బాబాయి, మన రాజకీయ భవిష్యత్తు? ఏది మనకు, జగనన్న కు, అనుచరులు? వైవీ అభిమానులు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1247 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1277 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

వైవీ సుబ్బారెడ్డి బాబాయి, మన రాజకీయ భవిష్యత్తు ఏమిటి? ఏది మనకు, జగనన్న కు, మన అనుచరులు వారసులకు మంచిది? అని వైవీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో రాసిన ఆర్టికల్ గుర్తు ఉందా, లింకు లో చూడగలరు, చాలా వివరాలు ఉన్నాయి అందులో. link.

మరలా టీటీడీ పదవి ఇంకో సారి ఇచ్చి, కాళ్ళు చేతులు కట్టేస్తున్నారని, రాజకీయ జన జీవన స్రవంతి కి దూరంగా పెడుతున్నారు అని, బాబాయి ని తమ స్వార్థ రాజకీయాలకు బలిచేస్తున్నారు అని, తెలిసి ఆవేదన చెందుతున్నారు.

ఈ పెద్ద వయస్సు లో, అన్ని ప్రాంతాల్లో రాజకీయంగా తిరుగుతూ, తన కంటూ ఉన్న ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ, కొన్ని మంచి పనులు చేస్తూ, ప్రజల నోళ్ళల్లో రోజూ నానకుండా,

పుట్టి పెరిగిన జిల్లా కు ఏవిధంగా పనికిరాకుండా, వారసుడి కి ఓ అసెంబ్లీ స్ధానం పరిచయం చేసి కార్యకర్తలు లో తిప్పి కష్టపడి పైకి వచ్చే విధంగా, తను ఉన్నా లేకున్నా, భవిష్యత్తు మంచి దోవలో ఇప్పటికే పెట్టకుండా,

ఓ సామాన్య నాయకులు గా, ఒక దేవాలయాని కి మాత్రమే, సర్దుబాటు చేసుకుని, పక్కన కూర్చోవడం, ఆ స్ధాయి మనిషి కి, అర్థం లేని పని, అని అందరూ భావిస్తున్నారు.

ఒకవైపు రాష్ట్రం అప్పులు, ఇంకో వైపు జగనన్న బెయిల్, ఇంకో వైపు చంద్రన్న కుట్రలు, కోర్టు ల మొట్టికాయలు, అంతా గందరగోళం, భవిష్యత్తు తెలీదు.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి కదా, పెద్దలు కు ఆ మాత్రం తెలీకుండా ఉందా, అని నిట్టూర్పులు విడుస్తున్నారు.

లేదు లే, వయస్సు సహకరించదు, నేను తిరగలేను, వారసుడు వ్యాపారాలు చాలు, రాజకీయ భవిష్యత్తు వద్దు అనుకుంటే, ఆ త్రిమూర్తులు రాజకీయ పదవిని వదిలేసి, గమ్ముగా గుడుల చుట్టుపక్కల తిరిగితే, సరిపోతుంది కదా అంటున్నారు. దేవాలయము, రాజకీయాలు సరి పడవు.

జగనన్న కు సహాయం గా, రాష్ట్రం కు త్రిమూర్తులు గా ఉన్న ముగ్గురు లో ఒకరు గా, రాయలసీమ ప్రాంతంలో, అలాగే సొంత ప్రకాశం జిల్లా లో తన పలుకుబడి పరపతిని చూపించి, అభివృద్ధి పనులను చేపించి,

జగనన్న కు జరుగుతున్న నష్టం ను వివరించి, అందరం జగనన్న క్షేమం కొరకే అని, బాలినేని కి ఇబ్బంది లేకుండా నచ్చ చెప్పి, మన పనులు మనం చేసుకుంటే తప్పు ఏముంది, ఎందుకు ఈ దిశలో బాబాయి ఆలోచన చేయరు అని చర్చించుకుంటున్నారు.

వచ్చే సంవత్సరాలు చూద్దాం లే, రాజకీయ భవిష్యత్తు అనుకుంటే, ఈ కరోనా పరంపరలో ఎప్పుడు ఎవరికి ఏమౌతుంది ఎవరికీ తెలీదు, ఎవరి ఆరోగ్యం ఎవరికీ నమ్మకం లేదు, పాపం శమించు గాక.

కాబట్టి, ఎటూ టీటీడీ ఛైర్మన్ గా, కోరిక తీరింది కాబట్టి, ప్రతీ సంవత్సరం, తర్వాత ఏమిటి అని ఆందోళనతో ఆలోచన చేయకుండా, ఇప్పుడే మనం రాజకీయంగా, ఉత్తర ఆంధ్రా లో విజయ సాయి రెడ్డి స్ధాయి లో, బీజీ గా ప్రతిపక్షాలు ను ఎదుర్కొంటూ, భవిష్యత్తు కు రాజబాట వేసుకుంటే మంచిది అని, అలాగే ప్రకాశం జిల్లా భవిష్యత్తు కు బంగారు బాటలు వేయాలని, అభిమానులు కోరిక.

పనిలో పని గా, మా చీరాల జిల్లా కల ఫలించడానికి, మీ వంతు ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నారు, ఈ ప్రాంత ప్రజలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1277 General Articles, 47 Tatvaalu
Dt : 01-Jul-2021, Upd Dt : 01-Jul-2021, Category : Politics
Views : 171 ( + More Social Media views ), Id : 1224 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , followers , ttd , yv , subbareddy , fans , prakasam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content