్యత ఎక్కిపోతూ వుంటుంది. జూదమిక్కడ ఆడంగరాదు సుమ్ము అని ఆఖరు పాదం చెప్పడం, పద్యంలోని నాటకీయతకు ఎంత అందమైన కొసమెరుపు నిచ్చిందో గమనించారు గదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,927; 104 తత్వాలు (Tatvaalu) and views 226,365
Dt : 28-Feb-2024, Upd Dt : 28-Feb-2024, Category : Songs
Views : 138 ( + More Social Media views ), Id : 2041 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : yenungunekki , Yenungu , nekki , padyam , poem , Eenungu , poet , Tikkana , Nartanasala , NTR , Savitri , SVR , Relangi , Ghantasala , Narthanasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content