పాటతో పరమార్ధం - అప్పుచేసి పప్పుకూడు ఏలర ఓ నరుడా, గొప్పదైవ - అప్పుచేసి పప్పుకూడు Parody - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,402; 104 తత్వాలు (Tatvaalu) and views 226,076.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Appuchesi pappukudu elara o naruda - Appuchesi pappukudu- NTR, Savitri, SV Ranga Rao, Jaggaiah, Jamuna, Relangi, Girija

అప్పు కూడా ఒక వ్యసనం, అది లేకుండా 80 శాతం మంది బతక లేరు, వీరు అరిషడ్వర్గం అష్టవ్యసనం లో ఉన్నారు అంటే, మానసిక బలహీనత అంటే, ఆత్మ ద్రోహముతో, ఒప్పుకోలేరు. కానీ కాలం ఒప్పిస్తుంది, అదే ఆత్మ ద్రోహము తో తన చుట్టూ ఉండే వారితో, అంటారు పెద్దలు.

అప్పు చేసి పప్పు కూడు వద్దు అని గణపతి సచ్చిదానంద స్వామి వారు శిష్యుల మాటలను వినండి. పూజలు యాత్రలు చేస్తున్న కూడా, అప్పు లేనిదే కారు, ఇళ్ళు, పెళ్ళి లేదు అనే దౌర్భాగ్యం కు దిగజారాం. ఒకటో ఇల్లు, స్ధలం అప్పు అయితే, మరలా రెండో స్ధలం, ఇల్లు అప్పు తో. వడ్డీ అలాగే ఇళ్ళు రేట్లు పెంచేది మనమే. దానిని బట్టి మిగతా అన్ని రేట్లు పెరగడం. ఆ తర్వాత మన సొంత పిల్లలు కే అప్పులు పుట్టవు, ఇళ్ళు స్ధలాలు దొరకవు. ఎవరు చేసిన ఖర్మ వారి వంశానికే దెబ్బ, అంటారు పెద్దలు.

ఎవరినైనా కదిలించండి, అప్పు ఇస్తావా, అంటే లేదు అంటారు. మరి నువ్వు అప్పు చేసావా అంటే, అబ్బో చాలా చేసాను అంటారు, వ్యాపారం ఇళ్ళు వస్తువులు ఆర్భాటాలు ఆడంబరాలకు. కొందరైతే, బాంకు ల నుంచి అప్పు తెచ్చి, కంపెనీలు పెట్టి, జనాలను ముంచారు. అప్పు చేయని వారికి కూడా, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, మీ విలువ పెంచుకోండి అని, చాలా మంది వెంటపడతారు.

విషము ఓ బొట్టు మా కోసం దయచేసి తాగమని, మన కాళ్ళ మీద పడి కన్నీళ్ళు తో ప్రాధేయపడితే, జాలి పడి తాగుతామా? అప్పు అయినా అంతే. అత్యవసరం, అలాగే మన స్తితి గతి ని బట్టి, అప్పు చేయాలి, వెంటనే బాధ్యత గా తీర్చాలి.

ఒకటో ఇల్లు అవసరం, మన స్థాయి, 100 రూపాయలు అయితే, 2 గదుల ఇల్లు, ఆ ఇల్లు రోజూ మన శుభ్రం చేసే ఆరోగ్యం సమయం స్థాయి ఉంటే, 75 రూపాయలు మన చేతిలో ఉండి, ఆదాయం ఉండి, 25 రూపాయల అప్పు ఓకే. అదీ ఆ ఇల్లు అమ్మ కుండా, కన్నీళ్ళు తగవులు మోసాలు లేకుండా, తీర్చగలము సమయానికి, అన్న నమ్మకం ఉంటే.

అలా కాకుండా, 200 వందల రూపాయల 4 అంతస్తుల 4 గదుల ఇల్లు, చేతిలో ఉన్న 25 లేదా 50 పెట్టి కొంటే? అది దురాశ, ఆడంబరము, నేల విడిచి సాము చేయడం. ఇప్పుడు ఇంకో 2 వ 3 వ ఇల్లు కూడా కొంటే, ఇంకా ఎక్కువ అప్పుతో? అది అత్యాశ. వీరికి మనశ్శాంతి ఉండదు, ఇంట్లో వాళ్ళు వీరి మాట వినరు లెక్కచేయరు. మిగతా అన్ని విషయాలు కూడా దెబ్బ తింటాయి.

ఈ దురాశే, ఇళ్ళు రేట్లు మరియు అద్దెలు పెరగడానికి, ఇతరులను పతనం చేయడానికి, మొదటి కారణం. ధనం ఉందని ప్రతి ఒక్కరు ఇలా ఆలోచన చేస్తే, రేపు మన మనవళ్ళు ధనం లేక, అద్దె ఇల్లు చిక్కక, అవే అవస్థలు పడతారు. వ్యాపారం, మంచి ద్రుష్టితో చేయాలి, దురాశతో కాదు. వ్యాపారం, నలుగురు కి అన్నం పెట్టాలి, 100 మంది కడుపు కొట్ట కూడదు, కన్నీళ్ళు పెట్టించకూడదు.

ఈ స్వార్ధం తోనే, సత్రం పూటకుళ్ళ ఉచిత భోజనం నుంచి, కల్తీ కుళ్ళిన భోజనము కొనుక్కునే స్తాయికి వచ్చాము. ఎవరి స్వార్ధం వారికి ఉంటుంది, 10 మంది మంచి వీరికి అవసరం లేదు. మరలా, దేవుని కోరతారు కాపాడు అని, ఇంకోవైపు ఆయన బిడ్డలను కష్టపెడుతూ.

అలా పొట్ట కొడితే, కన్నీళ్ళు పెట్టిస్తే, బలవంతులదే రాజ్యం అని, రేపు నాయకులు రౌడీలు మోసగాళ్ళు బంధువులు స్నేహితులు, వీరి ఇళ్ళు ధనం కొల్ల గొడతారు, కదా? ఎవరి బలం బలగం న్యాయం ధర్మం వారిదే కదా, నీతి నియమానికి, పక్కన వారి క్షేమం కు, మనశ్శాంతికి తావు ఎక్కడ?

అప్పుచేసి పప్పుకూడు ఏలర ఓ నరుడా
గొప్పదైవ సాధనమిది వినరా పామరుడా - 2

దొంగతనము తప్పురా, దోపిడీలు ముప్పురా, ఐతే
తీర్చనంత అప్పుచేసి, ఆత్మను చంపకురా, నీ తలనే వంచకురా ||అప్పుచేసి పప్పుకూడు||

నీతిఉన్నవారు లేనివారు రెండేరెండు జాతులురా
ఉన్నదానితో సంత్రుప్తి, మోక్షానికి దోవరా, మనశ్శాంతి మూలమురా ||అప్పుచేసి పప్పుకూడు||

వేలిముద్ర వేయకురా, సంతకాలు చేయకురా
కోర్టుకెళ్ళి ఐపి అని, కుటుంబవంశ పరువు తీయకురా, నలుగురితో ఊపించకురా||అప్పుచేసి పప్పుకూడు||

రూపాయే దైవమురా, రూపాయే లోకమురా
అన్నవాడు, చివరకు ఒంటరి అనాధ బ్రతుకురా, భూమికి భారమురా ||అప్పుచేసి పప్పుకూడు||

చాలినంత చిన్న, అద్దె ఇల్లైన చాలునురా
పెద్ద మిద్దెలెన్ని ఉన్న, 6 అడుగుల గొయ్యేను రా, అంతకన్నా ఏమీ రాదురా ||అప్పుచేసి పప్పుకూడు||

ధనముతో నటన సేవలు, ఎవరికి గొప్పవునురా
కన్న తల్లితండ్రి సేవకన్న, ఏది ఉత్తమము రా, మోక్షానికి దారి రా ||అప్పుచేసి పప్పుకూడు||

అప్పుచేసి ఖర్చుచేసి ఆర్భాట, శుభకార్యాలు వద్దురా
ఆ ధనమే పొదుపు చేసి, వారి పిల్లల చదువుకు అందించరా, భవిష్యత్ కు ఉపయోగం రా ||అప్పుచేసి పప్పుకూడు||

బాంకుల సొమ్ము ఎగవేతతో, పెద్దవ్యాపారాలు వద్దురా
జనాల సొమ్ము ఊసురుతో, వంశ క్షయమే జరుగును రా, మందబుద్ది పిల్లలు పతనమురా ||అప్పుచేసి పప్పుకూడు||

అప్పులతో చనిపోతే, కుటుంబం చేతులు చాచాలిరా
మనము సేవకులుగా, దానిని మరుజన్మలో తీర్చాలి రా ||అప్పుచేసి పప్పుకూడు||

అసలు పాట -

అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా - 2

దొంగతనము తప్పురా దోపీడీలు ముప్పురా
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా ||అప్పుచేసి||

ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా
ఉన్న చోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా ||అప్పుచేసి||

వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా ||అప్పుచేసి||

రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా ||అప్పుచేసి||

చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959), సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు, గానం: ఘంటసాల, స్వర్ణలత
నందమూరి తారక రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, కొంగర జగ్గయ్య, జమున, రేలంగి వెంకట్రామయ్య, గిరిజ,

NTR, Savitri, SV Ranga Rao, Kongara Jaggaiah, Jamuna, Relangi, Girija

appuchesi pappukudu elara o naruda goppadaiva sadhanamidi parody  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,402; 104 తత్వాలు (Tatvaalu) and views 226,076
Dt : 09-Sep-2022, Upd Dt : 09-Sep-2022, Category : Songs
Views : 613 ( + More Social Media views ), Id : 1510 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : appuchesi , pappukudu , naruda , goppadaiva , sadhanamidi , ntr , movie , parody
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content