మీ అమ్మ మీ ఇష్టం, మాకు వద్దు ముదుసలి మనిషి, ట్రాన్సఫర్ లు లేదా విదేశాలు తిరుగుతూ ఉంటే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1632 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1667 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, ఆలోచన చేయండి, మన కన్నతల్లి కి ఎవరైనా మంచి వైద్యం చేపిస్తే, ఏమంటాము మనము? నమస్కరించి ధన్యవాదాలు చెప్పి, మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేము అంటాము. కృతజ్ఞతలు చూపిస్తాము ఏ పనిలో అయినా, వారికి వ్యతిరేకంగా వెళ్ళము. వారికి వీలైనంత మంచి చేస్తాము, అడిగి మరీ లేదా అడగకుండా నే. మరి మా విచిత్రం చూడండి.

మా ముత్యాల కుటుంబ 2014 వాదన వినండి - మీ అమ్మ మీ ఇష్టం, మాకు వద్దు, ముదుసలి మనిషి, మేము ట్రాన్సఫర్ లు లేదా విదేశాలు తిరుగుతూ ఉంటే, మాకు అడ్డం. అసలే ఆమెకు ఉన్న బీపీ షుగర్ రోగాలు. మీ అమ్మను, నీకు ఇష్టం ఉంటే తీసుకెళ్ళు, కష్టం ఉంటే, ఇక్కడ వదిలేయి. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, మాకు సంబంధం లేదు. మాకు రాయాల్సింది, ఎవరూ లేకుండా తన్ని, పెద్దల సాక్ష్యం లేకుండా, రాయించుకున్నాము, పదిమందికి అమ్ముకున్నాం, ధనము ముఖ్యము కాబట్టి.

అయ్యా, ఆమె వద్దు బాబోయ్, చూసినందుకు, ఆమె ఆస్తి లేదా ఎగష్టా ధనం కూడా వద్దు గాక వద్దు. మీకో దండం. మాకే ఒకళ్ళు చెయ్యాలి, మేము మీ అమ్మకు చేయడం, మా వల్ల కాదు, పనిమనిషి ఉన్నా మేము కనిపెట్టుకోలేము.

వాళ్ళ అత్త మామల ఇంటికి వెళ్లి చెప్పినా కూడా, ప్రయోజనం లేదు, అంతా సైలెంట్. అంతా కలసి పండుగలు ఆనందంగా, ఒక ముదసలి పీడ వదిలింది అని. తామూ తర్వాత లైన్ లో ఉన్నాము అని తెలిసినా.

ఇదీ నేనూ తప్పు పట్టను, వద్దు అనుకున్నారు. అవకాశవాదుల నాటక పీడ వదిలింది, అని దేవుని దయతో అమ్మ ను తెచ్చాను, కూతురు లా చూస్తున్నా.

ఇంకో వైపు, పెద ముత్యం చుట్టం తో భూకబ్జా, సరే పాపం పండుతుంది ఎప్పుడు అయినా కదా.

2018 లో వారి మానవత్వం లేని వాదన. వాళ్ళ అమ్మకు ఆయన కోటి పెడతాడో, వెయ్యి పెడతాడో, మాకేం సంబంధం అసలు? మాకు ఏమైనా ఇచ్చాడా? మేమెందుకు మంచి చేయాలి వారికి, మమ్మల్ని అడిగారా సహాయము? మేము గడప దాటాక, మాకు సంబంధం లేదు, ఇంక మాకు పైసా రాదు ఎటూ. మా ఉద్యోగం, మా పిల్లలతో మాకే తీరికలేదు, అని ఒక నాలుకతో. మమ్మల్ని తప్పు ఎత్తి చూపిస్తే మాత్రము, మేమూ వాట్సప్ ఆపుకుంటాము, ఊళ్ళో వాళ్ళు చూసినా మాకు ఇబ్బంది లేదు.

రెండో నాలుకతో మిగతా అవకాశవాదులతో, మా అమ్మ కలలోకి వస్తుంది, కిటికీ ఊసల నుంచి తొంగి చూస్తున్నాము. వాళ్ళ అమ్మని, మాకు షోకేసు బొమ్మ లాగ చూపించడం లేదు. పని మనిషి లాగ, మాకు సేవ చేయనీయడం లేదు. ఈయన లేనప్పుడు, ఎన్ని ఇళ్ళు ఊళ్ళు కు తిప్పుకున్నాం, ఎంత ఇంటి వంట పని చేపించాం. అంతా పాడు చేశాడు ఇప్పుడు వచ్చి, తప్పుడు మనిషి. మా ఉచిత పని మనిషి ని మాకు దూరం చేశాడు. లేకపోతే, కాలు మీద కాలు వేసుకుని, దర్జాగా తిరిగే వాళ్లం, చేపించుకుంటూ.

కృతజ్ఞతలు లేకపోగా, ఇంకా అబద్ధాలు చెప్పుకుని, మొసలి కన్నీళ్లు తో, సమస్యలు సృష్టించడం. కాబట్టి, వారు కూడా దైవ నిర్ణయం కే ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే తప్పులు ఒప్పుకోరు కాబట్టి. అని రాము గోపీ తో చెప్పాడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1667 General Articles, 64 Tatvaalu
Dt : 08-Apr-2020, Upd Dt : 08-Apr-2020, Category : General
Views : 631 ( + More Social Media views ), Id : 480 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mutyaalu , mother , issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content