భూకైలాస్ - జయ జయ మహాదేవా, నీలకంధరా దేవా - NTR, ANR, SVR, Jamuna - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2179 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2214 General Articles and views 2,474,724; 104 తత్వాలు (Tatvaalu) and views 265,887.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మనకు మన కుటుంబానికి ఏమి తక్కువ, ఎందుకు తక్కువ? కులమా, వర్గమా, ధనమా, సంస్కారమా, గుణమా, వంశమా, చదువా, క్రుతజ్ఞతా, విశ్వసనీయతనా, త్యాగమా, సేవ నా, చిత్తశుద్ది / త్రికరణశుద్దినా?

అందరమూ సమానమని అంటున్నప్పుడు, అన్ని తినాలి, అన్ని చూడాలి, అన్ని తిరగాలి, అన్ని కొనాలి, అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు బానిస అయ్యినప్పుడు, ఈ మంచి పనికి, ఎందుకు మనకు నోరు తిరగదు, ఈ మంత్రాలు పద్యాలు పాడలేని దుస్తితిలో, మన నాలుక మనస్సు కుటుంబం ఎందుకుంది?

మన ఇంటి పెద్దలను తప్పుడు వారిగా నిలబెడితే, దీనికి కారణం గా, మన తర్వాత తరం, మనల్ని క్షమిస్తుందా? మరి, ఎందుకు ప్రయత్నం చేయము?

మనల్ని మనం ఎందుకు తక్కువ చేసుకుంటున్నాము, ఆరోగ్యం అని తెలిసి కూడా? మరి ఇక మనకు ఈ జన్మకు వాక్సుద్ది రాదా? మానసిక నియంత్రణ లేదా? అరిషడ్వర్గాల అష్టవ్యసనాలు బానిసత్వం పోదా? అంత చేతగాని చవటలమా? కపట నటన అవసర అవకాశ బతుకులేనా ఇంకా, స్వయం పతనములో? పంచభూతాల చేతిలో, పాపాల శిక్షణతో పతనమేనా?

మరి, అన్ని వదిలి శ్మసానములో ఉండే శివునికి, వైరాగ్య భక్తులుగా ఎన్ని జన్మలకు మారగలము? మనసుతో ఆలోచన చేయండి, త్రికరణ శుద్ది గా వాటిని జయించి, త్యాగం సేవ సజీవ గురువు సేవలతో, మీ గొంతు పద్యాలు శ్లోకాలు పాడి, మిత్రులకు బంధువులకు పంపుతారు అని ఆశిస్తూ . .


Happy Maha Shivaratri. We have to show Shiva, Vinayaka, Kartikeya and Shakti guna in daily life by knowing ourselves with daily practice and humanity.

మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివయ్య, వినాయక, కార్తికేయ మరియు పార్వతమ్మ(శక్తి) గుణాలను నిత్యం జీవితంలో ఆచరణలో చూపడానికి, రోజూ సాధనతో మానవత్వం తో మనల్ని మనం తెలుసుకుందాం.

Thanks for devotional vocal songs from your home, it is a satvic practice with chittasuddi.

మీ ఇంటి నుండి, భక్తి స్వర గీతాలకు ధన్యవాదాలు, ఇది చిత్తశుద్ధితో కూడిన సాత్విక అభ్యాసం.

We all go to Kashi, from there to Rameswaram, and again to another place, and finally home. All left? I left the whole thing. What left, money or word of mouth? That's why no matter, how much you turn a bitter cucumber, how many poojas you perform, how many tirdas you immerse in it, the bitterness will not go away.

కాశీకి అందరము వెళతాము, అక్కడ నుంచి రామేశ్వరానికి, మరలా ఇంకో చోటికి, చివరికి ఇంటికి. అన్ని వదిలేశావా? మొత్తము వదిలేసాను. ఏమిటి డబ్బులా, లేక నోటి మాటలా వదిలింది? అందుకే చేదు దోసకాయను ఎంత తిప్పినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్దాలలో ముంచినా, ఆ చేదు పోదు.

So try to change by daily practice and know ourselves, for vaksuddi of mouth, good words, good songs, good thoughts, conquering ArishaDvarg and AshTavyasan. Do you sing for everyone to hear? We have to show Shiva guna in daily life.

కాబట్టి రోజువారీ అభ్యాసం ద్వారా మార్చడానికి ప్రయత్నించండి మరియు మనల్ని మనం తెలుసుకోండి, నోటితో వాక్సుద్ది కొరకు, మంచి మాటలు, మంచి పాటలు, మంచి ఆలోచనలు, అరిషడ్వర్గ్ మరియు అష్టవ్యసన బానిసత్వం జయించడానికి. మీరు పాడి అందరికీ వినిపిస్తారు కదూ? శివ గుణాన్ని రోజువారీ జీవితంలో చూపించాలి.

Lucky in any birth, if you are close to the temple, on Saturday, during the festival, Divine Darshan with Mom, crowd of *true devotees*, distribution of prasads.

ఏ జన్మలో అదృష్టమో, దేవాలయం కు దగ్గరగా ఉంటే శనివారం, పండుగ లో సందర్భంగా, దైవ దర్శనం అమ్మ తో కూడి, *నిజ భక్తుల* సందోహం, ప్రసాదాలు పంపిణీ.

జయ జయ మహాదేవా..., శంభో..., సదా. శివా...
ఆశ్రిత మందారా..., శృతిశిఖర సంచారా...

పల్లవి :
నీలకంధరా. దేవా.., దీన బాంధవా. రావా., నన్ను గావరా. 2
సత్య సుందరా.. స్వామీ..., నిత్యనిర్మలా.. పాహీ... 2 ||నీలకంధరా||

చరణం 1
అన్య దైవము.., గొలువా...ఆ ఆ
అన్య దైవము.. గొలువా.., నీదు పాదము... విడువా.. 2
దర్శనమ్ము నీరా., మంగళాంగా.., గంగాధరా.. 2 ||నీలకంధరా||

చరణం 2
దేహియన, వరములిడు దానగుణసీమా..
పాహియన్నను, ముక్తినిడు పరంధామా..
నీయమున, నీ దివ్యనామ సంస్మరణా..
ఏమరక, చేయుదును భవతాపహరణా..

నీ దయామయ దృష్టి, దురితమ్ములార..
వరసుధావృష్టి, నా వాంఛలీడేరా..
కరుణించు, పరమేశ, దరహాసభాసా..
హరహర, మహాదేవ, కైలాసవాసా... కైలాసవాసా..

ఫాలలోచన నాదు మొరవిని, జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ, జాగును సేయకయా.. 2

కన్నుల నిండుగ, భక్తవత్సల, కావగ రావయ్యా.. 2

ప్రేమమీర, నీదు భక్తుని, మాటను నిల్పవయా 2 ||ఫాలలోచన||

శంకరా, శివశంకరా, అభయంకరా, విజయంకరా ||3||

సంగీతం : R.సుదర్శనం , R.గోవర్ధనం; రచన : సముద్రాల; గానం : ఘంటసాల

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Bhookailas, jaya jaya mahadeva, nilakandhara deva, NTR, ANR, Jamuna, SVR

NTR as Ravana, ANR Narada, Jamuna as Mandodari, SVR as Mayasura  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2214 General Articles and views 2,474,724; 104 తత్వాలు (Tatvaalu) and views 265,887
Dt : 13-Nov-2022, Upd Dt : 13-Nov-2022, Category : Songs
Views : 726 ( + More Social Media views ), Id : 1613 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhookailas , jaya , mahadeva , nilakandhara , deva , ntr , anr , jamuna , svr
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content